వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బ్రహ్మస్వరూపం: చతుర్ముఖ రుద్రాక్షమాలధారణ

నాలుగు ముఖాలు కల్గిన రుద్రాక్ష బ్రహ్మదేవుని స్వరూపము. ముందుగా ఆవుపాలతో శుద్ధిచేసి శివాలయంలో అభిషేకంచేసి ధరించగలరు

By Pratap
|
Google Oneindia TeluguNews

నాలుగు ముఖాలు కల్గిన రుద్రాక్ష బ్రహ్మదేవుని స్వరూపము. ముందుగా ఆవుపాలతో శుద్ధిచేసి శివాలయంలో అభిషేకంచేసి ధరించగలరు. సాధారణముగా బుధవారము. ఉదయము 6గం| నుండి 7గం|| లోపుగా ధరించ వలెను.

ముఖ్యముగా గురుపూర్ణిమ, దత్తజయంతి పర్వదినములందు బ్రహ్మీముహూర్త సమయములో ధరిస్తారు మాలధారణ చేయునప్పుడు రుద్రాక్ష మంత్రమును 11మార్లు జపించవలెను ఈ మాలను పాలలో ఉంచి 20 రోజులు త్రాగినచో చక్కని ఆలోచనలు కలుగును

ఈ మాలధారణ వలన ముఖ్యముగా చదువుట, నేర్చుకొనుట చాలా తేలికగా అభ్యాసమగును అంతేగాక సముద్రపటంచులదాక జ్ఞానముకొరకు పయనించును దీని ధారణతో అపారముగా జ్ఞానము ఉత్తమ ఆరోగ్యము కలుగును. నరహత్య నుండి విముక్తి గొప్ప జ్ఞానం, సిరిసంపదలు లభిస్తాయి దీని ధారణ వలన పరిశోధనాత్మకం, తర్కమువాదన, ఆలోచనలో ఒక పరిశీలన బాగా పెరుగుతాయి.

Astrolgy: Chathurmukha Radraksha

దీని ధారణ వలన సంపద మంచి ఆరోగ్యము కలుగును. మంచ తెలివితేటలు కలుగును. ముఖ్యముగా వ్యాపారసులకు ఈరుద్రాక్షధారణ వలన వ్యాపారాభివృద్ధి కలుగును.

ఐదు ముఖాల రుద్రాక్ష

పంచ బ్రహ్మ స్వరూపము, దీని ధారణతో పరమశివుడు ఆనందము పొందుతారు. ముందుగా ఆవుపాలతో శుద్ధిచేసి శివాలయములో రుద్రాభిషేకం చేసి ధరించాలి.

సాధారణముగా కార్తీక సోమవారములందు లేదా సోమవారము ఉదయం 6గం| నుండి 7గం|| లోపుగా దరించాలి
ముఖ్యముగా దత్తజయంతి, గురుపౌర్ణమి, శివరాత్రి పర్వదినములందు ధారణ చేయుట చాలా శ్రేష్టం ఈ రుద్రాక్షను బ్రాహ్మణులకు కార్తీకమాసములో సోమవారం దానము చేసినచో చాలా మంచిది · ఈమాలధారణ చేయనప్పడు రుద్రాక్ష మంత్రమును 11మార్లు జపించవలెను ఈ రుద్రాక్షమాలను నీటిలో వుంచి ఆ నీటిని త్రాగినచో రక్తశుద్ధిఅగును
ఇది ధరించుటవల్ల తినరాని పదార్థాలు తినినప్పుడు పాపాల నుండి ముక్తి పొందుతారు. అందువలన దీనిని "రుద్రకాలాగ్ని" అని అంటారు

చిన్నసైజు పంచముఖి రుద్రాక్షలు చాలా శ్రేష్టమైనవి. ఇవి అధ్యాత్మధ్యానానికి ఏకాగ్రతకు ఉపయోగపడును ... · ముఖ్యముగా పంచముఖి రుద్రాక్షలలో చాలా రకాలు సైజులు వున్నాయి. వీటిని ధరించిన వారికి అన్ని విషయములలో విజయము సాధించును. రక్తపోటు మరియు గుండెనొప్పలకు సంబంధించిన వ్యాధులు పూర్తిగా తగ్గిపోవును.

English summary
Astrologer described the speciality of Chathurmukha Rudraksha mala and its importnace.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X