వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఒబామా సంచలనం: 'గే' చేతికి ఆర్మీ పగ్గాలు?

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా సంచలన నిర్ణయం తీసుకున్నారు. తనకు తాను స్వలింగ సంపర్కుడిగా ప్రకటించుకున్న 'గే' వ్యక్తికి అమెరికా ఆర్మీ పగ్గాలు అప్పగించేందుకు సిద్ధమయ్యారు. అమెరికా తదుపరి ఆర్మీ సెక్రటరీగా ఎరిక్ ఫాన్నింగ్‌ను బరాక్ ఒబామా నామినేట్ చేశారు.

Obama nominates openly gay man to lead Army

గతంలో ఎరిక్ ఫాన్నింగ్‌ తనకు తాను 'గే'గా ప్రకటించుకున్నాడు. ప్రస్తుతం ఎరిక్ ఫాన్నింగ్‌ యుఎస్ అండర్ సెక్రటరీ ఆఫ్ ఆర్మీగా విధులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అధ్యక్షుడిగా బరాక్ ఒబామా తీసుకున్న నిర్ణయానికి సెనెట్ ఆమోదం పలికితే, యూఎస్ చరిత్రలో ఆర్మీ పగ్గాలు చేపట్టే తొలి 'గే'గా ఎరిక్ నిలుస్తాడు.

ఆయన వ్యక్తిగత జీవితంతో తనకు పనిలేదని, ఆర్మీలో ఆయనకున్న అపార అనుభవం, నాయకత్వ లక్షణాలను గమనించే కొత్త బాధ్యతలు అప్పగించేలా చేశాయని ఒబామా ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రపంచంలోనే అమెరికా ఆర్మీని అత్యున్నత స్ధానంలో నిలిపేందుకు ఎరిక్ ఫాన్నింగ్‌‌తో కలిసి పనిచేస్తామని ఒబామా తెలిపారు.

English summary
President Barack Obama on Friday nominated Eric K. Fanning to be secretary of the Army, which could make him the first openly gay secretary of a U.S. military branch.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X