వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డారెన్ సామీని ఫోన్‌కాల్‌పై 30 సెకన్లలో పీకేశారట

By Pratap
|
Google Oneindia TeluguNews

సెయింట్ జాన్స్ (ఆంటిగ్వా, బార్బుడా: రెండు సార్లు ట్వంటీ20 ప్రపంచ కప్‌ను అందించిన వెస్టిండీస్ జట్టుకు నాయకత్వం వహించిన డారెన్ సామీ తన ఆవేదనను వ్యక్తం చేశాడు. తనకు 30 సెకన్ల ఫోన్ కాల్‌పై ఉద్వాసన పలికారని చెప్పాడు. సెలెక్టర్ల చీఫ్ ఫోన్ చేసి 30 సెకన్లు మాట్లాడి తనకు ఉద్వాసన చెప్పాడని ఆయన చెప్పారు.

WT20 winning captain Darren Sammy sacked 'in 30-second phone call'

ఉద్వేగభరితమైన మాటలతో కూడిన వీడియోను ఆ 32 ఏళ్ల వెస్టిండీస్ ఆటగాడు ఫేస్‌బుక్‌లో పోస్టు చేశాడు. ఆరేళ్ల తన ఆట ముగిసిందని ఆయన చెప్పాడు. చొక్కా విప్పేసి, పడకపై పడుకుని రెగ్గీ సంగీతాన్ని ఆస్వాదిస్తూ తను జట్టు నుంచి తొలగించారని చెప్పాడు.

నాకు నిన్న ఫోన్ వచ్చింది. అది దాదాపు 30 సెకన్లు ఉండవ్చచు. ట్వంటీ20 జట్టు నాయకత్వ తీరును సమీక్షించామని, నువ్వు ఉండడం లేదని, తన ఆటతీరు జట్టులోకి తీసుకోవడానికి తగిన ప్రతిభ లేదని నాకు చెప్పారు అని వీడియోలో సామీ చెప్పాడు.

సామీ తన కెప్టెన్సీలో 2012లోనూ 2016లోనూ వెస్టిండీస్‌కు ట్వంటీ20 ప్రపంచ కప్2ను అందించాడు. వెస్టిండీస్‌కు నాయకత్వం వహించాలని ఆరేళ్ల కింద తనను అడిగారని, తన కెరీర్‌లోనూ జీవితంలోనూ అతి పెద్ద సవాల్ అని తాను అనుకున్నానని సామీ అన్నాడు.

ఆ లక్ష్యం ఎంత కష్టతరమైందో తనకు తెలుసునని, తను సవాల్‌ను స్వీకరించానని, కష్టాన్ని ఆలింగనం చేసుకున్నానని అన్నాడు. మైదానంలోకి దిగిన తర్వాత ప్రతి రోజూ తన కృషినంతా పెట్టానని చెప్పాడు. భారత్‌తో జరుగుతున్న నాలుగు టెస్టు మ్యాచుల సిరీస్ ముగిసిన తర్వాత వెస్టిండీస్ రెండు ట్వంటీ20 మ్యాచులు ఆడుతుంది.

English summary
Darren Sammy, who led West Indies to the World Twenty 20 title in 2012 and 2016, claimed that he has been sacked as captain in a 30-second phone call from the head of selectors.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X