వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గంటాపై బాబు ఆగ్రహం: రిషీకేశ్వరి పేరెంట్స్ (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నాగార్జున విశ్యవిద్యాలయం విద్యార్థిని రిషికేశ్వరి మృతి ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాస రావుకు అక్షింతలు వేసినట్లు సమాచారం. ఆ ఘటనపై గంటా శ్రీనివాసరావు అనుసరిస్తున్న వైఖరిపై ఆయన మండిపడ్డారని తెలుస్తోంది.

అంత దారుణమైన సంఘటన జరిగితే ఒక్కసారి మాత్రమే విశ్వవిద్యాలయానికి వెళ్లడమేమిటని ఆయన గంటాపై విరుచుకుపడ్డారని అంటున్నారు. ప్రతిపక్షాలు, విద్యార్థి సంఘాలు ప్రభుత్వానికి నష్టం కలిగించే రీతిలో వ్యవహరిస్తుంటే ఇలా వ్యవహరించడం సమంజసమైనా అని చంద్రబాబు ప్రశ్నించినట్లు తెలుస్తోంది.

ఇదిలావుంటే, రిషికేశ్వరి తల్లిదండ్రులు శుక్రవారంనాడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కలిశారు. గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో సీనియర్ల వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న రిషికేశ్వరి తల్లిదండ్రులు శుక్రవారం విజయవాడలోని క్యాంప్ ఆఫీస్‌లో సీఎం చంద్రబాబును కలిశారు.

సిఎంతో రిషికేశ్వరి తల్లిదండ్రులు

సిఎంతో రిషికేశ్వరి తల్లిదండ్రులు

శుక్రవారం ఉదయం మంత్రి గంటాను కలిసిన వారు ఆ తర్వాత నేరుగా సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లారు. తమ కూతురు ఆత్మహత్యకు కారకులైన నిందితులను కఠినంగా శిక్షించాలని వారు చంద్రబాబును కోరారు.

ఆత్మహత్యే శరణ్యం..

ఆత్మహత్యే శరణ్యం..

తమకు న్యాయం జరగకపోతే ఆత్మహత్యే శరణ్యమని రిషికేశ్వరి తల్లిదండ్రులు. తమ పోరాటం ర్యాగింగ్ పైనే అని చెప్పారు. తమ అమ్మాయిలో మరొకరు బలి కావొద్దన్నదే తమ ఉద్దేశ్యమన్నారు. ప్రిన్సిపల్ పైన చర్యలు తీసుకోవాలన్నారు.

విచారణ ముగిసింది..

విచారణ ముగిసింది..

రిషికేశ్వరి మృతి ఘటనపై విచారణ శుక్రవారంనాడు ముగిసింది. మూడో రోజు విచారణకు జిల్లా కాంతిలాల్ దండే, ఐయి సంజయ్, ఇతర అధికారులు హాజరయ్యారు, ఒకటి రెండు రోజుల్లో కమిటీ ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది.

గంటా హామీ..

గంటా హామీ..

బాధ్యులైనవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి గంటా శ్రీనివాస రావు రిషికేశ్వరి తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు.

English summary
It is said that Andhra Pradesh CM Nara Chandrababu Naidu has expressed anguish at AP minister Ghanta Srinivas Rao.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X