వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్మగ్లింగ్ చేస్తోందని పావురాన్ని అరెస్ట్ చేశారు!

స్మగ్లింగ్ చేస్తున్న వ్యక్తులను అరెస్ట్ చేయడం సాధారణ విషయమే. అయితే ఇక్కడ మాత్రం స్మగ్లింగ్‌కు పాల్పడుతోందంటూ ఓ పావురాన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన కువై‌‌ట్‌లో చోటు చేసుకుంది.

|
Google Oneindia TeluguNews

కువైట్‌: స్మగ్లింగ్ చేస్తున్న వ్యక్తులను అరెస్ట్ చేయడం సాధారణ విషయమే. అయితే ఇక్కడ మాత్రం స్మగ్లింగ్‌కు పాల్పడుతోందంటూ ఓ పావురాన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన కువై‌‌ట్‌లో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. కువైట్‌కి సరిహద్దు ప్రాంతమైన ఇరాన్‌ నుంచి కువైట్‌ వైపు ఓ పావురం రావడం గమనించారుపోలీసులు. అయితే , ఆ పావురానికి ఓ చిన్న బ్యాగు లాంటిది తగిలించి ఉండడాన్ని పోలీసులు గుర్తించారు.

 Pigeon carrying 200 ecstasy tablets arrested in Kuwait

వెంటనే దాన్ని పట్టుకుని బ్యాగ్‌ విప్పి చూడగా అందులో 200 ఉత్ప్రేరక ఔషధాలు(ఎక్స్టాసీ టాబ్లెట్స్) లభించాయి. దీంతో అక్రమంగా ఉత్ప్రేరకాలను స్మగ్లింగ్‌ చేస్తున్నారన్న అనుమానంతో పోలీసులు.. పావురాన్ని అదుపులోకి తీసుకున్నారు.

ఈ వ్యవహారంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే పావురాల ద్వారా ఇలా స్మగ్లింగ్‌ చేయించడం ఇది మొదటిసారి కాదు. గతంలోనూ పలుమార్లు ఇలా పావురాల ద్వారా స్మగ్లింగ్ చేయడం గమనార్హం.

English summary
A homing pigeon was caught trying to smuggle drugs into Kuwait, according to local news reports.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X