వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బిజెపి వ్యూహం: పట్టింపులేని బాబు, రేవంత్ రెడ్డికి షాక్?

తెలంగాణలో బిజెపి అనుసరిస్తున్న వ్యూహం రేవంత్ రెడ్డి ఆశలపై నీళ్లు చల్లే అవకాశం ఉంది. టిడిపితో తెగదెంపులు చేసుకునే మార్గంలో బిజెపి పయనిస్తోంది.

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణలో బిజెపి అనుసరించబోయే వ్యూహం తెలంగాణ తెలుగుదేశం పార్టీకి గడ్డు పరిస్థితులను కల్పించే సూచనలు కనిపిస్తున్నాయి. సామాజిక వర్గ పేరు చెప్పి ముఖ్యమంత్రి పీఠంపై కూర్చుందామనే టిడిపి తెలంగాణ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి షాక్ ఇచ్చే వ్యూహాన్ని బిజెపి అనుసరించబోతోంది.

తెలంగాణలో బిజెపి తెలుగుదేశం పార్టీకి కటీఫ్ చెప్పేందుకు సిద్దపడినట్లు అర్థమవుతోంది. అదే జరిగితే మధ్యతరగతి ఓట్లు, మోడీ ఇమేజ్ తెలుగుదేశం పార్టీకి దూరమవుతాయి. దానివల్ల తెలుగుదేశం పార్టీ తీవ్రంగా దెబ్బ తినే అవకాశాలున్నాయి.

ఇప్పటికే తెలంగాణలో తెలుగుదేశం పార్టీ తీవ్రంగా నష్టపోయింది. ఓటుకు నోటు కేసు తర్వాత తెలంగాణ టిడిపిని ఆదుకునే నాథుడు కూడా లేకుండా పోయాడు. రేవంత్ రెడ్డి అంతా తానే అయి నడిపించాలని తాపత్రయపడుతున్నారు.

తెలంగాణలో ఒంటరిగానే....

తెలంగాణలో ఒంటరిగానే....

తెలంగాణలో ఒంటరిగానే బలపడి ఒంటరిగానే ముందుకు సాగాలనే వ్యూహంతో బిజెపి ముందుకు సాగుతోంది. దాన్నిబట్టి తెలుగుదేశంతో తెగదెంపులు చేసుకోవడానికి బిజెపి నిర్ణయించుకుందని భావించవచ్చు. ఆ నినాదంతోనే తాము ప్రజల్లోకి వెళ్తామని పార్టీ కార్యవర్గ సమావేశంలో బిజెపి రాష్ట్రాధ్యక్షుడు కె. లక్ష్మణ్ చెప్పారు. దాంతో బిజెపిని కలుపుకుని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావును దెబ్బ తీయాలనే రేవంత్ రెడ్డి ఆశలకు విఘాతం ఏర్పడినట్లేనని చెప్పవచ్చు.

అప్పుడు చంద్రబాబు ఒత్తిడితోనే...

అప్పుడు చంద్రబాబు ఒత్తిడితోనే...

నిజానికి, 2014 ఎన్నికల్లోనే తెలంగాణ బిజెపి ఒంటరిగా ఎన్నికలకు వెళ్లాలని భావించింది. టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై తెలంగాణలో ఉన్న వ్యతిరేకత కారణంగా టిడిపితో పొత్తును రాష్ట్ర బిజెపి ఇష్టపడలేదు. తెలంగాణపై చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారు. దీంతో తెలంగాణలో ఆయనపై తీవ్రమైన వ్యతిరేకత ఏర్పడింది. అయితే, చంద్రబాబు నాయుడు బిజెపి జాతీయ నాయకత్వంపై ఒత్తిడి తేవడంతో అనివార్యంగా తెలుగుదేశంతో కలిసి బిజెపి ఎన్నికలకు వెళ్లాల్సి వచ్చింది.

ఒంటరిగా వెళ్తేనే బలపడుతాం...

ఒంటరిగా వెళ్తేనే బలపడుతాం...

తెలంగాణ బిజెపి చాలా స్పష్టంగా ఉన్నట్లు అర్థమవుతోంది. సొంతంగా బలపడాలని, 2019 ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయాలని తెలంగాణ బిజెపి నాయకత్వం అనుకుంటోంది. అందుకు అవసరమైన ప్రాతిపదికను కూడా సిద్ధం చేసుకుంటోంది. ఒంటరిగా పోటీ చేస్తేనే తమకు ఎక్కువ సీట్లు వస్తాయని తెలంగాణ బిజెపి నాయకులు భావిస్తున్నారు. అందువల్ల టిడిపితో పొత్తును వారు నిరాకరించే అవకాశం ఉంది.

తెలంగాణను వారు వదిలేశారు...

తెలంగాణను వారు వదిలేశారు...

తెలంగాణలో తమ పార్టీని తెలుగుదేశం పార్టీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పూర్తిగా రేవంత్ రెడ్డికి వదిలేసిట్లే. పార్టీ సమావేశాలు అడపా దడపా జరిగినప్పుడు చంద్రబాబు వారికి మార్గనిర్దేశం చేస్తున్నారనే వార్తలు మాత్రమే వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బలాన్ని కాపాడుకోవడానికి, ప్రతిపక్ష వైయస్సార్ కాంగ్రెసు పార్టీని, కొత్తగా వస్తున్న పవన్ కల్యాణ్ జనసేనను ఎదుర్కోవడానికే వారిద్దరూ సమయాన్ని వెచ్చిస్తున్నట్లు కనిపిస్తున్నారు

కెసిఆర్‌పై బిజెపి పోరుబాట...

కెసిఆర్‌పై బిజెపి పోరుబాట...

ముస్లిం రిజర్వేషన్లకు వ్యతిరేకంగా తెలంగాణ బిజెపి ఉద్యమాన్ని నిర్మించే ప్రయత్నంలో ఉంది. మతపరమైన రిజర్వేషన్లు కూడదంటూ బిజెపి ముఖ్యమంత్రి కెసిఆర్‌కు వ్యతిరేకంగా పోరుబాట పట్టడానికి నిర్ణయించుకుంది. ముస్లింలకు రిజర్వేషన్లను నిరాకరించే బిజెపి వైఖరిని తెలుగుదేశం పార్టీ బహిరంగంగా సమర్థించే అవకాశం లేదు. అందువల్ల కూడా రెండు పార్టీలకు మధ్య దూరం పెరిగే అవకాశం ఉంది.

English summary
The T-BJP has coined a new slogan “Let’s strengthen alone and let’s go alone” indicating end to its alliance with the Telugu Desam in the state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X