హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో ఉమెన్స్ కాలేజి: బ్రాహ్మణికి చేతినిండా పని?

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ బోసిబోయిన స్థితిలో అందులో ఉమెన్స్ డిగ్రీ కాలేజీని ఏర్పాటు చేయనున్నారని సమాచారం. అయితే ఈ డిగ్రీ కాలేజీని వచ్చే ఏడాది విద్యా సంవత్సరం నుండే ప్రారంభించాలా? లేక ఆపై ఏడాది నుంచి ప్రారంభించాలా? అన్న విషయమై ఎన్టీఆర్ ట్రస్ట్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు.

ఏపీ రాష్ట్ర విభజనకు ముందు ఎంతో ఘనచరిత్ర కలిగిన ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ విభజన అనంతరం తన ప్రాభవాన్ని కోల్పోతున్న సంగతి తెలిసిందే. చంద్రబాబు నాయుడు సీఎం అయిన తర్వాత 1996లో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నిర్మాణం ప్రారంభమైంది. షేక్‌పేట మండలంలో జూబ్లీ హిల్స్ చెక్‌పోస్టుకు సమీపంలో అత్యంత ఖరీదైన ప్రభుత్వ స్ధలాన్ని తెలుగుదేశం పార్టీ 100 సంవత్సరాలకు లీజుకు తీసుకుంది.

లీజు ఒప్పదం ప్రకారం ట్రస్ట్‌ భవన్ ప్రభుత్వానికి ఏడాదికి సుమారు రూ. 20 వేల అద్దె చెల్లిస్తుంది. దీనిని బట్టి చూస్తే టీడీపీ ఆ స్థలాన్ని తీసుకుని ఇప్పటికే 20 ఏళ్లు పూర్తయింది. చంద్రబాబు ఉమ్మడి ఏపీకి సీఎం అయినప్పటీ నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు 2014లో ఎన్నికలు జరిగేంత వరకూ ట్రస్ట్‌భవన్‌ ఎంతో కీలకపాత్ర పోషించింది.

2014లో ఏపీ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఏపీలో టీడీపీ అధికారంలోకి రావడంతో కొన్ని నెలలు పాటు పార్టీ కార్యకలాపాలు బాగానే జరిగాయి. అంతేకాదు ఏపీకి రాజధాని లేని కారణంగా చంద్రబాబు నాయుడు హైదరాబాద్ నుంచే తన పార్టీ కార్యకలాపాలను కొనసాగించారు.

అయితే ఈ క్రమంలో తెలంగాణలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలు తెలుగు రాష్ట్రాల్లో వేడిని పెంచాయి. ఈ ఎన్నికల్లో ఓటుకు నోటు కేసు తెరపైకి వచ్చింది. ఈ కేసులో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడి పాత్రపైనా ఆరోపణలు వచ్చాయి. దీంతో తెలంగాణలో టీడీపీకి ఇబ్బందులు మొదలవడంతో హైదరాబాద్‌లో ఉండటం క్షేమం కాదని భావించిన చంద్రబాబు ప్రభుత్వ కార్యకలాపాలను విజయవాడకు తరలించారు.

అక్కడ నుంచే ఏపీ పాలనను కొనసాగిస్తున్నారు. అంతేకాదు పార్టీ కార్యకలాపాలను సైతం విజయవాడ, గుంటూరులోనే ఏర్పాటు చేసుకుంటున్నారు. అయితే ఏదైనా ప్రత్యేక సందర్భం ఉంటే హైదరాబాద్‌కు రావడం లేదు. అయితే ఇటీవల తెలంగాణలో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో చంద్రబాబు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌కు రాకపోయినా ఆయన కుమారుడు లోకేశ్ వస్తుండేవారు.

అయితే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీడీపీ ఘోర ఓటమిని చవిచూడటంతో ఆయన కూడా ముఖం చాటేశారు. దీంతో పార్టీ సమావేశాలంటే తెలంగాణాలోని ప్రముఖ నేతలందరూ ఇపుడు విజయవాడకే వెళుతున్నారు. తెలంగాణాలో పార్టీని బ్రతికించుకోవటానికి చంద్రబాబు కనీసం వారానికి నాలుగు రోజులైనా ట్రస్టభవన్‌కు రావాల్సిందేనంటూ తెలంగాణాలోని టిడిపి నేతలు ఎంత పట్టు బట్టినా ఇక్కడకు రావటానికి చంద్రబాబు ఇష్టపడలేదు.

తెలంగాణాలో పార్టీ వ్యవహారాల్లో గానీ తెలంగాణా రాజకీయాల్లో గానీ క్రియాశీలకపాత్ర పోషించటానికి ఉత్సాహం కూడా చూపటం లేదు. ఎప్పుడైతే ఇటు చంద్రబాబు అటు లోకేష్ కూడా ట్రస్ట్‌భవన్‌కు రావటం తగ్గించాసారో తెలంగాణాలోని పలువురు నేతలు కూడా పార్టీ కార్యాలయంవైపు చూడటానికి కూడా ఇష్టపడటం లేదు.

ఈ నేపధ్యంలో ట్రస్ట్‌భవన్‌లో పార్టీ కార్యకలాపాలు చాలా వరకూ తగ్గుముఖంపట్టాయి. దాంతో ఒకపుడు ప్రతీరోజూ కళకళలాడిన ట్రస్ట్‌భవన్ ఇపుడు దాదాపు బోసిపోయింది. పార్టీ కార్యాలయంలో ఎటువంటి కార్యకలాపాలు జరపకుండా ఎంత కాలం నెట్టుకురావాలన్నది పెద్ద సమస్యగా తయారైంది. కనీసం ట్రస్ట్‌భవన్ నిర్వహణకు సరిపడా నిధులైనా నెలవారీగా వస్తే చాలనుకునే పరిస్దితికి వచ్చేసింది.

పార్టీ కార్యకాలాపాలు కాకుండా ప్రస్తుతం ట్రస్ట్‌భవన్‌లో ఎన్‌టిఆర్ బ్లడ్ బ్యాంకు నిర్వహణ, ఎన్‌టిఆర్ మోడల్ స్కూల్ కేంద్ర కార్యాలయం, వివిధ పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్ధులకు శిక్షణ ఇవ్వటానికి అవసరమైన మెటీరియల్ తయారు చేయటం లాంటి కార్యకలాపాలు జరుగుతున్నాయి. ఇప్పుడు జరుగుతున్న కార్యకలాపాలకు ఏడెకరాల స్ధలం అవసరం లేదు.

ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో ఉమెన్స్ కాలేజి: బ్రాహ్మణికి చేతినిండా పని?

ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో ఉమెన్స్ కాలేజి: బ్రాహ్మణికి చేతినిండా పని?


దీంతో పెద్ద పెద్ద భవంతులు, విశాలమైన ఖాళీ స్ధలం నిరుపయోగంగా మారిపోతుందని ట్రస్ట్‌భవన్ వర్గాలు అంచనా వేసాయి. ఇదే విషయాన్ని ఇటీవల చంద్రబాబు వద్ద చర్చ జరిగినట్లు సమాచారం. రోజు వారీ జరుగుతున్న పార్టీ కార్యకలాపాలు, ఇతరత్రా వ్యవహారాలపై ట్రస్ట్‌భవన్ బాధ్యులు చంద్రబాబుకు ఒక నివేదిక అందచేసినట్లు తెలిసింది.

ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో ఉమెన్స్ కాలేజి: బ్రాహ్మణికి చేతినిండా పని?

ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో ఉమెన్స్ కాలేజి: బ్రాహ్మణికి చేతినిండా పని?


ఇపుడు జరుగుతున్న కార్యకలాపాలన్నింటినీ ఒకే భవనంలోకి మార్చేసి రెండో భవనంలో కొద్ది పాటి మార్పులు చేస్తే మహిళా డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయటానికి అనువుగా ఉంటుందని ట్రస్ట్‌భవన్ వర్గాలు సూచించినట్లు తెలిసింది. దాని ప్రకారం రెండో భవనంలో పూర్తిస్దాయి కార్యకలాపాలు ఆరంభించవచ్చని కూడా నివేదికలో తెలిపినట్లు తెలిసింది.

 ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో ఉమెన్స్ కాలేజి: బ్రాహ్మణికి చేతినిండా పని?

ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో ఉమెన్స్ కాలేజి: బ్రాహ్మణికి చేతినిండా పని?


ఎలాగూ లైబ్రరీ భవనంలోనే క్రింద భారీ కిచెన్, డైనింగ్ ఉన్నాయి. హాస్టల్ కోసమంటూ రెండస్తులు వేస్తే సరిపోతుందని ట్రస్ట్‌భవన్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇప్పటి కార్యకలాపాలన్నింటినీ ఎన్‌టిఆర్ ట్రస్ట్‌భవన్‌కు మార్చేస్తే పక్కనే ఉన్న లైబ్రరీ భవనం, డైనింగ్, కిచెన్, పై అంతుస్తుల్లోని విశ్రాంతి గదలన్నింటినీ పూర్తిస్ధాయి ఉపయోగంలోకి తేవచ్చన్న సూచనకు చంద్రబాబు కూడా సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.

 ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో ఉమెన్స్ కాలేజి: బ్రాహ్మణికి చేతినిండా పని?

ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో ఉమెన్స్ కాలేజి: బ్రాహ్మణికి చేతినిండా పని?


ఇప్పటి లైబ్రరి భవనంపైన మరో రెండంతస్తులు వేయగలిగితే డిగ్రీ కళాశాలకు హాస్టల్‌ను కూడా జతచేయవచ్చని ట్రస్ట్‌భవన్ సూచించినట్లు సమాచారం. అయితే మార్పులు, చేర్పులన్నది భారీ వ్యయంతో కూడినది కావటంతో నిర్ణయాన్ని చంద్రబాబుకే వదిలేశారు. ట్రస్ట్‌భవన్ వర్గాలు అనుకున్నది అనుకున్నట్లు సాగితే హాస్టల్ భవన నిర్మాణం త్వరలో మొదలై 2017 విద్యా సంవత్సరం నుండి మహిళా డిగ్రీ కళాశాల మొదలవుతుంది.

English summary
Women's collge may be opened in NTR trust Bhavan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X