వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పెళ్లైన తర్వాత వధూవరులకు అరుంధతీనక్షత్రం చూపిస్తారెందుకు?

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: వివాహం జరిగిన రాత్రి వధూవరులను ఇంటి బయట (వివాహ వేదికకు) తూర్పునకుగానీ, ఉత్తరానికిగానీ తీసుకుని వెళ్ళి, మొదట ధ్రువ నక్షత్రాన్ని తరువాత అరుంధతీ నక్షత్రాన్ని వారికి చూపిస్తారు. ధ్రువ నక్షత్రం లాగ వారు నిలకడ అయిన మనస్తత్వాలతో స్థిరంగా ఉండాలని, అలాగే వధువు అరుంధతి లాగా మహాపతివ్రతగా మనుగడ సాగించాలనే ఆకాంక్ష ఈ ప్రక్రియలో కనిపిస్తుంది. ధ్రువ నక్షత్ర దర్శనం చేసేప్పడు ఈ మంత్రం చెప్పాలి.

ధ్రువ క్షితికి ధ్రువ యోనిః, ధ్రువమపి ధ్రువతః స్థితం త్వం నక్షత్రాణాం మేధ్యసి సమాపాహి పృతన్యతః

ఈ భూగోళం కేంద్రం ధ్రువము, ఈ ఉత్పత్తి స్థానం ధ్రువము, నీవు ధ్రువము, - ధ్రువముగా నుందువు, నక్షత్రముల సమూహమున ధ్రువత్వము పొంది వర్ధిల్లుడు.
అరుంధతీ నక్షత్ర దర్శనం చేసినప్పడు ఈ మంత్రం చెప్పాలి.
సప్తర్షయః ప్రథమా కృత్తికానాం అరుంధతీం యత్ ధృవతాం

హనిన్యుః షట్కృత్తికా ముఖ్య యోగ వహంతీ యం అస్మాకం ఏత త్వష్టమీ.

సప్తఋషులు కృత్తికలలో మొదటి దానినిగా ఈమెను పిలుచుట చేత మిగిలిన ఆరు కృత్తికలకు ముఖ్యమైన కలయికను ఈమె నడుపుచున్నది. మాకు ఈమె ఎనిమిదవది.

astrologer tells about arundhati nakshatram

దేవతలెంతమంది ఉన్నారు? ఎన్నిరకాల మంది ఉన్నారు?
దేవతలు రెండు రకాలు - జన్మదేవతలు, కర్మ దేవతలు. అగ్ని ఇంద్రుడు, యముడు, వాయువు, వరుణుడు మున్నగువారంతా జన్మదేవతలు. భూలోకం ఇతర లోకాల్లో పుణ్యకర్మలు చేసి, వాటి కనుగుణంగా స్వర్గాది భోగాలను అనుభవించడానికి వెళ్ళే నహుషుడు మున్నగువారు కర్మదేవతలు. మొదటిరకంవారు లోక హితానికై సృష్టించబడి, ఆయా అధికారాలు చెలాయిస్తూ, యజ్ఞ, యాగాదులలో భోక్తలై ప్రళయం వరకు ఉండేవారు. ఇక రెండవరకం వారు, వారి పుణ్యరాశి క్షీణించగానే, తిరిగి తమ కర్మలననుసరించి వేరు వేరు లోకాలకు పోయి జన్మించేవారు కోకొల్లలు. మొదటి తరగతివారు - అష్ట వసువులు, ఏకాదశ రుద్రులు, ద్వాదాశాదిత్యులు, ఇద్దరు అశ్వినీ దేవతలు - మొత్తం 38 వర్గాలు. 33 కోట్ల దేవతలని కూడా ప్రసిద్ధి. ఇక్కడ కోటి అంటే సమూహం అనే అర్ధమే తీసుకోవాలిగాని, సంఖ్యతో సంబంధం లేదు. ఇంకా, పితృదేవతలు అని మరొక వర్గం ఉంది. వీరు మరణించిన వారి సంతతిచే చేయబడే కర్మలచే తృప్తిపొంది, మృతులకు వారి బంధువులకు కూడ దుర్గతి నివారణ, సద్దతి ప్రాప్తి కలిగించగల అధికారాన్ని కలిగి ఉంటారు. మనిషి మరణించడంతోటే, మొదట వెళ్ళేది పితృ లోకానిక అక్కడే అందరి జన్మజన్మల వివరాలు, చేసిన లెక్కలు భద్రపరచబడి ఉంటాయి. ఆ లోకంలో ఉన్న రికారుల కనుగుణంగా, జీవి ఆయా లోకాలకు వెలతాడు.

అంటు, ఎంగిలి అంటే ?
ఎంగిలి తమోగుణాన్ని వృద్ధి చేస్తుందని భగవద్గీత చెబుతున్నది. తమోగుణం వల్ల బుద్ధి వికసించదు. ఒకరి ఎంగిలి ఇంకొకరు తినడం అనారోగ్యాన్ని పెంచుతుంది. పిల్లల్ని ఎవరి ఎంగిలికీ అలవాటు చెయ్యకూడదు. దేవతారాధనలో అంటు, మైల అసలు పనికిరావు. నైవేద్యం చేసేప్పడు, ప్రసాదం స్వీకరించేప్పడు కూడ ఇవి పాటించాలి. ఆత్మకు అంటు, ఎంగిలి అంటకపోవచ్చు. కాని ఆత్మ వండేది దేహంలోనే కదా! అంతఃశుచి, బాహ్యశుచి రెండూ పాటించవలసినవే. అలాగని అంటు, ఎంగిలి మీరు కలుపుకోనవసరం లేదు. అలవడిన మంచి అలవాట్లు, ఆచారాలు మానుకొనవలసిన అవసరం లేదు. వాటిని పాటిస్తూ ఉండండి.

శ్రాద్ధ సమయంలో కాకులకు పిండాలు వేస్తారెందుకు?
రాక్షసభీతిచేత ఇంద్రాదులు, పితృదేవతలు కూడ కొంతకాలం కాకులుగా తిరిగేవారట. అప్పడు పెట్టే పిండాలు తిని తృప్తిపడతారట. తద్దినాలప్పడు కాకులకు పిండాలు పెట్టడానికి కారణం ఇదే. కారణం ఏదైనా, మూగజీవాలకు ఆహారం పెట్టడం మన ధర్మం.

English summary
Astrologer described about arundhati nakshatram.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X