వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పెళ్లిళ్లపై ట్రంప్ దెబ్బ మామూలుగా లేదు.. పిల్లనివ్వడానికి జంకుతున్నారు!

ట్రంప్ తీసుకువస్తున్న కొత్త ఇమ్మిగ్రేషన్ చట్టాలు, హెచ్1బీ వీసాలపై ఆంక్షలు.. వీటికి తోడు జాత్యహంకార దాడులు.. ఎన్నారై సంబంధాలంటేనే ఇక్కడివారిని భయపడేలా చేస్తున్నాయి.

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: హెచ్1బీ వీసాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పెడుతున్న కొలికి దేశంలో ఎన్నారై పెళ్లిళ్లకు బ్రేకులు వేస్తోంది. ఇన్నాళ్లు అమెరికా అల్లుళ్లు అంటే వెతికి మరీ పెళ్లిళ్లు చేసిన ఇక్కడి కుటుంబాలు ఇప్పుడంతగా ఆసక్తి కనబరచడం లేదని తెలుస్తోంది. ఈ దెబ్బతో ఏపీ-తెలంగాణకు చెందిన పలు మ్యారేజ్ బ్యూరోల్లో ఎన్నారై సంబంధాలకు బొత్తిగా డిమాండ్ లేకుండా పోయింది.

ట్రంప్ తీసుకువస్తున్న కొత్త ఇమ్మిగ్రేషన్ చట్టాలు, హెచ్1బీ వీసాలపై ఆంక్షలే ఇందుకు కారణంగా కనిపిస్తున్నాయి. దీనికి తోడు అమెరికాలో పెరిగిపోతున్న జాత్యహంకార దాడులు, హత్యలు సైతం ఇక్కడివారిని బెంబేలెత్తిస్తున్నాయి. దీంతో ఎన్నారై పెళ్లిళ్లంటే ఇన్నాళ్లు మోజుపడ్డ తెలుగువారు ఇప్పడు పెదవి విరుస్తున్నారు.

Donald trump has done the impossible reversed indians decades old preference for us based grooms

భవిష్యత్తులో ఈ పరిస్థితి మరింత తీవ్రతరం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కాగా, ఏటా భారత్ నుంచి అమెరికాలో అడుగుపెడుతున్నవారిలో అత్యధికులు తెలుగురాష్ట్రాలకు చెందినవారే కావడం గమనార్హం. ట్రంప్ నిర్ణయాలతో ఇప్పుడక్కడ పనిచేస్తున్న తెలుగువారికి పెళ్లి పెద్ద సంక్షోభమై కూర్చునేలా కనిపిస్తోంది. రాబోయే రోజుల్లో అమెరికన్ ఎన్నారైలకు వివాహ అవకాశాలు తగ్గిపోతాయని హైదరాబాద్ కు చెందిన పలువురు మ్యారేజ్ బ్యూరో నిర్వాహకులు చెబుతున్నారు.

అమెరికన్ ఎన్నారైల కన్నా ఇండియాలో మంచి ఉద్యోగం చేసుకునే అల్లుళ్ల వైపే ఇక్కడి తల్లిదండ్రులు మొగ్గుచూపుతున్నట్లు మ్యారేజ్ బ్యూరో వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

English summary
Donald Trump’s election as the President of the United States last year has led to a significant, and perhaps unforeseen, shift in the marriage market in India.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X