వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేసీఆర్‌పై రేవంత్ వింతకథ: స్పెషల్ అట్రాక్షన్, చప్పట్లు

By Srinivas
|
Google Oneindia TeluguNews

తిరుపతి: తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం పైలన పైన తెలంగాణ టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆదివారం నాడు మహానాడులో ఆసక్తికర కథను చెప్పారు. ఇందు అందర్నీ ఆకట్టుకుంది. మహానాడులో లోకేష్‌తో పాటు రేవంత్ రెడ్డి ప్రధాన ఆకర్షణగా నిలిచారు.

తెరాస పాలనపై రేవంత్ కథ చెబుతూ... 'ఒక ఇంట్లో డబ్బు నలుగురు అన్నదమ్ములు ఉన్నారు. డబ్బు సంపాదించే మార్గం చెప్పాలని నామా నాగేశ్వర రావును అడిగారు. ఒక కారు కొనుక్కోమని వారికి నామా సలహా ఇచ్చారు. హైటెక్ సిటీ ప్రాంతంలో తిప్పితే డబ్బులు వస్తాయని సూచజించారు.

Photos: టిడిపి మహానాడు

ఆ నలుగురు అన్నదమ్ములు కారు కొన్నారు. నలుగురు కారులో ఎక్కి హైటెక్ సిటీలో తిప్పారు. ఆ కారులో వారు నలుగురే ఎక్కి తిరుగుతున్నారు. డబ్బులు రాలేదు. దీంతో ఆ నలుగురు మరోసారి నామా వద్దకు వచ్చారు. మేం ఎంతగా తిరిగినా డబ్బులు రావడంలేదని చెప్పారు.

దానికి నామా నాగేశ్వర రావు గారు.. హైటెక్ సిటీ ప్రాంతంలో కారు తిప్పమంటే.. మీరు ఎక్కి తిప్పడం కాదని, ప్రయాణీకులు ఎక్కించుకోవాలని సూచించారు. అయితే, ఒకరి పైన మరొకరికి నమ్మకం లేక వారు నలుగురు కూడా కారులో కలిసి తిరుగుతున్నారు.

ఓసారి కారు ఆగిపోయింది. ఇదే విషయాన్ని వారు నామాకు చెప్పారు. కొంతదూరం నెడితే స్టార్ట్ అవుతుందని సలహా ఇచ్చారు. ఆ నలుగురు కిందకు దిగి ముందు నుంచి ఇద్దరు, వెనుక నుంచి ఇద్దరు కారు నెట్టారు. దీంతో కారు కొంచెం కూడా కదలలేదు. ఇప్పుడు తెలంగాణలో తెరాస కుటుంబ పాలన అలా ఉందని ఎద్దేవా చేశారు.

నారా లోకేష్

నారా లోకేష్

మహానాడులో రేవంత్ రెడ్డి, నారా లోకేష్ ప్రధాన ఆకర్షణగా నిలిచారు. రేవంత్, లోకేష్‌లు వేదిక పై నుంచి మాట్లాడినప్పుడు తెలుగు తమ్ముళ్లు చప్పట్లు, ఈలలతో సందడి చేశారు.

రేవంత్ రెడ్డి

రేవంత్ రెడ్డి

ఆదివారం నాటి మహానాడు ముగింపు సందర్భంగా తెలంగాణ టిడిపి నేత రేవంత్ రెడ్డి స్పీచ్‌కు మిగతా అందరికంటే మంచి స్పందన వచ్చింది. రేవంత్ ఉద్వేగపూరి, ప్రసంగం చేశారు.

ప్రమాణం

ప్రమాణం

తెలంగాణలో ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల గొంతుకై నిలవాలని, వారి సమస్యల పరిష్కారంలో నాయకులు, కార్యకర్తలు అండగా ఉండాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ మేరకు మహానాడులో ప్రమాణం చేయించారు. తెలంగాణలో బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా నిలవాలని, ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.

టిడిపి మహానాడు

టిడిపి మహానాడు

తెలంగాణలో నాయకులు ఆందోళన చెందవద్దని, తాను అన్ని వర్గాలకూ అండగా ఉంటానని చంద్రబాబు భరోసా ఇచ్చారు. తెలంగాణపై ఆదివారం ప్రవేశపెట్టిన నాలుగు తీర్మానాలను ఏకగ్రీవంగా సభ ఆమోదించినట్లు ప్రకటించారు. ఆయా తీర్మానాలపై తెలంగాణ రాష్ట్ర నాయకులు ప్రసంగించారు.

టిడిపి మహానాడు

టిడిపి మహానాడు

తెలంగాణ మహిళా అధ్యక్షురాలు శోభారాణి మాట్లాడుతూ.. ఉద్యమానికి ముందు అప్పుల్లో ఉన్న కేసీఆర్‌ కుటుంబం ఇప్పుడు కోట్లకు ఎలా పడగెత్తిందని ప్రశ్నించారు. చంద్రబాబు తరహాలో స్వచ్ఛందంగా కేసీఆర్‌ కుటుంబం తమ ఆస్తుల జాబితాను ప్రకటించాలని డిమాండ్‌ చేశారు.

టిడిపి మహానాడు

టిడిపి మహానాడు

తెరాస హామీలు.. వైఫల్యాలు అంశంపై తీర్మానాన్ని పార్టీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టి మాట్లాడారు. పిట్టకథలు, చలోక్తులతో కేసీఆర్‌ కుటుంబ పాలనపై ఉద్వేగ పూరితంగా ప్రసంగించారు.

 టిడిపి మహానాడు

టిడిపి మహానాడు

తెలంగాణలో కేసీఆర్‌ వంద నియోజకవర్గాల్లో లక్ష అబద్ధాలు చెప్పారని, హామీలన్నీ కాలం చెల్లిన కాగితాలుగానే మిగిలాయని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ ప్రలోభాలకు లొంగి తెరాస పంచన చేరిన కొందరు టిడిపి నాయకులు ఇప్పుడు బతకలేక బానిసలుగా మిగిలారన్నారు.

టిడిపి మహానాడు

టిడిపి మహానాడు

తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆత్మ బలిదానాలు చేసిన వారికి న్యాయం చేస్తానని తీర్మానాలు చేసి ఇప్పుడు వారి చిరునామాలు దొరకలేదని కుంటిసాకులు చెపుతున్నారని మండిపడ్డారు. వారి త్యాగాలను అధికారంగా, కుర్చీలుగా మార్చుకున్న కేసీఆర్‌కు ప్రజలే గుణపాఠం చెపుతారన్నారు.

 టిడిపి మహానాడు

టిడిపి మహానాడు

వచ్చే ఎన్నికల్లో 153 అసెంబ్లీ స్థానాలు రానున్నాయని వీటిలో 100 మంది యువతకు అవకాశం ఇచ్చి కచ్చితంగా 99 సీట్లు గెలుస్తామని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. దీనికోసం ఆలంపూర్‌ నుంచి ఇంద్రవల్లి వరకూ పాదయాత్ర చేస్తామన్నారు. తెలంగాణ మట్టిమనదిరా...తెలుగుదేశం పార్టీ మనదిరా అని నినదించారు.

English summary
Revanth Reddy and Nara Lokesh are stars at Telugudesam mahanadu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X