న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టీమిండియా దీపావళి కానుక: సిరిస్ మనదే, కివీస్‌పై ఘన విజయం

By Nageshwara Rao

విశాఖపట్నం: న్యూజిలాండ్‌తో జరిగిన చివరిదైన ఐదో వన్డేలో భారత బౌలర్లు సత్తా చాటారు. విశాఖ వన్డేలో టీమిండియా అత్యుత్తమ ప్రదర్శన కనబర్చి న్యూజిలాండ్ జట్టును 79 పరుగులకే ఆలౌట్ చేసింది. దీంతో న్యూజిలాండ్‌పై 190 పరుగుల తేడాతో భారత్ ఘన విజయాన్ని నమోదు చేసింది.

భారత్ Vs న్యూజిలాండ్ ఐదో వన్డే స్కోరు కార్డు

చివరి వన్డేలో విజయం సాధించడంతో ఐదు వన్డేల సిరిస్‌ను 3-2తో టీమిండియా సిరీస్ కైవసం చేసుకుంది. 270 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాంండ్ ఏ దశలోనూ భారత్‌కు గట్టి పోటీ ఇవ్వలేకపోయింది. మ్యాచ్ ఆరంభం నుంచే వరుసగా వికెట్లను చేజార్చుకుంది.

ఈ మ్యాచ్‌లో బౌలర్ అమిత్ మిశ్రా చెలరేగి బౌలింగ్ చేశాడు. 6 ఓవర్లలో 18 పరుగులిచ్చి 5 కీలక వికెట్లను తీసుకున్నాడు. అక్షర పటేల్ రెండు, జాదవ్, యాదవ్, బుమ్రాలు తలో వికెట్ తీసుకున్నారు. ఈ గెలుపుతో వైజాగ్ స్టేడియం చరిత్రాత్మక విజయానికి వేదికైంది.

అమిత్ మిశ్రాకు మ్యాన్ ఆఫ్ ది సిరీస్
విశాఖలో వన్డేలో టీమిండియా గెలుపులో ప్రధాన పాత్ర పోషించిన అమిత్ మిశ్రాకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌తో పాటు ఈ వన్డే సిరిస్‌లో భాగంగా 15 వికెట్లు తీసుకుని అద్భుత ఆటతీరును కనబర్చినందుకు గాను మ్యాన్ ఆఫ్ ది సిరీస్ కూడా గెలుచుకున్నాడు.


మ్యాచ్ ఇన్నింగ్స్ కొనసాగిందిలా:

74 పరుగులకే 8 వికెట్లు కోల్పోయిన న్యూజిలాండ్

విశాఖలో జరుగుతున్న ఐదో వన్డేలో టీమిండియా భారత బౌలర్లు విజృభింస్తున్నారు. అమిత్ మిశ్రా ఏకంగా నాలుగు వికెట్లు తీసుకున్నాడు. రాస్ టేలర్, వాట్లింగ్‌, నీషమ్‌, సౌథీలను పెవిలియన్‌కు పంపాడు. మరోవైపు వైజాగ్ వన్డేతో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన స్పిన్నర్ జయంత్ యాదవ్ ఆండర్సన్‌ను ఎల్‌బిడబ్ల్యూగా పెవిలియన్‌కు పంపాడు.

India vs New Zealand, 5th ODI

మూడు పరుగలకే మూడు వికెట్లు
విశాఖలో జరుగుతున్న ఐదో వన్డేలో 270 పరుగుల లక్ష్య ఛేదనలో భాగంగా బరిలోకి దిగిన న్యూజిలాండ్‌ మూడు పరుగుల వ్యవధిలోనే మూడు కీలక వికెట్లు కోల్పోయింది. కివీస్‌ స్కోరు 63 వద్ద అక్షర్‌ పటేల్‌ బౌలింగ్‌లో విలియమ్సన్‌ (27) ఔటవగా 66 వద్ద అమిత్‌ మిశ్రా బౌలింగ్‌లో వరుసగా టేలర్‌ (19), వాట్లింగ్‌ (0)లు పెవిలియన్‌ చేరారు.

సత్తా చాటుతున్న భారత బౌలర్లు: గెలుపు దిశగా భారత్

విశాఖలో జరుగుతున్న ఐదో వన్డేలో టీమిండియా భారత బౌలర్లు సత్తా చాటుతున్నారు. ఓపెనర్ గుప్టిల్‌ను తొలి ఓవర్‌లోనే పెవిలియన్‌ పంపారు. ఆ తర్వాత మరో ఓపెనర్‌ లాంథమ్‌ని 19 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్‌కు పంపారు. ఇలా 28 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన విలియమ్సన్ 27, టేలర్ 19, వాట్లింగ్ 0 పరుగులకే వెనుదిరిగారు. భారత బౌలర్లలో అమిత్ మిశ్రా రెండు, అక్షర్ పటేల్, ఉమేశ్ యాదవ్, బూమ్రా తలో వికెట్ తీసుకున్నారు.

66 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన న్యూజిలాండ్

270 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ లక్ష్య ఛేదనలో తడబడుతోంది. 16 ఓవర్లు ముగిసే సరికి 5 వికెట్లు కోల్పోయిన న్యూజిలాండ్ 66 పరుగులు చేసింది. భారత బౌలర్లు విజృంభిస్తున్నారు. తాజాగా మిశ్రా బౌలింగ్‌లో వాట్లింగ్ డకౌట్ వెనుదిరిగడంతో కివీస్ ఐదు వికెట్లు కోల్పోయింది.

న్యూజిలాండ్ విజయ లక్ష్యం 270

విశాఖ వేదికగా జరుగుతున్న ఐదో వన్డేలో టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన టీమిండియా 50 ఓవర్లకు గాను 6 వికెట్లు కోల్పోయి 269 పరుగులు చేసింది. దీంతో న్యూజిలాండ్ పరుగుల లక్ష్యం 270గా నిర్దేశించింది. భారత్ బ్యాట్స్‌మెన్లలో అత్యధికంగా రోహిత్ శర్మ (70), కోహ్లీ (65), ధోని (41), జాదవ్ (39), అక్షర పటేల్ (24), రహానే (20) పరుగులు చేయగా మనీష్ పాండే డౌకట్‌గా వెనుదిరిగాడు. కాగా, న్యూజిలాండ్ బౌలర్లలో టిమ్ సౌథీ, బౌల్డ్ చెరో రెండు వికెట్లు తీసుకోగా, నీషమ్, సాంట్నర్ చెరో వికెట్ తీసుకున్నారు.

India vs New Zealand, 5th ODI

220 పరుగుల వద్ద విరాట్ కోహ్లీ
విశాఖలో జరుగుతున్న ఐదో వన్డేలో టీమిండియా ఐదో వికెట్ కోల్పోయింది. జట్టు స్కోరు 220 పరుగుల వద్ద కోహ్లీ రూపంలో ఐదో వికెట్‌ను కోల్పోయింది. 65 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద కోహ్లీ ఔటయ్యాడు. 44 ఓవర్ మొదటి బంతికి సౌథీ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి మార్టిన్ గుప్తిల్‌కు కోహ్లీ క్యాచ్ ఇచ్చాడు. దీంతో 43.1 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 5 వికెట్లు కోల్పోయి 220 పరుగులు చేసింది.

డకౌట్‌గా వెనుదిరిగిన మనీష్ పాండే
విశాఖలో జరుగుతున్న ఐదో వన్డేలో ధోని ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన మనీష్ పాండే ఐదు బంతులను ఎదుర్కొనని డకౌట్‌గా వెనుదిరిగాడు. న్యూజిలాండ్ బౌలర్ టిమ్ సోథీ బౌలింగ్‌లో బౌల్ట్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. దీంతో 41 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా నాలుగు వికెట్లు కోల్పోయి 204 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో విరాట్ కోహ్లీ 60, కేదార్ జాదవ్ 4 పరుగులతో ఉన్నారు.

190 పరుగుల వద్ద ధోని ఔట్

విశాఖ వేదికగా జరుగుతున్న ఐదో వన్డేలో టీమిండియా మూడో వికెట్‌ను కోల్పోయింది. జట్టు స్కోరు 190 పరుగుల వద్ద 38వ ఓవర్ మూడో బంతికి సాంట్నర్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. 59 బంతులు ఎదుర్కొన్న ధోని 4 ఫోర్లు, 1 సిక్సర్‌తో 41 పరుగులు చేశాడు. కోహ్లీ అర్ధ సెంచరీ చేసిన తర్వాత బంతికే ధోని ఔటయ్యాడు. దీంతో 38 ఓవర్లు ముగిసే సరికే టీమిండియా మూడు వికెట్లు కోల్పోయి 190 పరుగులు చేసింది.

Kohli

విరాట్ కోహ్లీ అర్ధ సెంచరీ

ఐదో వన్డేలో కోహ్లీ తన ఫామ్‌ని కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో 62 బంతుల్లో (సిక్సు, ఫోర్)తో కోహ్లీ అర్ధ సెంచరీని నమోదు చేశాడు. వన్డే కెరీర్‌లో కోహ్లికి ఇది 38వ అర్ధ సెంచరీ కావడం విశేషం. కోహ్లీ 37.2 ఓవర్లు ముగిసే టీమిండియా రెండు వికెట్లు కోల్పోయి 190 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో విరాట్ కోహ్లీ 50, ధోని 41 పరుగులతో ఉన్నారు.

చెలరేగి ఆడుతున్న కోహ్లీ, ధోని

విశాఖలో జరుగుతున్న ఐదో వన్డేలో విరాట్ కోహ్లీ, ధోనిల జోడీ చెలరేగి ఆడుతుంది. ఇద్దరూ కూడా అర్ధ సెంచరీలకు చేరువలో ఉన్నారు. 37 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా రెండు వికెట్లు కోల్పోయి 189 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో విరాట్ కోహ్లీ 41, ధోని 19 పరుగులతో ఉన్నారు.

భారీ స్కోరు దిశగా టీమిండియా
ఐదో వన్డేలో టీమిండియా భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ జట్టు 34.2 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 180 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో విరాట్ కోహ్లీ 43, ధోని 39 పరుగులతో ఉన్నారు. ఓపెనర్లు రోహిత్ శర్మ(70)తో రాణించగా, రహానే(20) పరుగులతో ఓ మోస్తరుగా ఫర్వాలేదనిపించాడు. తొలి వికెట్‌కు 40 పరుగులు జోడించిన తర్వాత రహానే పెవిలియన్‌కు చేరాడు. ఆ తర్వాత కోహ్లీతో కలిసి రోహిత్ శర్మ చక్కటి భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు. ఈ క్రమంలోనే కెరీర్‌లో 29వ అర్ధ సెంచరీ నమోదు చేశాడు. గత నాలుగు వన్డేల్లో కలుపుకుని 53 పరుగులే చేసిన రోహిత్.. కీలకమైన ఈ మ్యాచ్‌లో మాత్రం ఆకట్టుకున్నాడు.

వరుసగా 12 మ్యాచ్‌ల్లో భారీ భాగస్వామ్యం లేని టీమిండియా

విశాఖ వన్డేలో భారత ఓపెనర్లు భాగస్వామ్యం పదో ఓవర్లో ముగిసింది. 10వ ఓవర్ రెండో బంతికి రహానే 20 పరుగుల వద్ద ఔటయ్యాడు. దీంతో ఓపెనింగ్ భాగస్వామ్యం 40 పరుగులకే పరిమితమైంది. ఈ దశలో రహానే 20, రోహిత్ శర్మ 13 పరుగుల వద్ద ఉన్నారు. దీంతో స్వదేశంలో వరుసగా 12 మ్యాచ్‌లలో టీమిండియా ఓపెనింగ్ భాగస్వామ్యం 50 పరుగల కంటే తక్కువకే ముగిసింది.

జస్ట్ మిస్: ఔట్ నుంచి తృటిలో తప్పించుకున్న కోహ్లీ
ఐదో వన్డేలో విరాట్ కోహ్లీ తృటిలో ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. 27వ ఓవర్ నాలుగో బంతికి ధోనీ సింగిల్ తీసేందుకు ప్రయత్నించాడు. అయితే ఈ సమయంలో అక్కడే ఉన్న న్యూజిలాండ్ ఫీల్డర్ బంతితో వికెట్లను కొట్టడంలో మిస్ అయ్యాడు. దీంతో 31 పరుగుల వద్ద కోహ్లీ ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. డైవ్ చేసి కింద పడ్డ కోహ్లీ కొద్ది సమయం పాటు అలానే ఉండిపోయాడు. ప్రస్తుతం టీమిండియా 31 ఓవర్లు గాను 2 వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో విరాట్ కోహ్లీ 41, ధోని 19 పరుగులతో ఉన్నారు.

70 పరుగుల వద్ద రోహిత్ శర్మ ఔట్
టీమిండియా రెండో వికెట్‌ను కోల్పోయింది. 22వ ఓవర్ చివరి బంతికి సిక్స్ కొట్టడానికి ప్రయత్నించిన రోహిత్ శర్మ బౌండరీ లైన్ వద్ద క్యాచ్ రూపంలో ఔటయ్యాడు. 65 బంతుల్లోనే 70 (5 ఫోర్లు, 3 సిక్సర్లు) పరుగులు చేసిన రోహిత్ బౌల్ట్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. రోహిత్ శర్మకు విశాఖపట్నం స్టేడియం అచ్చొచ్చిన మైదానమని మరోసారి రుజువైంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియాకు ఓపెనర్లు మంచి శుభారంభాన్నిచ్చారు.

Trent Boult

తొలి వికెట్‌కు 40 పరుగులు జోడించిన తర్వాత రహానే పెవిలియన్‌కు చేరాడు. ఆ తర్వాత కోహ్లీతో కలిసి రోహిత్ శర్మ చక్కటి భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు. ఈ క్రమంలోనే కెరీర్‌లో 29వ అర్ధ సెంచరీ నమోదు చేశాడు. రోహిత్ శర్మ ఔటైన తర్వాత ధోని క్రీజులోకి వచ్చాడు. 25.2 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా రెండు వికెట్లు కోల్పోయి 130 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో విరాట్ కోహ్లీ 29, ధోని 3 పరుగులతో ఉన్నారు. న్యూజిలాండ్ బౌలర్లతో నీషామ్, బౌల్ట్ లకి చెరో వికెట్ దక్కింది.

ఐదో వన్డేలో కూడా రాస్ టేలర్ క్యాచ్ మిస్
ఐదో వన్డేలో కూడా న్యూజిలాండ్ ఆటగాడు మరోసారి క్యాచ్ విడిచిపెట్టాడు. ఇన్నింగ్స్ 21వ ఓవర్ నాలుగో బంతికి సెంచరీ దిశగా దూసుకుపోతున్న భారత ఆటగాడు రోహిత్ శర్మ ఇచ్చిన క్యాచ్‌ను వదిలేశాడు. నీషమ్ బౌలింగ్‌లో రోహిత్ లెగ్‌సైడ్ షాట్ కొట్టగా బంతి నేరుగా వచ్చి రాస్ టేలర్ చేతిలో పడింది. కానీ టేలర్ బ్యాలెన్స్ తప్పి క్యాచ్‌ను వదిలేశాడు. ఆ సమయంలో రోహిత్ 67 పరుగులు వద్ద ఉన్నాడు. మూడో వన్డేలో కూడా కోహ్లీ ఇచ్చిన క్యాచ్‌ను రాస్ టేలర్ విడిచిపెట్టడంతో ఆ మ్యాచ్‌లో కోహ్లీ 154 పరుగులతో నాటౌట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.

100 పరుగులు దాటిన టీమిండియా స్కోరు
న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఐదో వన్డే మ్యాచ్‌లో టీమిండియా స్కోరు 100 పరుగులు దాటింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ధోని సేనకు ఓపెనర్లు రోహిత్-రహానేల జోడీ మంచి శుభారంభాన్నిచ్చింది. తొలి వికెట్‌కు 40 పరుగులు జోడించిన తర్వాత రహానే పెవిలియన్‌కు చేరాడు. ఆ తర్వాత కోహ్లీతో కలిసి రోహిత్ శర్మ స్కోరు బోర్డుని పరుగులు పెట్టిస్తున్నాడు. 19వ ఓవర్ మొదటి బంతికి కోహ్లీ కొట్టిన ఫోర్‌తో టీమిండియా 100 పరుగులకు చేరుకుంది. 21 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా వికెట్ నష్టానికి 115 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో రోహిత్ శర్మ 67, విరాట్ కోహ్లీ 20 పరుగులతో ఉన్నారు.

ఫామ్‌లోకి రోహిత్ శర్మ, అర్ధ సెంచరీ

గత నాలుగు వన్డేల్లో వరుసగా విఫలమైన రోహిత్ శర్మ ఐదో వన్డేలో ఫామ్ లోకి వచ్చాడు. ఈ సిరిస్‌లో తొలిసారి అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. వైజాగ్‌ వేదికగా జరుగుతున్న ఐదో వన్డేలో 51 బంతులు ఎదుర్కొని 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో తన వన్డే కెరీర్‌లోనే 29వ అర్ధ సెంచరీని నమోదు చేశాడు. దీంతో 19 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా ఒక వికెట్ నష్టానికి 104 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో రోహిత్ శర్మ 59, విరాట్ కోహ్లీ 17 పరుగులతో ఉన్నారు.

India vs New Zealand, 5th OD

తొలి వికెట్‌గా ఓపెనర్ రహానే ఔట్

విశాఖపట్నం వేదికగా జరుగుతున్న ఐదో వన్డేలో టీమిండియా తొలి వికెట్‌ కోల్పోయింది. 10వ ఓవర్‌లో ఓపెనర్ రహానే 20 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్‌కు చేరాడు. జేమ్స్ నీషమ్ బౌలింగ్‌లో బంతిని మిడ్‌వికెట్‌ దిశగా తరలించే క్రమంలో లాథమ్‌‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 12 ఓవర్లకు గాను టీమిండియా ఒక వికెట్ నష్టపోయి 55 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో రోహిత్‌ శర్మ (24), విరాట్‌ కోహ్లి 3 పరుగులతో ఉన్నారు.

నిలకడగా ఆడుతున్న టీమిండియా

విశాఖ వేదికగా జరుగుతున్న ఐదో వన్డేలో టీమిండియా ఓపెనర్లు నిలకడగా రాణిస్తున్నారు. ఈ వన్డే ద్వారా ఆరంగేట్రం చేసిన జయంత్ యాదవ్‌కు, వీరేంద్ర సెహ్వాగ్ క్యాప్‌ను అందించి జట్టులోకి ఆహ్వానించాడు. కాగా ప్రస్తుతం టీమిండియా 6 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 18 పరుగులు చేసింది.

వన్డే సిరిస్ విజేత ఎవరో తేల్చే ఐదో వన్డే మ్యాచ్‌కి భారత్-న్యూజిలాండ్ జట్లు సిద్ధమయ్యాయి. విశాఖపట్నంలోని ఏసీఏ-వీడీసీఏ రాజశేఖరరెడ్డి స్టేడియం వేదికగా జరుగుతున్న వన్డే మ్యాచ్‌లో టాస్ గెలిచిన ధోని సేన బ్యాటింగ్ ఎంచుకుంది. భారత జట్టులో రెండు మార్పులు చోటు చేసుకున్నాయి.

Kohli

యార్కర్లతో అందరి దృష్టిని ఆకర్షించిన యువ పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు. హర్యానా ఆటగాడు ఆఫ్ స్పిన్నర్ జయంత్ యాదవ్ ఈ వన్డేతో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. న్యూజిలాండ్ తుది జట్టులో కోరీ అండర్సన్ చేరాడు. విశాఖలో పరుగుల వరద పారడం ఖాయమని అభిమానులు అంటున్నారు.

ఐదు వన్డేల సిరీస్ లో ఇరు జట్లు 2-2తో సమంగా ఉన్న నేపథ్యంలో ఈ మ్యాచ్ కీలకంగా మారింది. ధోనికి నేతృత్వంలోని టీమిండియాకు ఇది 199వ మ్యాచ్. విశాఖ వన్డేలో ధోనీ మరో 56 పరుగులు చేస్తే స్వదేశంలో వన్డే ఫార్మాట్ లో 4 వేల పరుగులు చేసిన రెండో ఆటగాడిగా రికార్డు సృష్టించనున్నాడు.

అంతక ముందు క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ 6976 పరుగులతో మొదటి స్థానంలో ఉన్నాడు. కాగా, ఇక్కడ టీమిండియాకు మంచి ట్రాక్ రికార్డు కూడా ఉంది. ఇప్పటి వరకు ఇక్కడ ఐదు మ్యాచ్‌లు జరగ్గా, నాలుగు మ్యాచ్‌ల్లో టీమిండియా విజయం సాధించింది. ఒక మ్యాచ్‌లో మాత్రమే ఓటమిపాలైంది.

విశాఖ వన్డేలో కోహ్లీ కోసం మరో రికార్డు ఎదురు చూస్తోంది. ఛేజింగ్ లో గెలిచిన మ్యాచ్ ల్లో టీమిండియా తరఫున కోహ్లీ, సచిన్ టెండూల్కర్ లు అత్యధికంగా 14 చొప్పున సెంచరీలు చేశారు. కోహ్లీ మరో శతకం బాదితే సచిన్ రికార్డు బ్రేక్ అవుతుంది. కోహ్లీ ఇక్కడ ఆడిన మూడు వన్డేల్లో వరుసగా 118, 117, 99 పరుగులు చేశాడు.

India vs New Zealand, 5th ODI: India have won the toss and elected to bat

జట్లు:
భారత్:
ధోని(కెప్టెన్), రోహిత్ శర్మ, అజింక్యా రహానే, విరాట్ కోహ్లి, మనీష్ పాండే, కేదర్ జాదవ్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, అమిత్ మిశ్రా, ఉమేష్ యాదవ్, జస్ప్రిత్ బూమ్రా

న్యూజిలాండ్: కేన్ విలియమ్సన్(కెప్టెన్), మార్టిన్ గప్టిల్, టామ్ లాధమ్, రాస్ టేలర్, కోరీ అండర్సన్, ల్యూక్ రోంచీ, జేమ్స్ నీషమ్, మిచెల్ సాంట్నార్, టిమ్ సౌతీ, బ్రాస్ వెల్, ఇష్ సోథీ

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X