వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎమ్మెల్యే రోజాపై గుర్రుగా ఉన్న నగరి ప్రజలు: కరపత్రాలు ముద్రిస్తారట..

ఎమ్మెల్యే రోజా తీరు పట్ల నగరి నియోజకవర్గ ప్రజలు అసంతృప్తితో ఉన్నారు.

|
Google Oneindia TeluguNews

విజయవాడ: ఓట్లేసి గెలిపించుకున్న ఎమ్మెల్యే ఏదో తోక చుక్క ఊడిపడ్డట్లు.. సంవత్సరంలో ఎప్పుడో కానీ నియోజకవర్గానికి రాకపోతే ఇక అభివృద్ధి ముందుకు సాగినట్లే?. మరీ ముఖ్యంగా అటు సినిమాల్లో కొనసాగుతూనే ఇటు రాజకీయాలను చక్కదిద్దుకునేవారికి ఇదొక సవాల్ లాంటిదే.

ఎమ్మెల్యే బాలయ్య మిస్సింగ్!?: హిందూపురం వన్ టౌన్‌లో ఫిర్యాదు..ఎమ్మెల్యే బాలయ్య మిస్సింగ్!?: హిందూపురం వన్ టౌన్‌లో ఫిర్యాదు..

అందుకే మొన్నామధ్య హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ కనిపించడం లేదంటూ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేశారు అక్కడి ప్రజలు. సమస్యల గురించి చెప్పుకుందామంటే సినిమాలతోనే బిజీగా గడుపుతున్నారని వారు వాపోయారు. ఇప్పుడదే సీన్ వైసీపీ ఎమ్మెల్యే రోజా విషయంలోను రిపీట్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

 nagari people are unhappy on MLA Roja

ఎమ్మెల్యే రోజా తీరు పట్ల అసంతృప్తితో ఉన్న నగరి నియోజకవర్గ ప్రజలు.. 'మా ఎమ్మెల్యే కనిపించడం లేదు?' అంటూ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నారట. అంతేకాదు, కరపత్రాలు ముద్రించి మరీ ఆమె ఆచూకీ తెలుసుకోవాలని కోరుతారట. అప్పుడెప్పుడో నియోజకవర్గంలో అడుగుపెట్టిన ఎమ్మెల్యే.. ఇప్పటిదాకా మళ్లీ అటువైపు తొంగిచూడలేదని వారు వాపోతున్నారు.

దర్శనమే కరువయ్యే!: 'బాలయ్య' షూటింగ్స్ బిజీతో అల్లాడుతున్న హిందూపురం..దర్శనమే కరువయ్యే!: 'బాలయ్య' షూటింగ్స్ బిజీతో అల్లాడుతున్న హిందూపురం..

క్రితం సారి వచ్చినప్పుడు వాటర్ ఫిల్టర్ ప్రారంభించి వెళ్లారని, ఇక మళ్లీ ఇటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదని నగరి ప్రజలు ఆవేదన చెందుతున్నారట. దీనిపై నియోజకవర్గంలోని ఐదు గ్రామాల ప్రజలు ఏకమైనట్లు తెలుస్తోంది. వీరంతా కలిసి ఎమ్మెల్యే తీరుపై ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. విషయం వైసీపీ నేతలకు తెలిసి వారితో మాట్లాడినా వారు మాత్రం వెనక్కి తగ్గడం లేదట. మొత్తానికి త్వరలోనే 'ఎమ్మెల్యే రోజా మిస్సింగ్' అనే వార్త మీడియాలో దర్శనమిస్తుందన్నమాట.

English summary
Nagari Constituency people are readying to file a missing complaint on MLA Roja. They alleged that Roja neglecting their constituency regarding development activities
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X