నేటి రాశి ఫలాలు: జూన్ 25, ఆదివారం

By:
Subscribe to Oneindia Telugu
Daily horoscope - Raasi Phalalu

మేషం రాశివారు (అశ్విని4 పాదాలూ, భరణి 4పాదాలూ, కృత్తిక 1వ పాదము)
అసలు అనుకోని మార్గాలద్వారా ఆర్జించగలుగుతారు. ధనలాభము కలుగవచ్చును. గృహములో ఆనందము కలుగుతుంది, అందరితో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు. మీ ఉన్నతిని చాటుకోవడానికి ధనం బాగా వెచ్చిస్తారు..మంచి పదార్ధములు ఆరగిస్తారు. నూతన వస్త్ర లాభము, అయిన బాగా పరపతి ఉన్న వ్యక్తుల సపోర్ట్ మీకు మంచి నైతికంగా పెద్ద ప్రోత్సాహం అవుతుంది.వారితో మంచి సంబంధము ఏర్పడుతుంది.

Daily horoscope - Raasi Phalalu

వృషభ రాశివారు (కృత్తిక2,3,4 పాదాలూ, రోహిణి 4 పాదాలు, మృగశిర 1,2 పాదాలు)
మీ గౌరవమునకు భంగము కలుగును. యోచనా శక్తి వలన కొన్ని ఇబ్బందులకు గురి కాగలరు. వృత్తి వ్యాపారములలో ఇబ్బందులు రాగలవు. ఈ రోజు మీకు ఎంతో కష్టంగా గడుస్తుంది. ఆఖరి క్షణంలో మీ ప్రణాళికలకు మార్పులు చేయవలసి- రాగల వచ్చే రోజు. మీ ఇంటిగురించి ముపు చెయ్యడం లాభదాయకం. ఈరోజు మీరు మరీ అతిశ్రమ వద్దు, మీశరీరపు రోగనిరోధకత తక్కువ కనుక విశ్రాంతి తీసుకోవడం మంచిది.

Daily horoscope - Raasi Phalalu

మిథున రాశివారు (మృగశిర 3,4 పాదాలు, ఆర్ద్ర 4 పాదాలు, పునర్వసు 1,2,3 పాదాలు)
ఈ సమయములో మీరు మంచి స్నేహితులను మరియు కావలసిన వారిని పొందగలరు. దీని వలన మీ మనస్సునకు, శరీరమునకు ఎంతో ఆనందం సుఖం కలుగగలదు. ఒక యోగివంటి వ్యక్తినుండి దైవిక జ్ఞానాన్ని పొందడంవలన, ప్రశాంతతను, హాిని పొందుతారు. ఈ రోజు, మూలధనం సంపాదించగలుగుతారు ఈ అనవసర ఆందోళనలు మరియు బెంగలు, మీ శరీరంపైన డిప్రెషన్ వంటి వత్తిడులు మరియు చర్మ సంబంధ సమస్యలు వంటి వాటికి దారితీసి ఇబ్బంది పెడతాయి.

Daily horoscope - Raasi Phalalu

కర్కాటక రాశివారు (పునర్వసు 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు)
వీలైతే, సూర్యకిరణాలకు కూడా అతిగా గురికాకండి. నేత్ర జబ్బులు సంభవించవచ్చును. మనశ్శాంతి తగ్గుతుంది. పాజిటివ్ గా ఆలోచిచండి. ఇతరులతో మెలిగినపుడు జాగ్రత్త అవసరము. నిర్ణయములు తీసుకొన్నప్పుడు జాగ్రత్తగా ఆలోచించండి. ఉద్యోగంలో కొన్ని ఇబ్బందులున్నాయి. తెలివిగా వ్యవహరిస్తే సరిపోతుంది. విమర్శల జోలికి పోవద్దు. కలహాలకు అవకాశం ఉంది. పనులు నిదానంగా సాగుతాయి.

Daily horoscope - Raasi Phalalu

సింహం రాశివారు (మఖ 4పాదాలూ, పుబ్బ 4 పాదాలూ, ఉత్తర 1 వపాదం)
స్నేహితులతో బంధువులతో ఉత్సాహముగా ఆనందముగా ఉందురు. పాత స్నేహితులని కలుస్తారు. కొత్త స్నహితులు ఏర్పడతారు. లైఫ్ పార్ట్నర్ తో సరసంగా రోజుగడుపుతారు. అందమైన, రొమాంటిక్ రోజిది. కానీ ఆరోగ్య సమస్యలు కొన్ని ఇబ్బంది పెట్టవచ్చు. శ్రీవారు/ శ్రీమతి వైఖరి ఉల్లాసం కలిగిస్తుంది. వైవాహిక జీవితంలోకెల్లా అత్యుత్తమమైన రోజు కానుంది. ప్రేమ తాలూకు సిసలైన పారవశ్యాన్ని ఈ రోజు మీరు అనుభవించబోతున్నారు.

Daily horoscope - Raasi Phalalu

కన్య రాశివారు (ఉత్తర 2,3,4 పాదాలు, హస్త 4 పాదాలూ, చిత్త 1,2 పాదాలు)
విహార యాత్రలు, సామాజిక సమావేశాలు లేదా సోషల్ గెట్- టుగెదర్ లు మిమ్మల్ని రిలాక్స్ అయేలాగ, సంతోషంగా ఉంచుతాయి. ఉద్యోగంలో మంచిపేరు తెచ్చుకుంటారు. మీ గొప్పతనాన్ని ఎదుటివారు గుర్తిస్తారు. ప్రమోషన్లు, మంచి పేరు సంపాదించుకొనగలరు. అధికారము మీ చేతికి వచ్చును. సంఘములో మీరు కీర్తి పొందుతారు. అయితే కొన్ని శారీరక జాగ్రత్తలు అవసరము, గర్భాధారణ విషయములో జాగ్రత్త అవసరము. మొత్తము మీద శారీరకముగా బాగుండుు. విందు భోజనము చేస్తారు.

Daily horoscope - Raasi Phalalu

తుల రాశివారు (చిత్త 3,4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 1,2,3 పాదాలు)
ఇది ఇక పరీక్షా కాలము కానీ మంచిపనులు చేస్తారు, మంచి పేరు సంపాదిస్తారు. ధన నష్టము కలుగుటకు అవకాశము ఉన్నది. ఇంట్లోని వాళ్ళతో గొడవపడకండి. రహస్య శత్రువులు, మీగురించిన తప్పుడు ప్రచారాలను, రూమర్లుగా ప్రచారం చెయ్యడానికి ఆత్రంగా ఉంటారు. మీ యొక్క శత్రువలపై ఓ కన్నేసి ఉండాలి. పనిచేసే చోట, ఇంటిలను వత్తిడి మిమ్మల్ని కోపిష్ఠి వారిగా చేయవచ్చును.

Daily horoscope - Raasi Phalalu

వృశ్చిక రాశివారు (విశాఖ 4వ పాదం, అనూరాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు)
అధికారులతో మంచిగా మెలగాలి, వృత్తిలో జాగ్రత్తగా వ్యవహరించాలి. అనవసర వాదనలకు దిగరాదు. ఈ దశలో శత్రువులు పెరుగుతారు, అనవసరముగా విరోధములు ఎవరితోను పెటుకొనరాదు. మీ డబ్బు సంబంధమైన సమస్య మీ నెత్తిమీదనే తిరుగుతుంది. మీకున్న ఎక్కువ సొమ్ము మొత్తాన్ని సురక్షితమైన చోట పెట్టండి, అది మీకు నమ్మకమైన రీతిలో అధికమొత్తాలను రాబోయే రోజులలో తెచ్చిపెడుతుంది.

Daily horoscope - Raasi Phalalu

ధను రాశివారు (మూల 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1 వపాదం)
నూతన వాహన లాభము, కీర్తి, సౌఖ్యము, ఆనందమును సంపాదించుదురు. జయము, నూతన పరిచయాలు పెరుగును. ఆర్థికపరిస్థితులలో మెరుగుదల మీరు ముఖ్యమైన వాటిని కొనుగోలు చేయడానికి వీలు కల్పిస్తుంది. మిత్రులతో గడిపే సాయంత్రాలు, లేదా షాపింగ్ ఎక్కువ సంతోషదాయకమే కాక ఉద్వేగభరిత ఉత్సాహాన్ని ఇస్తాయి. జాగ్రత్త, మీ ప్రేమికభాగస్వామి మిమ్మల్ని పొగడ్తలతో పడేయగల సూచనలున్నాయి.

Daily horoscope - Raasi Phalalu

మకర రాశివారు (ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణం 4 పాదాలు, ధనిష్ఠ 1,2 పాదాలు)
శత్రువులు తగ్గిపోతాయి, సజ్జనులతో సహవాసము కలుగవచ్చును. ఈ రోజు మీ ఆరోగ్యం గురించి వర్రీ పడనక్కరలేదు. ఆరోగ్యము బాగుండును, ఆనందముగా ఉందురు. అధికారయోగం ఉంది. పెద్దల అండదండలు లభిస్తాయి. గౌరవప్రదమైన జీవితం ఉంది. విశ్రాంతి లేకపోవడమనేది మిమ్మల్ని బలహీనులను చేస్తుంది. దీని పోగొట్టుకోవడానికి, ఎక్కువదూరం నడవడం, తాజా గాలిని పీల్చడానికి వెళ్ళడం చెయ్యండి.

Daily horoscope - Raasi Phalalu

కుంభ రాశివారు (ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు)

ఏది తలపెట్టినా కలసి రానందున మనశ్శాంతి కరువై, చింత పెరుగును, కొంత గడ్డుకాలముగా గడుస్తుంది. మీ స్నేహితతులకు వచ్చిన మంచిపేరు మిమ్మల్ి మరింత కృంగదీస్తుంది. ఆర్థిక ఇబ్బందులు, ధన నష్టము కలగవచ్చును. ఆచితూచి ఖర్చు చేయవలెను. పని వత్తిడివలన మానసిక శ్రమ వంటివి పెరుగుతాయి.

Daily horoscope - Raasi Phalalu

మీన రాశివారు (పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు)
శారీరక చింత పొందుదురు. కుటుంబ సభ్యుల / కూతురి అనారోగ్యం మిమ్మల్ని, మీ మూడ్ ని క్రుంగదీస్తుంది. ఆమె తన అనారోగ్యాన్ని అధిగమించేలాగ హుషారు పొందేలాగ మీప్రేమను అందించండి ఆరోగ్య పరిస్థితి మిమ్మల్ని బాధించును. మనశ్శాంతి కరువు అగును. మనసున భీతి కలుగును, మనో నిబ్బరము ఉండాలి.

English summary
Astrologer is giving daily horoscope for Oneindia Telugu readers. Readers can catch their daily fate here
Please Wait while comments are loading...