వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జిమ్‌ వ్యాపారంలోకి విరాట్ కోహ్లీ: 90 కోట్ల పెట్టుబడి

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఇటీవల కాలంలో టీమిండియా స్టార్ ఆటగాళ్లు బిజినెస్ రంగంలోకి అడుగుపెడుతున్నారు. ఇప్పుడు తాజాగా ఈ కోవలోకి టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ చేరారు. జిమ్, ఫిట్‌నెస్ సెంటర్లు వ్యాపారంలోకి విరాట్ కోహ్లీ అడుగుపెట్టారు. దేశ వ్యాప్తంగా 75 పట్టణాల్లో సుమారు రూ. 190 కోట్ల పెట్టుబడిలో త్వరలో ప్రారంభించనున్నట్లు విరాట్ కోహ్లీ వ్యాపార భాగస్వామి సత్య సిన్హా తెలిపారు.

విరాట్ కోహ్లీ ఇందులో రూ. 90 కోట్లు పెట్టుబడి పెట్టినట్లు ఆయన తెలిపారు. ఈ జిమ్, ఫిట్‌నెస్ సెంటర్లు 'చిసెల్' అనే బ్రాండ్‌తో ప్రారంభించనున్నారు. విరాట్ కోహ్లీ ఏజెన్సీకి చెందిన కార్నర్ స్టోర్ & ఎంటర్టెన్మెంట్ సంస్ధకు చెందిన ఈ బ్రాండ్‌ను కోహ్లీ, చిసెల్ ఫిట్‌నెస్‌లు సంయుక్తంగా కలిగి ఉన్నారు.

Virat Kohli to invest Rs 90cr, set up chain of gyms

కార్పోరేట్ ఫిట్‌నెస్‌లో అగ్రస్ధానంలో ఉన్న చిసెల్ ఫిట్‌సెన్ సంస్ధ బెంగుళూరుకు చెందినది. ఈ సంస్ధ డైరెక్టర్ సత్య సన్హా మాట్లాడుతూ దేశంలోని వివిధ ప్రాంతాల్లో వివిధ ఫెసిలిటీస్‌తో కొత్తగా జిమ్‌లను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. రాబోయే కాలంలో ఫిట్‌నెస్‌కు సంబంధించిన ప్రేరణ దుస్తులను రూపొంచే ప్రణాళికలు కూడా ఉన్నాయని చెప్పారు.

గత ఏడాది ఇండియన్ సూపర్ లీగ్ పుట్ బాల్ (ఐసీఎల్)లో గోవా ప్రాంజైజీలో సహా యజమానిగా విరాట్ కోహ్లీ ఉన్న విషయం తెలిసిందే. ఇక టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కూడా స్పోర్ట్స్‌ఫిట్ పేరుతో ఉన్న జిమ్ వ్యాపారంలో పెట్టుబడులు పెట్టారు. రాబిన్ ఊతప్ప ఐటిఫిన్ అనే పుడ్ బిజినెస్‌లో పెట్టుబడులు పెట్టిన విషయం తెలిసిందే.

English summary
Cricketer Virat Kohli is set to start his own chain of gyms and fitness centres. One of Kohli's partners in the venture, Satya Sinha, said the total investment to launch 75 centers in three years is around Rs 190 crores.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X