వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భగవద్గీతకి కుడా ఒక పుట్టిన రోజు

భగవద్గీతకు కూడా ఓ పుట్టిన రోజు ఉందని జ్యోతిష్కుడు చెబుతున్నారు. గీతా జయంతి వ్యక్తులవలె జయంతి జరుపుకొనగలిగే అవకాశం గీతాగ్రంథము నకు కలిగినది.

By Pratap
|
Google Oneindia TeluguNews

గీతా కల్పతరుం భాజేభాగావతా కృష్ణేన సంరోపితం
వేదవ్యాస వివర్ణితం శ్రుతికెరోజం ప్రబోధాంకురమ్
నాసాభాస రహస్య శాఖ మధతి కాంతి ప్రవాలాంకితం
కృష్ణాంఘ్రిద్వయ భక్తి పుశ్పసురభిం మోక్షప్రదం జ్ఞానినామ్.

దీని అర్థం

"గీత యను కల్పవృక్షమును నేను సేవించుచున్నాను. అయ్యది భగవంతుడగు శ్రీకృష్ణపరమాత్మచే నాటబడినది. వేదవ్యా సమహర్షిచే పెంచబడినది. ఉపనిషత్తులే దాని విత్తనము. ఆత్మప్రబోధము నినిలింకునము. వివిధ శాస్త్రములు యొక్క రహస్యములు దాని కొమ్మలు, వైరాగ్యము, సహనము మున్నగు సదుణములు దాని చిగురుటాకులు. కృష్ణపరమాత్మ యొక్క పాదపద్మముల యెడల భక్తి దాని పుష్పసుగంధము. మణియు అది జ్ఞానులకు మోక్షదాయకమైనది. "

గీతా జయంతి వ్యక్తులవలె జయంతి జరుపుకొనగలిగే అవకాశం గీతాగ్రంథము నకు కలిగినది. దాని వైశిష్ట్యమువలననే దానికఅలాంటి అపూర్వగౌరవము సిద్ధించినది. శ్రీకృష్ణభగవానుడు రణరంగమున అర్జునునకు గీతోప దేశము చేసిన సు దినము మార్గశిర శుద్ధ ఏకాదశి. కాబట్టి ఆ దినము మహాపర్వదివసముగ భావింపబడుచున్నది.

A birth time for Bhagavadgeeta

శ్రీరామజయంతి, శ్రీకృష్ణ జయంతి, శ్రీ బుద్దజయంతి, దత్తాత్రేయజయంతి, శంకరజయంతి, మున్నగు ఉత్సవములు జరుగు పవిత్రదినములలో ఆ యా అవతారపురుషులను జనులు ఎలా పూజిస్తారో, శ్రీ గీతాజయంతి సందర్భముకూడా డ గీతాదేవిని పూజించే ఆచారము ఉంది. ఆ సుదినమున గీతా గ్రంథముయొక్కయు, శ్రీకృష్ణ, శ్రీవ్యాస, శ్రీ అర్జునులయొక్కయు అర్చనలతోబాటు ఈ క్రింది కార్యక్రమములను గూడ అమలుజరుపుట చాలమంది చేస్తారు.

(1) భగవద్గీత మొత్తము 18అధ్యాయముల పారాయణము వ్యక్తిగతముగ గాని, సామూహికముగగాని జరుపుతారు. భక్తులు కొందలు చేరినచో సమష్టి పారాయణము జరుపుతారు.

(2) గీతాతత్త్వము తెలిసిన మహనీయులచే ఆనాడు గీతను గూర్చి ఉపన్యాసముల నేర్పాటు చేయిస్తారు. గీతోపన్యాసముల మూలముగ జనులలో గీతయందలి మహోన్నత భావములు వ్యాప్తినొందుటయే కాక గీతపై వారికి అనురక్తి అధికమవ వచ్చును.

(3) పిన్నలలోను, పెద్దలలోను గీతాపోటీపరీక్షలు ఏర్పాటుచేసి గెలుపొందిన వారికి ఆనాటి సాయంత్రము బహిరంగసభలో బహుమతులు పంచిపెడతారు.

(4) గీతాజయంతి మహాపుణ్యదివసమగుటవలన, ఆనాడు గీతా గ్రంథమును శ్రీకృష్ణపరమాత్మ, శ్రీవేదవ్యాసమహర్షి ఆర్జునుడు-వీ రియొక్క పటములను చిత్రవిచిత్రముగ పుష్పాదులతో నలంకరించి రథముపైగాని, చిన్ని శకటముపైగాని ఉంచి మేళతాళములతో, భజన లతో పురముయొక్క ప్రధానవీధులగుండా ఊరేగింపు జరుపుతారు.

English summary
According to Astrologer Bagavadgeeta has its own date of birth.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X