వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాక్: నడిరోడ్డుపై భారీ హెలికాప్టర్ దించి అడ్రస్ అడిగాడు!(వీడియో)

రోడ్డు మార్గంగా వెళ్లే వాహనదారులే ఎక్కువగా తమకు తెలియని ప్రాంతాలకు వెళ్లినప్పుడు.. తమ వాహనాలను ఆపి స్థానికులతో మాట్లాడి తమకు కావాల్సిన చిరునామాను తెలుసుకుంటారు.

|
Google Oneindia TeluguNews

అస్తానా: రోడ్డు మార్గంగా వెళ్లే వాహనదారులే ఎక్కువగా తమకు తెలియని ప్రాంతాలకు వెళ్లినప్పుడు.. తమ వాహనాలను ఆపి స్థానికులతో మాట్లాడి తమకు కావాల్సిన చిరునామాను తెలుసుకుంటారు. ఇక్కడ మాత్రం ఓ హెలికాప్టర్ పైలట్ ఏకంగా రోడ్డుపైనే హెలికాప్టర్ ల్యాండ్ చేసి అటుగా వెళుతున్న లారీ డ్రైవర్‌ను అడ్రస్ అడిగాడు. ఈ పరిణామంతో ఆ లారీ డ్రైవర్ ఆశ్చర్యానికి గురయ్యాడు. కజకిస్థాన్‌లో చోటు చేసుకుందీ ఘటన.

వివరాల్లోకి వెళితే.. కజఖస్థాన్‌లోని ఓ జాతీయ రహదారిపై వరుసగా లారీలు వెళ్తున్నాయి. ఆ ప్రాంతం చుట్టూ మంచు.. రహదారి తప్ప ఏమీ కనిపించని పరిస్థితి ఉంది. కాగా, ఆ మంచు దుప్పట్లోంచి ఒక్కసారిగా కజఖస్థాన్‌ ఆర్మీకి చెందిన ఎంఐ-80 హెలికాప్టర్‌ ఒకటి లారీల ముందు.. నడిరోడ్డుపై ల్యాండ్‌ అయింది. దీంతో లారీ డ్రైవర్లంతా ఆశ్చార్యానికి గురయ్యారు. ఏం జరుగుతుందో వారికి అర్థం కాలేదు.

కాగా, క్షణాల్లో ఆ హెలికాప్టర్‌ నుంచి పైలట్‌ కిందికి దిగి ముందు ఆగిన లారీ డ్రైవర్‌ వద్దకు వచ్చి కరచాలనం చేశాడు. అక్తుబిన్సిక్‌ నగరానికి ఎలా వెళ్లాలని అడిగి తెలుసుకున్నాడు. లారీడ్రైవర్‌ సూచనమేరకు తిరిగి పయనమయ్యాడు. ఈ విచిత్ర ఘటనకు లారీ డ్రైవర్లు బిత్తరపోయారు.

ఇంత భారీ హెలికాప్టర్‌ని రోడ్డుపై దించి.. చిరునామా అడగటం ఏంటని విస్తుపోయారు. కాగా, ఆ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారి హల్‌చల్ చేస్తోంది. దీనిపై స్పందించిన ఆ దేశ రక్షణ శాఖ శిక్షణలో భాగంగా శిక్షణ పైలట్లకు గమ్యం చెప్పకుండా.. వెళ్లిన చోటును కనుక్కునేలా చేయాలని వారిని అలా పంపామని వివరణ ఇవ్వడంతో ఈ ఘటనపై కొంత స్పష్టత వచ్చింది.

English summary
This is the bizarre moment a passenger in a military helicopter asks a lorry driver for directions. The clip, filmed in Karabutak, Kazakhstan, shows a helicopter on a road surrounded by clouds of dust.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X