వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మహిళల నగ్న ఫోటోలుండవ్: ప్లేబాయ్ కీలక నిర్ణయం

By Srinivas
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: పెద్దల పత్రిక, ప్లేబాయ్ ఇక పైన మహిళల నగ్న చిత్రాలను ప్రచురించబోమని ప్రకటించింది. తమ పత్రికలో నగ్న చిత్రాలు ఉండబోవన్నారు. గత నెలలో ప్లేబాయ్ ఉన్నతస్థాయి సంపాదకులు జోన్స్ వ్యవస్థాపకులు హెఫ్నెర్‌ను సంప్రదించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.

ఈ విషయాన్ని ప్లేబాయ్ కార్యనిర్వహణాధికారి స్వాట్ ఫ్లాండర్స్ పేర్కొన్నారు. ఇన్నాళ్లు ప్లేబాయ్ మేగజైన్ మగాళ్లకు అందాల కనువిందు చేసింది. ఇప్పుడు వారిని నిరాశకు గురి చేస్తోంది. 1953లో మార్లిన్ మన్రో నగ్న ఫోటోల ప్రచురణతో సంచలనం రేపి ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కింది.

Playboy to stop publishing nude photos

అనంతరకాలంలో అనేక కష్టనష్టాలను ఎదుర్కొంది. 1975లో 5.6 మిలియన్లు ఉన్న సర్క్యులేషన్ ప్రస్తుతం ఎనిమిది లక్షలకు పడిపోయింది. మొదటి నుంచి రాజకీయంగానే కాకుండా మహిళల నుంచి అనేక విమర్శలు ఎదుర్కొంది.

తమను సెక్స్ వస్తువుగా చేస్తోందని ప్లేబాయ్ మేగజైన్ పైన మండిపడ్డారు. అయితే, తాజాగా ఇక నుంచి మహిళల నగ్న చిత్రాలు ఉండవని కీలక నిర్ణయం తీసుకుంది. సెక్స్‌కు సంబంధించిన అన్ని అంశాలు ఇంటర్నెట్లో ఫ్రీగా అందుబాటులో ఉంటున్న ఈ కాలంలో ప్రత్యేకంగా తమ పత్రికలో మహిళల నగ్న చిత్రాలు ప్రచురించాల్సిన అవసరం లేదని భావిస్తోంది. అయితే, కొంతలో కొంత ఆరబోత ఉండనుందని చెప్పింది.

English summary
Playboy will no longer publish photos of nude women as part of a redesign of the decades old magazine, according to a news report.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X