హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రూ. 10నాణేలు చెల్లవంటూ పుకార్లు: బ్యాంకులకు జనం పరుగు!

పది రూపాయల నాణేలు చెల్లవనే వదంతులు వాప్తి చెందడంతో హైదరాబాద్ తోపాటు పరిసర ప్రాంతాల్లోని దుకాణదారులు రూ. 10 నాణేలు తీసుకునేందుకు నిరాకరిస్తున్నారు. దీంతో గత నాలుగు రోజుల్లోనే యాదాద్రి భువనగిరి జిల్లా

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: పది రూపాయల నాణేలు చెల్లవనే వదంతులు వాప్తి చెందడంతో హైదరాబాద్ తోపాటు పరిసర ప్రాంతాల్లోని దుకాణదారులు రూ. 10 నాణేలు తీసుకునేందుకు నిరాకరిస్తున్నారు. దీంతో గత నాలుగు రోజుల్లోనే యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌లోని అన్ని బ్యాంకు శాఖల్లో సుమారు రూ.10 లక్షల విలువైన రూ.10 నాణేలు జమ కావడం గమనార్హం.

వాగ్వాదాలు

వాగ్వాదాలు

పుకార్ల నేపథ్యంలో ఈ నాణేల వల్ల చిరువ్యాపారులకు వినియోగదారులకు మధ్య వాగ్వాదాలు జరుగుతున్నాయి. గత నవంబర్‌లో భారత రిజర్వు బ్యాంకు పెద్ద నోట్లు రద్దు చేసిన తర్వాత రూ. 10 నాణేలను కూడా రద్దు చేస్తుందనే పుకార్లు షికార్లు చేశాయి.

ఆర్బీఐ చెప్పినా..

ఆర్బీఐ చెప్పినా..

ఇప్పటికే పలుమార్లు ఆర్బీఐ అధికారులు రూ. 10 నాణేలను రద్దు చేయడం లేదని ప్రకటనలు చేసినప్పటికీ ఫలితం లేకుండా పోతోంది. ఇప్పటికైనా మరోసారి రిజర్వుబ్యాంకు అధికారులు, బ్యాంకుల ప్రతినిధులు స్పందించి రూ.10 నాణేంపై స్పష్టమైన ప్రకటన చేయాల్సిన అవసరం ఉంది.

బ్యాంకుల వైపు..

బ్యాంకుల వైపు..

పది రూపాయల నాణేలు రద్దు అవాస్తవమని పలు బ్యాంక్ అధికారులు కూడా చెబుతున్నారు. అయినా చిల్లర వ్యాపారులు నాణేలను స్వీకరించకపోవడంతో ఖాతాదారులు నాణేలను బ్యాంకుల్లో జమ చేసేందుకే మొగ్గు చూపుతున్నారు.

వ్యాపారుల వల్లే...

వ్యాపారుల వల్లే...

హైదరాబాద్ సరిపర ప్రాంతాలతోపాటు మరికొన్ని ప్రాంతాల్లో ఇలా రూ. 10 నాణేలని కొందరు వ్యాపారులు చెల్లకుండా చేయడం గమనార్హం. ఆర్బీఐ ఎలాంటి ప్రకటన చేయకపోయినప్పటికీ వ్యాపారులు ఆ నాణేలు తీసుకోకపోవడంతో ప్రజలు గందరగోళానికి గురవుతున్నారు. కర్ణాటక రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కూడా రూ. 10 నాణేలు చెల్లవనే వదంతులున్నాయి.

English summary
Ten-rupee coin continues to be rejected in the city despite repeated communication from the Reserve Bank of India confirming their validity.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X