వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భార్యాభర్తలను విడదీసిన విద్యుత్తు కోత

By Pratap
|
Google Oneindia TeluguNews

అలహాబాద్: విచిత్రంగానే ఉండవచ్చు గానీ, విద్యుత్తు కోత భార్యాభర్తలను విడదీసింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రతాపగఢ్ జిల్లాలో చోటు చేసుకుంది. ప్రతి రోజూ ఆ జిల్లాలో విద్యుత్తు కోత సర్వసాధారణం.

రోజూ రాత్రిపూట కరెంట్ పోతోంది. క్యాండిల్ వెలుగులోనే భోజనం చేద్దామని భార్య అడిగితే భర్త మాత్రం కరెంట్ వచ్చాక తిందామని అనేవాడు. కరెంటు వచ్చే వరకు మేలుకుని ఉండి, తనకు వడ్డించాలని బలవంతపెట్టేవాడని, తాను కాదంటే కొట్టేవాడని భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Power cuts snap husband-wife ties in UP

దాంతో భార్య రుక్సానా బబ్లీ (32) భర్త ఖాదిర్ విడిపోయారు. వారికి ఏడేళ్ల క్రితం పెళ్లయింది. అయితే, ఖాదిర్ మాత్రం భార్యను చాలా ప్రేమగా చూసుకునేవాడని, పిల్లలతో కూడా బాగుండేవాడని చుట్టుపక్కల వాళ్లు చెబుతున్నారు. వాళ్లకు ముగ్గురు పిల్లలున్నారు.

ఎంత చెప్పినా ఖాదిర్ తన భోజనం అలవాటును మార్చుకోకపోవడంతో భార్య బబ్లీ అతనితో విడిపోయి సూరత్‌లోని తన పుట్టింటికి వెళ్లిపోయింది. ఖాదిర్ మాత్రం తనపై భార్య చేసిన ఆరోపణలను ఖండించారు.

పోలీసులు ఇద్దరినీ కలపడానికి ప్రయత్నించినప్పటికీ ఫలితంలేకుండా పోయింది. కోట్వాలీ స్టేషన్ ాఫీస్ బలిరామ మిశ్రా వారిద్దరి మధ్య సయోధ్య కుదర్చడానికి ప్రయత్నించారు.

English summary
Lengthy power cuts, which are making life miserable for people in Uttar Pradesh, have led to irrevocable differences between one particular couple in Pratapgarh district and caused a 'separation'.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X