వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అంబరీష్‌కు కౌంటర్‌గా తెరపైకి రమ్య, మరిన్ని చిక్కులే!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఇటీవల కేబినెట్ నుంచి 14 మందిని తొలగించి, 13 మంది కొత్త వారిని తీసుకున్నారు. పద్నాలుగో మంత్రిని తీసుకోవాల్సి ఉంది. దీనికి నటి, మాజీ ఎంపీ రమ్య పేరు ప్రధానంగా వినిపిస్తోంది.

అయితే, సిద్ధరామయ్య ఎవరిని తీసుకుంటారనే విషయమై ఆయన మనసులో ఏముందో తెలియడం లేదని అంటున్నారు. రమ్యను కేబినెట్లోకి తీసుకుంటారనే వార్తల పైన కాంగ్రెస్ పార్టీ నాయకులు స్పందిస్తూ.. ఇవి కేవలం పుకార్లేనని చెప్పారు. ఖాళీ అయిన 14వ కేబినెట్ స్థానంలో, తొలగించిన వారిలో ఒకరిని తీసుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయని అంటున్నారు.

తొడక్కుని విసిరేసే చెప్పును కాను: నటుడు అంబరీశ్తొడక్కుని విసిరేసే చెప్పును కాను: నటుడు అంబరీశ్

ఒక్కసారిగా పద్నాలుగు మందిని తొలగించడంతో ఇప్పటికే సిద్ధరామయ్య చిక్కుల్లో పడ్డారు. ఇప్పుడు రమ్యను తీసుకుంటే మరో సమస్య అవుతుందని, కాబట్టి తొలగించిన వారిలోనే ఒకరిని తీసుకోవచ్చుననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

రమ్య వర్సెస్ అంబరీష్

Ramya's inclusion into Karnataka ministry will worsen crisis: Congress sources

ఇటీవల మంత్రి పదవి నుంచి తొలగించిన వారిలో అంబరీష్ కూడా ఉన్నారు. ఆయన ఇప్పటికే అసంతృప్తి, ఆగ్రహంతో ఉన్నారు. మరోవైపు, కాంగ్రెస్ పార్టీలో రమ్య వర్సెస్ అంబరీష్‌గా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో రమ్యను తీసుకుంటే మరింత చిక్కులు వస్తాయని అంటున్నారు.

ఇరువురు కూడా వొక్కలింగ కమ్యూనిటీకి చెందినవారు. మాండ్యాలో అంబరీష్ పాపులర్ వ్యక్తి. అంతేకాదు, అక్కడ రమ్యకు కూడా పట్టు ఉంది. గత ఎన్నికల్లో ఆమె ఓడిపోయారు. ఆమె అంబరీష్ కారణంగానే ఓడిపోయారనే వాదనలు ఉన్నాయి.

అంతేకాకుండా, రమ్యను కేబినెట్లోకి తీసుకుంటే ఆమెను మండలికి పంపించవలసి ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది క్లిష్టమనదే అంటున్నారు. అంబరీష్‌కు వ్యతిరేకంగా రమ్యను తెరపైకి తీసుకు రావచ్చునని కొందరు అంటుంటే, అలాంటి సమీకరణమే ఓ ఫూలిష్ అని మరికొందరు అంటున్నారు.

భగ్గుమన్న అసంతృప్తి: ఎమ్మెల్యేగా అంబరీష్ రాజీనామా భగ్గుమన్న అసంతృప్తి: ఎమ్మెల్యేగా అంబరీష్ రాజీనామా

ఇప్పటికే అంబరీష్‌ను మంత్రివర్గం నుంచి తప్పింటిన నేపథ్యంలో, విపక్షాలు వొక్కలింగ ఓట్లను క్యాష్ చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో రమ్యనే అసలైన ఆప్షన్ అనే వారు కూడా లేకపోలేదు. ఆమె ద్వారా నష్టం పూడ్చుకోవచ్చునని అంటున్నారు.

రమ్యను తీసుకోవడమే అసలైన నిర్ణయం కాకపోవచ్చునని, కేవలం వొక్కలింగ కమ్యూనిటీ గురించి చూసుకుంటే, మరిన్ని సమస్యలు వస్తాయనే వారు కూడా ఉన్నారు. అదే సమయంలో తొలగించిన అంబరీష్‌ను కూడా తిరిగి తీసుకునే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు.

English summary
There appears to be no respite for Karnataka Chief Minister Siddaramaiah following the reshuffle of his cabinet. He had dropped 14 and inducted 13 into his ministry.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X