వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్త్రీలకు కౌగిలింత, నెట్లో అసభ్య ఫోటోలు: మంత్రి రిజైన్

By Srinivas
|
Google Oneindia TeluguNews

ఖాట్మాండ్: వరినాట్ల వేడుకలో మహిళలను కౌగిలించుకోవడానికి ప్రయత్నిస్తున్న ఫోటోలు, వీడియోలు బహిర్గతం కావడంతో నేపాల్ వ్యవసాయ మంత్రి హరిప్రసాద్ పరాజులి గురువారం రాజీనామా చేశారు. ఇవి లైంగిక వేధింపులను సామాజిక మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.

ఆయన సొంత పార్టీ సీపీఎన్-యూఎంఎల్ నేతలు కూడా మండిపడ్డారు. ఆయన తీరు అసభ్యంగా ఉందని పార్టీ అధికార ప్రతినిధి చెప్పారు. మంత్రిగా ఉంటూ ఎలా వ్యవహరించాలో తెలియదా అన్నారు. హరిప్రసాద్ రాజీనామాను ప్రధాని సుశీల్ కోయిరాలా ఆమోదించారు.

అందరూ చూస్తుండగా నేపాల్‌కు చెందిన సదరు మంత్రి అత్యుత్సాహంతో మహిళలను ఒకరి తర్వాత ఒకరిని కౌగిళ్లలో బంధించుకొని అసభ్యంగా ప్రవర్తించారు. అది ఇంటర్నెట్‌లో చక్కర్లు కొట్టడంతో ఆయన తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.

ఖాట్మాండ్

వరి నాట్ల ఉత్సవంలో పాల్గొన్న సమయంలో అక్కడ నిర్వహించిన ఆటాపాటల్లో మంత్రి కూడా మునిగితేలారు. ఈ సందర్భంగా మహిళల దగ్గరకు వెళ్లిన మంత్రి ఒక్కొక్కరిని తన కౌగిట్లోకి బంధించుకొని చిందులు వేశారు. దీన్ని అక్కడే ఉన్న ఫొటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు కెమెరాల్లో బంధించి ఇంటర్నెట్‌లో పోస్టు చేవారు.

కాగా, మంత్రి కౌగిలి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ ఓ 70 ఏళ్ల మహిళ కనిపించింది. ఆమె పేరు సాను కెసి. ఆమె ఆరోపణలను కొట్టి పారేశారు. ఈ ఘటనను మీడియా, మహిళా హక్కుల కార్యకర్తలు గోరంతలు కొండంతలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

English summary
Nepal's agriculture minister resigned Thursday following a storm of criticism after videos and photographs of him attempting to hug women during recent festival celebrations were posted online, officials said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X