అంత సీనుందా: పవన్ కల్యాణ్ పార్టీలోకి సమంత?

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: పుకార్లకేం షికారు చేస్తూనే ఉంటాయి. పుకార్లు ఎక్కడ పుడుతాయో గానీ గాలితో పాటే విస్తరిస్తుంటాయి. తాజాగా, తాజాగా ఓ ఉహాగానం ప్రచారంలో ఉంది. హీరోయిన్ సమంత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నాయకత్వంలోని జనసేన పార్టీలో చేరుతారని పుకార్లు షికారు చేస్తున్నాయి.

తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌గా సమంత వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తుండడం, అదే సమయంలో తెలంగాణలో తాము పోటీ చేస్తామని జనసేన పార్టీ నుంచి సంకేతాలు రావడం వంటి కారణాలు ఆ ప్రచారానికి కారణమై ఉంటాయి. సినీ నటుడు నాగార్జున కుమారుడు నాగ చైతన్యను పెళ్లాడబోతున్న సమంత తెలంగాణ అమ్మాయి అవుతోంది.

ఇటీవల వరంగల్ జిల్లా గుండాలలో సమంత పర్యటించారు. ఈ పర్యటన స్థానికంగా ఆమె రాజకీయ రంగ ప్రవేశంపై ఊహాగానాలకు తెరలేపింది. అయితే, సమంతకు అంత సీనుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

దుబ్బాకలో సమంత పర్యటన...

దుబ్బాకలో సమంత పర్యటన...

తెలంగాణ చేనేత బ్రాండ్ అంబాసిడర్‌గా నియమితులైన తర్వాత సమంత మెదక్ జిల్లా దుబ్బాకలో పర్యటించారు. అక్కడ చేనేత కార్మికులతో మాట్లాడారు. ఆమె దుబ్బాకలోని చేనేత వస్త్ర పరిశ్రమను సందర్శించారు.
చేనేత సంఘ ప్రతినిధులు ఆమెకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా చేనేత కార్మికులు తయారు చేసిన వస్త్రాలను సమంత పరిశీలించారు. మరమగ్గాలను, ఇతర పనిముట్లను ఆసక్తిగా పరిశీలించారు.

భూదాన్ పోచంపల్లిలోనూ...

సమంత యాదాద్రి జిల్లా భూదాన్‌పోచంపల్లిలోని హ్యాండ్లూమ్ పార్కను బుధవారం సందర్శించారు. భూదాన్ పోచంపల్లి చేనేతకు ప్రఖ్యాతి వహించింది. మగ్గాలపై తయారు చేసిన వివిధ రకాల ఇక్కత్ వస్త్రాలను, డిజైన్లను పరిశీలించారు. కార్మికులకు లభిస్తున్న గిట్టుబాటు ధర, పార్కులో ఎన్ని మగ్గాలున్నాయి, ఎంత మంది పనిచేస్తున్నారు, మార్కెటింగ్ విధానాల వంటి విషయాలను అడిగి తెలుసుకున్నారు.

గుండాలలో సమంత ఇలా...

సమంత బుధవారంనాడే జనగామ జిల్లా గుండాల మండల కేంద్రంలోని చేనేత సహకార సంఘాన్ని సందర్శించారు. సంఘంలోని వస్త్రాలను, కోముల మిషన్‌ను పరిశీలించారు. నేత కార్మికులకు కూలిి గిడుతోందా, ఆదివారం రోజున కూడా చేస్తారా అని అడిగి తెలుసుకున్నారు. చేనేత సంఘంలో ప్రస్తుతం నేస్తున్న దోమ తెరల చీరలను నేయాలని ఆమె సూచించారు.

సమంత ఇలా చెప్పారు....

సమంత ఇలా చెప్పారు....

గుండాలలో పర్యటించిన సందర్భంగా సమంత రాజకీయ రంగ ప్రవేశం చేస్తారనే ప్రచారం సాగింది. అయితే, పవన్ కల్యాణ్ జనసేన పార్టీలో చేరుతారా అనే విషయంపై ఆమె మాటలను బట్టి కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దోమ తరహా చీరలను నేస్తే తగిన వేతనాన్ని అందజేసేందుకు తాను ప్రభుత్వ పరంగా కృషి చేస్తానని ఆమె చెప్పారు. సంఘం పనితీరు, నేత కార్మికుల నైపుణ్యాన్ని ముఖ్యమంత్రి కెసిఆర్ దృష్టికి తీసుకుని వెళ్తానని కూడా చెప్పారు. తెలంగాణ ప్రభుత్వానికి దగ్గర ఉంటున్న సమంత జనసేన పార్టీలో ఎలా చేరుతారనేది ప్రశ్నార్థకమే.

పవన్ కల్యాణ్‌కు పోటీగానే సమంత

పవన్ కల్యాణ్‌కు పోటీగానే సమంత

రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా చేనేతకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంటానని పవన్ కల్యాణ్ చెప్పిన మరుక్షణమే తెలంగాణ మంత్రి కెటి రామారావు సమంతను తెలంగాణ చేనేత బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించారు. పవన్ కల్యాణ్ పార్టీ పెట్టి రాజకీయాల్లో చురుగ్గా కొనసాగుతున్న స్థితిలో ఆయన తెలంగాణ చేనేతకు కూడా బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంటే సంభవించే రాజకీయ పరిణామాలను ఊహించే కెటిఆర్ వేగంగా స్పందించి సమంతను తెలంగాణ చేనేత బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించినట్లు చెబుతున్నారు. అందువల్ల సమంత జనసేన పార్టీలో చేరుతారనే ప్రచారంలో ఉన్న వాస్తవమేమిటో అర్థం చేసుకోవచ్చునని అంటున్నారు.

నాగచైతన్యతో సమంత పెళ్లి..

నాగచైతన్యతో సమంత పెళ్లి..

సమంత నాగార్జున అక్కినేని కుమారుడు నాగచైతన్యను వివాహం చేసుకోబోతున్నారు. ఈ స్థితిలోనే అక్కినేని నాగార్జుననే సమంత తెలంగాణ చేనేత బ్రాండ్ అంబాసిడర్‌గా నియమితులు కావడంలో ప్రధాన పాత్ర పోషించారని అంటున్నారు. నాగార్జున ప్రయోజనాలన్నీ తెలంగాణలో ఉన్నాయనే విషయం అందరికీ తెలిసిందే. దీన్నే కారణంగా చూపి - సమంతను చేనేత బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించడంపై కాంగ్రెసు నేత షబ్బీర్ అలీ విమర్శలు చేశారు. అందువల్ల సమంత జనసేన పార్టీలో చేరుతారనే ప్రచారానికి ప్రాతిపదిక కూడా ఉండకపోవచ్చు.

English summary
Buz is that - heroine Samantha may join in Pawan Kalyan's Jana sena party. But political analysts argue in other way on Telangana politics.
Please Wait while comments are loading...