వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పంచమహాపాతకాలనుతొలగించే నారాయణ నాగబలి

నాలుగు వేదాలలో ఒకటైన అధర్వణవేదం వివిధ రకాల మంత్ర తంత్రాలకు నిలయం అయి ఉన్నది. ఆయుర్వేదం అని పిలువబడే హైందవ వైద్యశాస్త్రంకూడా " ఈ అధర్వణవేదంలోని ఒకభాగం అయి ఉన్నది.

By Pratap
|
Google Oneindia TeluguNews

నాలుగు వేదాలలో ఒకటైన అధర్వణవేదం వివిధ రకాల మంత్ర తంత్రాలకు నిలయం అయి ఉన్నది. ఆయుర్వేదం అని పిలువబడే హైందవ వైద్యశాస్త్రంకూడా " ఈ అధర్వణవేదంలోని ఒకభాగం అయి ఉన్నది. అధర్వణవేదంలో ఇమిడి ఉన్న ఆయుర్వేదవైద్యశాస్త్రంలో కూడా మంత్ర తంత్రాలను వైద్యంలో భాగంగా ఉపయోగించటం జరుగుతున్నది.

ఆయుర్వేదవైద్యశాస్త్రం ప్రకారం కొన్నిసార్లు ఒకరోగానికి తగిన ఔషధాలను రోగికి ఇవ్వటమేకాకుండా ఆ రోగి గతజన్మలోచేసిన పాపాలకు తగిన పరిహారాలను కూడా చేసినప్పడే ఆ రోగికి ఇచ్చిన మందులుపనిచేసి రోగం తగ్గుతుంది. గతజన్మలో చేసిన పాపప్రభావం అధికంగా ఉంటే ఈ జన్మలో ఇప్పడు ఉన్న రోగానికి చేసే చికిత్స ఏమాత్రం ఫలించదు. అంటే కర్మఫలితం వెంటాడుతున్నంతవరకూ రోగం ద్వారా కలిగే బాధ అనే శిక్షను రోగి భరించితీరాలి అన్నమాట.

ఆ కారణంగానే ఇటు ఔషధాలు, అటు దైవపూజలు ఏకకాలంలో ప్రయోగించినపుడే õ°ጸ8 రోగనివారణ జరిగి ప్రశాంతత కలుగుతుంది. గోహత్య ప్రీహత్య నాగుపామును చంపటం, పిల్లిని చంపటం, పసిబిడ్డల్ని చంపటం, లాంటి పాపాలు గతజన్మలో చేసిఉన్నట్లయితే ఆ పాప ఫలితాలు ఈజన్మలో రోగాల రూపంలో సంక్రమిస్తాయి. ఇలా రకరకాల పాపాలవల్ల కలిగే రోగాల నివారణకు, పితృశాపాల వల్ల కలిగే సమస్యలకు పరిహారంగా చేయబడే నారాయణబలి ప్రక్రియను గురించి తెలుసుకుందాం.

Astrologer gives Narayana Nagabali details

నారాయణ నాగబలి విధిని ధనిష్ణాపంచకము మరియు త్రిపాద్ నక్షత్రాలలో చెయ్యకూడదని నిర్ణయసింధు అనే జ్యోతిషమహాగ్రంధము తెలియజేయు చున్నది. -

ధనిష్ణా పంచకము అనగా 1. ధనిష్ణా నక్షత్రము-3, 4 పాదాలు 2.శతభిషం 8. పూర్వాభాద్రా 4. ఉత్తరాభాద్రా 5, రేవతి.
త్రిపాద్ నక్షత్రములు అనగా 8 1. కృత్తిక 2. పునర్వసు 3. ఉత్తర 4. విశాఖ 5, ఉత్తరాషాఢ 6. పూర్వాభాద్ర. ఈ ఆరు నక్షత్రాలను త్రిపాద్(Tripad) అంటారు.

1. పంచమి, ఏకాదశి తిధులలోకానీ, శ్రవణానక్షత్రంలోకానీ, నారాయణ నాగబలివిధిని జరిపించినట్లయితే పితృశాపం తొలగిపోయి సంతానంలేని వారికి తప్పక సంతాన భాగ్యం కలుగుతుంది.

2. హస్త, ఆశ్లేషా, మృగశిర, ఆరుద్ర, మూల, పుష్యమి, స్వాతి మరియు మూలా నక్షత్రములు నారాయణనాగబలి ప్రక్రియకు శుభప్రదమైన నక్షత్రములుగా గుర్తించాలి.

3. ఆదివారము, సోమవారము, గురువారములు నారాయణ నాగబలికి అనుకూలమైన వారములుగా శాస్త్రములు పేర్కొంటున్నాయి.

త్రయంబకేశ్వర్ క్షేత్రంలో నారాయణనాగబలి జరిపే విధానం :

మహారాష్ట్రలోని నాసిక్లో గల త్రయంబకేశ్వరంలో నారాయణసాగబలి మూడురోజులపాటు జరుపబడుతున్నది. ఈ విధానంలో మొదటిరోజున ఈ పరిహారం చేయించుకునేవారు కుశావర్తంలో స్నానంచేసి బ్రాహ్మణులకు వివిధ రకాల దానాలను ఇచ్చి ఆపై త్రయంబకేశ్వర్ ఆలయంలో ప్రార్థనలుచేస్తారు.

ఆ తరువాత అక్కడకు దగ్గరలో ఉన్న ధర్మస్థల అనే ప్రదేశానికివెళ్ళి అక్కడ గోదావరి మరియు అహల్యనదులు సంగమించే ప్రదేశంలో నారాయణనాగబలి ప్రక్రియలను చేయించుకుంటారు. కేవలము పితృదోషం, పితృశాపం ఉన్నవారే కాక ఇతరుల ఉసురుపోసుకున్నవాళ్ళుకూడా (తనకన్నా బలహీనుల్ని దౌర్జన్యంతో లొంగదీసుకుని వాళ్ళ ధన, మాన ప్రాణాల్ని దోచుకుని వాళ్ళకి తీవ్రమైన మానసికవేదన కలిగించినపుడు ఆ అశక్తులైన వారి మనోవేదన ఒక శాపం రూపం ధరించి వారిపై దౌర్జన్యంచేసినవారికి తగులుతుంది. దీనినే ఉసురు పోసుకోవటం అంటారు.

ఇలా ఇతరుల ఉసురుపోసుకున్నవారికి ఎంతోచెడు జరిగే అవకాశం ఉన్నది. అంతేకాకుండా ఆ ఉసురు తరతరాలుగా తర్వాతివారినికూడా పీడించే అవకాశం ఉంటుంది. గతంలో ఎంతోమంది రాజులు, జమిందారులు బలహీనుల ఉసురుపోసుకుని సంతాన నష్టం పొందటం భయంకర రోగాలుపాలుకావటం జరిగింది. ఆ తరువాత వారు తమ పాప పరిహారార్ధం ఆలయాలు, సత్రాలు కట్టించటంతోపాటుగాపండితులచేత నారాయణనాగబలి లాంటి తాంత్రిక పరిహారాలనుకూడా చేయించుకుని ఉసురుబాధ తప్పించుకోవటం జరిగింది.) ఈ నారాయణ నాగబలి ప్రక్రియను చేయించుకోవటం జరుగుతుంది.

మొదటిరోజున నదిఒడ్డున ఒక ప్రదేశంలో కలశస్థాపన చేస్తారు. ఆ తరువాత బ్రహ్మ విష్ణ, రుద్ర, యమ అనే దేవతల్ని ఆరాధిస్తారు. ఆ తరువాత పర్నశార్ అనే ప్రక్రియ జరుపబడుతుంది. ఈ ప్రక్రియలో చనిపోయి అశాంతితో తల్లడిల్లుతున్న పూర్వీకుల ఆత్మలను అక్కడకు రప్పించి వారి ఆత్మశాంతికి తగిన పరిహారాలను చేయటం జరుగుతుంది.

రెండవరోజున చనిపోయిన వ్యక్తిపట్ల గౌరవాన్ని సూచిస్తూ సూతకం పాటించి కుశావర్తన్లో స్నానంచేస్తారు.
మూడవరోజున త్రయంబకేశ్వర ఆలయంలో పూజలుచేసి నారాయణ నాగబలి ప్రక్రియను తమచేత చేయించిన బ్రాహ్మణ పండితులకు తమశక్తి కొద్ది దక్షిణలు సమర్పిస్తారు. ఒకరకంగా చెప్పాలంటే నాగబలిలోను, నారాయణ బలిలోను కూడా కృత్రిమంగా బియ్యంపిండితో తయారుచేసిన ఒక మనిషి బొమ్మకుకాని, త్రాచుపాము బొమ్మకుగాని దహన సంస్కారాలు జరిపి ఆ తరువాత వాటికి శ్రార్ధకర్మలు జరపటం జరుగుతుంది.

ఈ నారాయణనాగబలి ప్రక్రియ ఒక మంచి నక్షత్రంలోకానీ, తిధిలోకానీ, వారమునకానీ ప్రారంభించబడి, రెండవరోజు మధ్యాహ్నాన్నికి పూర్తిచేయ బడుతుంది.

English summary
Astrologer describes what is Narayana Ngabali and its importnace.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X