వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ మహేంద్ర బాహుబలి అయితే కట్టప్ప ఎవరు?

వైఎస్ మరణం తర్వాత కాంగ్రెసులో సంభవించిన పరిణామాలను బాహుబలి సినిమాతో పోలుస్తూ నెటిజన్లు వ్యాఖ్యలు చేశారు. జగన్‌ను అమరేంద్ర బాహుబలిగా అభివర్ణించారు.

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రాజమౌళి సినిమా బాహుబలి రాజకీయాల్లో కూడా చర్చనీయాంశమైంది. తెలంగాణలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావును మంత్రులు బాహుబలిగా అభివర్ణిస్తున్న విషయం తెలిసిందే. అదే తరహాలో కాంగ్రెసు రాజకీయాలను బాహుబలి సినిమాలో పాత్రలతో పోలుస్తూ నెటిజన్లు గమ్మత్తయిన ప్రచారం ప్రారంభించారు.

నెటిజన్ల వ్యాఖ్యలను చదివే ముందు అప్పటి కాంగ్రెసు రాజకీయాలను ఒక్కసారి మననం చేసుకుంటే మంచిది. కాంగ్రెసుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుగులేని విజయం సాధించి పెట్టి వైయస్ రాజశేఖర రెడ్డి రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు.

వైయస్ రాజశేఖర రెడ్డి జీవించి ఉన్నప్పుడే ఆయన కుమారుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ ఆరంగేట్రం చేశారు. వైఎస్ వారసుడిగా ముందుకు వచ్చే ఉద్దేశంతో ఆయన ఆ పనిచేశారు. కానీ అకస్మాత్తుగా వైఎస్ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. ఆ తర్వాత సంభవించిన పరిణామాలపై రాజకీయాల మీద ఆసక్తి ఉన్న కొంత మంది నెటిజన్లు పలు వ్యాఖ్యలు చేశారు.

చెప్పుడు మాటలు విని రాజమాత

చెప్పుడు మాటలు విని రాజమాత

చెప్పుడు మాటలు విని రాజమాత దేశానికి కాబోయే రాజుని పోగొట్టుకొని, తన ప్రాణాల మీదుగు తెచ్చుకుందని గుర్తు చేస్తూ అదే రీతిలో చెప్పుడు మాటలు విని సోనియా గాంధీ (రాజ మాత) బాహుబళిని పోగొట్టుకుందని నెటిజన్లు వ్యాఖ్యానించారు. వైయస్ రాజశేఖర రెడ్డిని సోనియా గాంధీ పోగొట్టుకున్నారని వ్యాఖ్యానించారు.

కాంగ్రెసులో నాజర్ ఎవరు...

కాంగ్రెసులో నాజర్ ఎవరు...

రాజమౌళి బాహుబలిలో రాజమాత భర్త బిజ్జాళదేవుడు ఒక్కడే ఉంటాడు. ఆ పాత్రను నాజర్ పోషించాడు. అతను అంగ వైకల్యం గలవాడు కూడా. అయితే, నెటిజన్లు మాత్రం కాంగ్రెసులో ఆ సమయంలో ముగ్గురు బిజ్జాళదేవుళ్లను సృష్టించారు. వారు దిగ్విజయ్ సింగ్, చిదంబరం, ఆజాద్ అంటూ పోస్టు పెట్టారు.

మరి రాహుల్ గాంధీ ఎవరు...

మరి రాహుల్ గాంధీ ఎవరు...

చెప్పుడు మాటలు విని రాజశేఖర్ రెడ్డిని( భాహుబళి) పోగొట్టుకుని, ఆంధ్ర ప్రజల విశ్వాసాన్ని మాత్రమే కాకుండా భారత దేశ ప్రజల విశ్వాసాన్ని రాజమాత సోనియా గాంధీ పోగొట్టుకున్నారని నెటిజన్లు వ్యాఖ్యానించారు. ఇప్పుడు రాహుల్ గాంధీ (భళ్లాల దేవుడు) ని రాజు చేయలేక,చేస్తే ఏమౌతుందో అనే భయంతో సోనియా సతమతమయ్యారని వ్యాఖ్యానించారు.

సోనియా ప్రాణాల మీదికి తెచ్చుకుందని...

సోనియా ప్రాణాల మీదికి తెచ్చుకుందని...

రాజశేఖర్ రెడ్డి వుండి వుంటే(బాహుభళి) ఇప్పుడు ఈ కాంగ్రెస్‌ పార్టీకి (మాహిష్మతీ సామ్రాజ్యం)ఈ పరిస్దితి వుండి వుండేదా అని ఆవేదనతో సోనియా గాందీ ప్రాణాల మీదకు తెచ్చుకున్నారని వ్యాక్యానించారు. దేశాన్ని, ప్రజలను కాపాడాలంటే రాజశేఖర్ రెడ్డి కుమారుడు,వైయస్ జగన్ 'మోహన్' రెడ్డి పట్టాభిషక్తుడు కావాలని అభిప్రాయపడ్డారు. జగన్‌ను అమరేంద్ర బాహుబలిగా అభివర్ణిస్తూ ఆయన పట్టాభిషక్తుడు కావాలని అన్నారు.

ఇందులో కట్టప్ప ఎవరు...

ఇందులో కట్టప్ప ఎవరు...

మహీష్మతి సామ్రాజ్యానికి జగన్ (అమరేంద్ర బాహుబలి) పట్టాభిషక్తుడు కావాలని అభిప్రాయపడిన నెటిజన్లు మన్మోహన్ సింగ్ ఈ మొత్తం వ్యవహారంలో కట్టప్పగా అభివర్ణించారు. అప్పుడు మన్మోహన్ సింగ్ భారత ప్రధానిగా ఉన్నారు. ఆయన సోనియా గాంధీ మాటలనే అంటే బాహుబలిలో రాజమాత మాటలనే కట్టప్ప ఆచరించినట్లు అచరించారని వారి అభిప్రాయం.

రాష్ట్ర విభజన నేపథ్యంలో ఇదంతా...

రాష్ట్ర విభజన నేపథ్యంలో ఇదంతా...

రాష్ట్ర విభజన కోసం తెలంగాణలో పోరాటం సాగుతున్న కాలంలో వైయస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన విభజనకు వ్యతిరేకంగా ఉన్నారు. ఆయన అకాల మరణంతో కాంగ్రెసులో సంక్షోభం తలెత్తిందనే చెప్పాలి. ఆయన మరణం తర్వాత జగన్‌ను ముఖ్యమంత్రిని చేయాలని కొందరు అభిప్రాయపడ్డారు. అయితే, సోనియా గాంధీ (రాజమాత లాగా) జగన్‌ను కాదని రోశయ్యను ముఖ్యమంత్రిని చేశారు. బాహుబలి సినిమాలో సైన్యాధిపతి స్థానం నుంచి అమరేంద్ర బాహుబలిని తప్పించి బలహీనమైన వ్యక్తిని సైన్యాధిపతిని చేసిట్లుగా చేశారని అర్థం. ఆ తర్వాతే పరిస్థితులు రాష్ట్ర విభజనకు దారి తీశాయనేది నెటిజన్ల ఆంతర్యం కావచ్చు.

English summary
Netizens made comments comparing Bahubali film with Congress party developments in YS Jagan's angle.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X