బీజేపీ బిగ్ ప్లాన్!?: రంగంలోకి ప్రభాస్!, పవన్‌కు చెక్ పెట్టి మైలేజీ పెంచుకునేలా!..

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: సినిమాలకు-రాజకీయాలకు ఉన్న లింకు మన దేశ రాజకీయాల్లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సినీ గ్లామర్‌ను ఉపయోగించుకుని రాజకీయాల్లో లబ్ది పొందాలనుకునే పార్టీలు, వ్యక్తులు మన దగ్గర చాలామందే ఉన్నారు. అయితే సినీ గ్లామర్ తోనే అద్భుతాలు జరిగిపోతాయనుకునేవారికి.. చిరంజీవి ప్రజారాజ్యం ప్రస్థానం ఒక హెచ్చరిక లాంటిదన్న సంగతి మరిచిపోకూడదు.

అమిత్ షా వ్యూహం: కోమటిరెడ్డి సహా ఆ వర్గానికి గాలం, కెసిఆర్‌కు షాక్

ఒకప్పుడు తమిళ గడ్డపై ఎంజీఆర్, తెలుగునాట ఎన్టీఆర్ వంటి మహా నటులు రాజకీయాల్లో సృష్టించిన ప్రభంజనంతో.. సినీ గ్లామర్ రాజకీయాలకు కలిసొస్తుందనే భావన పార్టీల్లోను పెరిగింది. అందుకే దేశంలో చాలా పార్టీలు ఎన్నికల సమయంలో జనాకర్షణ ఉన్న సినీ నటులు లేదా నటీమణులను రంగంలోకి దించే సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నాయి.

జగన్ వ్యూహం మొదలైంది: అప్పుడే గెలుపు గుర్రాల వేట!, 'సర్వే' కీలకం

తెరపైకి ప్రభాస్:

బాహుబలి సినిమాతో దేశవ్యాప్తంగా ప్రభాస్ పేరు మారుమోగిపోవడంతో.. ఇప్పుడా ఇమేజ్‌ను రాజకీయాల్లో వాడుకోవాలని ఓ జాతీయ పార్టీ భావిస్తున్నట్లుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రభాస్ పెద్దనాన్న కృష్ణంరాజు బీజేపీలోనే ఉన్నారు కాబట్టి.. సదరు జాతీయ పార్టీ బీజేపీయే అన్న వాదన కూడా వినిపిస్తోంది.

దక్షిణాదిన పాగా వేయాలని ఎప్పటినుంచో కాచుకు కూర్చొన్న బీజేపీ.. సరైన అవకాశం కోసం ఎదురుచూస్తోంది. ఇదే క్రమంలో పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా ఆధ్వర్యంలో కొత్త వ్యూహాలు రూపుదిద్దుకుంటున్నాయి. అందులో భాగంగానే.. 'ప్రభాస్'ను స్టార్ క్యాంపెయిన్ గా వాడుకోవాలన్న ఆలోచన మెదిలినట్లుగా చెబుతున్నారు.

 

తమిళనాట 'రజనీ' వ్యూహం కలిసిరాలేదు:

తమిళనాడు దివంగత సీఎం జయలలిత మరణంతో.. ఆ రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసేలా బీజేపీ పావులు కదిపింది. ముఖ్యంగా అన్నాడీఎంకెలో చీలికలు.. మొన్నటి ఆర్కేనగర్ ఉపఎన్నిక రద్దు వంటి పరిణామాలు బీజేపీ చలవే అన్న వాదన లేకపోలేదు.

ముఖ్యంగా సూపర్ స్టార్ రజనీకాంత్ 'మా వాడే' అని ప్రచారం చేసుకోవడం ద్వారా అక్కడి జనంలోకి చొచ్చుకెళ్లాలని భావించింది. కానీ తాను ఏ పార్టీకి మద్దతునివ్వడం లేదని రజనీ తేల్చేయడంతో.. బీజేపీ వ్యూహం బెడిసికొట్టినట్లయింది. ఇక ఇప్పుడు తెలుగు జనాన్ని ప్రభావితం చేయడానికి 'ప్రభాస్' పేరును బీజేపీ వ్యూహాత్మకంగా తెరపైకి తెచ్చినట్లు కనిపిస్తోంది.

 

 

పవన్ కలిసిరాకపోయినా!:

గత ఎన్నికల్లో బీజేపీకి మద్దతుగా నిలిచిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్.. వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీకి మద్దతునిచ్చే అవకాశాలు కనిపించడం లేదు. ఈ లెక్కన.. పవన్ తమ పార్టీతో కలిసిరాకపోయినా.. ప్రభాస్‌ను వెంటపెట్టుకుని బీజేపీ పొలిటికల్ మైలేజీ పెంచుకోవాలని కమలనాథులు ఆలోచిస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఎలాగు ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు తమ పార్టీ నాయకుడే కాబట్టి.. ఇదేమంత కష్టం కాదని బీజేపీ శ్రేణులు భావించవచ్చు.

షూటింగ్ షెడ్యూల్స్‌కు ఇబ్బంది కలగకుండా!:

ప్రభాస్ షూటింగ్స్ కు ఇబ్బంది కలగకుండా ఎన్నికల షెడ్యూల్ ను రూపొందించాలని బీజేపీ భావిస్తున్నట్లు చెబుతున్నారు. జనంలో ప్రభాస్ కు ఉన్న ఇమేజ్ ను పూర్తిగా వినియోగించుకుని ఎన్నికల్లో లబ్ది పొందాలనేది ఆ పార్టీ ప్లాన్.

కాగా, ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు 1990వ దశకంలో బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. కాకినాడ, నరసాపురం నియోజకవర్గాల నుంచి ఆయన ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. వాజ్ పేయి హయాంలో విదేశాంగ శాఖ సహాయమంత్రి కూడా పనిచేశారు. 2009లో చిరంజీవి ప్రజారాజ్యంలో చేరి... తిరిగి బీజేపీ గూటికి చేరుకున్నారు.

 

English summary
The Bharatiya Janata Party (BJP) has decided to unleash a star-studded campaign for 2019 elections. The party planning to campaign with Rebel star Prabhas
Please Wait while comments are loading...