వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్నాధస్వామి రథయాత్ర: ఆషాఢ శుద్ద విదియ..

దాహిరురాజు, పృధ్వీరాజు చేసిన అశుచిప్రాపక కార్యానికి శ్రీకృష్ణుడు ఒజ్ఞబంతి ఐనాడా! ఈ సందేహం నన్ను చిరకాలం గా వేధిసూనే ఉంది. సందర్భమైనప్పడల్లా పండితులతో ఈనాసందేహం సంగతి చెబుతానే వచ్చాను.

|
Google Oneindia TeluguNews

" రథయాత్రో మనోరథ ద్వితీయా జగన్నాధస్వామి రథయాత్ర,
ఈనాటి వివరణలో మన పంచాంగకర్త 'జగన్నాథక్షేత్రేరథోత్సవ: అని వ్రాస్తారు.
భక్తిపరులైన తెలుగు పెద్దలు పూరీజగనాథస్వామిని గురించి.
నీలాచల లూసాయ నిత్యాయ పరమాత్మనే
సుభద్రా ప్రాణనాథాయ జగన్నాధాయ మంగళవు."

అనేశ్లోకం తరుచు చదువుతూ ఉంటారు.
జగన్నాథుడు శ్రీకృష్ణుని అపరావతారంకదా! పైశ్లోకాన్ని పట్టి శ్రీకృష్ణుని అష్టభార్యల్లోనూ ఒకతెయైన భద్రాదేవి ఈ అవతారంలో సుభద్రనామంతో జగనాథస్వామి భార్యఐనటు స్ఫురిస్తుంది.

 astrologer explains about lord jagannath swamy rath yatra

ఈ స్పూరణ ఇట్లా ఉండగా శ్రీ చెళ్లపిళ్ళ వెంకటశాస్త్రిగారు ఈ సందర్భంలో రొక సంగతి వెల్లడించారు.
అర్జునుడికి చేపట్టిన శ్రీకృష్ణసోదరి సుభద్ర ఉన్నదికదా! ఆసుభద్ర ఒకసారి శ్రీకృష్ణుని నీకు ఏమి కావాలో కోరుకోమన్నాడట. అప్పుడు ఆమె తనకు శ్రీకృష్ణుడు వంటి భర్త కావాలన్నదట. అందుమీద శ్రీకృష్ణుడు సుభద్రతో అవతారాంతర మందు నీకోరిక చెల్లుతుందన్నాడట.
జగన్నాథ స్వామిగా పూరీలో అవతరించినపుడు శ్రీకృష్ణుడు సుభద్రను భార్యగా
స్వీకరించాడట అందుచేతనే సుభద్రాప్రాణనాథాయ! జగన్నాథాయ' అనే
ప్రయోగం పుట్టిందిట. ఇత్యాదిగా శ్రీ వెంకటశాస్త్రిగారు వ్రాసి ఉన్నారు.

ఈ విషయమై మరి ఇద్దరు ముగురు పండితులను కూడా అడిగి ఉన్నాను. వారున్నూ హిందూదేశచరిత్రలో మహమ్మదీయుల మొదటిదాడికి ఎదురొడ్డి నిలిచిన దాహిరురాజు చెల్లిల్ని పెళ్లిచేసుకున్న అనాచారి అని చదివినప్పడూ, పృధ్వీరాజు రాణీ సంయుక్తను హిందూధర్మశాస్ర విరుద్దమైన వివాహం చేసుకున్న మేచ్చ సాంప్రదాయపు దంపతులనీ చదివినప్పడు ఒక విధమైన జుగుప్పపుట్టుకు వస్తుంది.

దాహిరురాజు, పృధ్వీరాజు చేసిన అశుచిప్రాపక కార్యానికి శ్రీకృష్ణుడు ఒజ్ఞబంతి ఐనాడా! ఈ సందేహం నన్ను చిరకాలం గా వేధిసూనే ఉంది. సందర్భమైనప్పడల్లా పండితులతో ఈనాసందేహం సంగతి చెబుతానే వచ్చాను.

నాడుపూరీ జగనాథస్వామి రధోత్సవం ముగిసే ఆషాఢ శుద్దపూర్ణిమ. శ్రీకండంపాటి రామకృష్ణ శాస్త్రిగారనే ఒక పండిత ప్రకాండునితో సంభాషణవశాన్ని సుభద్రా ప్రాణన్నాథాయ! జగన్నాథాయ!' అనే శ్లోకం సంగతి ఎత్తాను.

ఈ సందర్భంలో ఆయన చెప్పిన సంగతులు ఆంధ్రదేశంలోని పూరీజగన్నాథ భక్తులు ఆందరూ తెలిసికో తగ్గవిగా ఉన్నాయి. "రౌత్రిసవంత్సరంలో ఆషాఢమాసంలో నేను పూరిజగన్నాథం పోయి ఉన్నాను. రథయాత్ర జరుగుతూ ఉంది. స్వామి జగన్నాథం నుంచి ఇంద్రద్యుమ్నానికి వెళుతున్నాడు. అక్కడ మూడురోజులు ఉండి శుద్ద ఏకాదశినాటికి తిరిగి జగన్నాథం చేరుతాడు.

ఆలయందగ్గరనుంచి ఒక దాని ప్రక్కను ఒక రథంగా మూడురథాలు బయలుదేరుతాయి. మొదటి రథంలో జగన్నాథస్వామి వేంచేసి ఉన్నారు. దానికి కుడితట్టున ఉన్న రథంమీద సుభద్రాదేవి ఉంది. దేవి రథానికి కుడితట్టున్న ఉన్న రథం మీద బలభద్రుడు ఉన్నాడు.

లీలాచల లూసాయ నిత్యాయ పరమాత్మనే

సుభద్రా బలభద్రాభ్యామ్ జగనాథాయ మంగళమ్,
అష్టమగర్భంలో పుట్టిన శ్రీకృష్ణుని యశోదవద్దకున్నూ మార్చుటకు అవకాశము కల్పించినదిన్నీ కంసుని చేతపైకి ఎగురవేయబడినదిన్నీ భద్ర, సుభద్ర, భద్రకాళి మొదలైన పన్నెండు నామాలతో ప్రఖ్యాతమైనదిన్నీ అయిన యోగమాయాదేవి ఈ సుభద్ర. ఈ విషయమంతా స్థల పురాణంలో ఉందా, సోదరి సోదర సహితుడై స్వామి ఊరేగుతూ ఇంద్రద్యుమ్నానికి వెళ్లి వస్తాడు.

జగనాథస్వామి దేవేరి లక్ష్మి ఈ ఊరేగింపుతో ఇంద్రద్యుమ్నానికి వెళ్లదు. దేవి ఆలయం ప్రాకారంలో విడిగా గర్భగుడికి కొంచెం వెనుకగా ఎడమవేపున ఉంది. తమరు వెళ్ళి చూడండి. స్వామి, సుభద్ర, బలభద్రుడు ఇంద్రద్యుమ్నానికి పోయివచ్చిన తరువాత దేవి వెంటనే తలుపు తియ్యదు. మూడురోజుల తరువాత తీస్తుంది. మూడురోజులూ స్వామి సోదర సోదరీ సహితుడై బయటనే ఉండిపోతాడు.

English summary
Here astrologer explains about lord jagannath swamy rath yatra and its related mythology.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X