వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డార్లింగ్ ‘డేట్’కు టైమివ్వు: కాంట్రాక్టర్ భార్యతో మంత్రి

|
Google Oneindia TeluguNews

సిమ్లా: ‘డార్లింగ్‌.. నాకూ కొంత సమయం కేటాయించు' అంటూ హిమాచల్‌‌ప్రదేశ్‌ రాష్ట్ర ఆరోగ్య మంత్రి కౌల్‌ సింగ్‌ ఠాకూర్‌ ఓ కాంట్రాక్టర్‌ భార్య‌కు చేసిన ఫోన్‌ రికార్డులు బయపటపడ్డాయి. ఓ అజ్ఞాత వ్యక్తి విడుదల చేసిన ఈ రికార్డులు, ప్రస్తుతం ఆ రాష్ట్రంలో కలకలం సృష్టిస్తున్నాయి.

జాతీయ మీడియాల్లో వచ్చిన కథనాల ప్రకారం.. నిరుడు లోక్‌సభ ఎన్నికల సమయంలో వీటిని రికార్డు చేసినట్లు పేర్కొంటూ ఓ అజ్ఞాత వ్యక్తి ఇటీవల వీటిని మీడియాకు విడుదల చేశారు. మంత్రి కాంట్రాక్టర్‌ భార్యను.. ‘డార్లింగ్‌' అని సంబోధించడం, తనకు కొంత సమయం కేటాయించాలని కోరడం, ఆమె అందాన్ని అభివర్ణిస్తూ మాట్లాడిన మాటలు ఫోన్‌ రికార్డుల్లో ఉన్నాయి.

 HP Health Minister's Phone Conversation Leaked; Calls Contractor's Wife 'Darling', Asks for 'Date'

ఇలా మంత్రి మాట్లాడిన 19 ఆడియో క్లిప్పింగ్‌లు విడుదలయ్యాయి. వీటిపై సీబీఐ విచారణ జరపాలని, మంత్రి తక్షణం రాజీనామా చేయాలని భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి గణేష్‌ దత్‌ డిమాండ్‌ చేశారు.

కాగా, ఫోన్‌ రికార్డులన్నీ నకిలీవని మంత్రి ఠాకూర్‌ పేర్కొన్నారు. ఇదంతా రాజకీయ కుట్రలో భాగంగా జరిగిందని ఆరోపించారు. ఇది ఇలా ఉండగా, కొత్తగా వచ్చిన ఈ రికార్డుల వివాదం హిమాచల్‌ప్రదేశ్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది.

English summary
Himachal Pradesh Health Minister Kaul Singh Thakur has been left embarrassed after an unidentified person leaked audio clips of alleged telephonic conversations between the Congress leader and a contractor and his wife to the media.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X