వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆషాఢశుద్ద దశమి: ఆషాఢమాసములో కోర్కెలు తీర్చే కథ ?

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఈనెలలో శాకవ్రత మహాలక్ష్మీవ్రతారంభం చేస్తారు. ప్రతీ నేలలోలాగానే ఈనెలలో ప్రకృతిని ఆరాధించే విధానాన్ని శాక మహాలక్ష్మీ దేవి రూపంతో ఆరాధిస్తారు. ఈమాసంలో మహాలక్ష్మీ పూజ చేసి ఒక నెల ఆకుకూరలు తినుటమాని ఆకుకూరలు దానం చేయాలి అనేది కొందరు పాటించే పుణ్యకార్యము. దీనిని ఆచరించిన మొదటి వ్యక్తీ చాక్షుష మనువు, అతని కథని పురాన ప్రవచనంలో చెప్పించుకుని వింటారు.

ఇలావిన్నవారికి కోర్కెలు తీరుతాయి అని ఒక నమ్మకం. ఆషాఢశుద్ద దశమి చాక్షుష మన్వంతరాది దినము. చాక్షుషమనువు మనువుల్లో ఆరోవాడు. అతని వివరాలు కథారుపంలో విని తరిద్దాం...

అనమిత్రుడని ఒకరాజు ఉన్నాడు. అతని భార్య గిరిభద్ర. వారికి సర్వలక్షణ లక్షితుడైన ఒకకొడుకు పుట్టాడు. పురిటింటిలో గిరిభద్ర కుమారుని మక్కువతో అక్కున చేర్చుకుని ముద్దు పెట్టుకుంది. ఆ శిశువు ఫక్కున నవ్వాడు. ఆ వింత నవ్వుకు కారణం ఏమిటని ఆమె బిడ్డని అడిగింది. అప్పడు ఆ కుట్టాడు ఇట్లా చెప్పాడు. నన్ను మింగడానికి జాతహారిణి అనే మార్ధారం పొంచి ఉంది. అది తెలిసి కొనక నన్ను పుత్ర ప్రేమ చేత ముద్దు పెట్టుకుంటున్నావు. నీకు నాకు పరిచయం ఐదారు దినాలది. ఇంతలో ఇంత వ్యామోహంతో ఉన్నావు!

astrologer tells about ashada shuddha dashami

కుట్టాడు ఇట్లా చెప్పగా గిరిభద్ర కోపగించుకొని నేను చేసే పని నీకు నచ్చకపోతే పురిటింటిలో నుంచి వెళ్లిపోతాను అంటూ వెళ్లిపోయింది. ఆమె వెళ్లిపోవడంతోటే జాతహారిణి వచ్చి ఆ బాలుని తీసుకుని పోయి విక్రాంతుడనే రాజు యొక్క భార్య హైమిని ప్రసవించి ఉన్న శయ్యయందు ఉంచి అచంటి బిడ్డను మరో ఒక యింటికి కొనిపోయి అక్కడ పెట్టి, యింటిలో పుట్టిన శిశువును తివేసింది.

అంత అక్కడ విక్రాంతుడు తన కొడుకు పుట్టిన విషయం తెలుసుకుని చాలా ఆనందించి అతనికి ఆనందుడు అనే పేరు పెట్టాడు. తగిన వయస్సు రాగానే నందునికి ఉపనయనం చేశారు. ఆ సందర్భంలో గురువు అతనిని తల్లికి దండం పెట్టమంటాడు. అప్పడు ఆ బాలకుడు గురువుతో ఇట్లా అన్నాడు. గురువర్యా! నేను ఏ తల్లికి నమస్కారం చేయాలి! నన్ను కన్నతల్లి ఒకరు, పెంచిన తల్లి మరొకరు. అందుమీద గురువు ఆశ్చర్యపడి హైమిని నీ తల్లి కాదా? అని అడిగాడు.

అప్పడు శిష్యుడు 'అయ్యా! ఈమె విశాల గ్రామమందు ఉన్న చైత్రునికి తల్లి ఈమెనాకు తల్లి కాదు. జాతహారిణి అనే మార్ధారం ఆతికమకలకు అన్నిటికీ కారణం. ఇప్పడు నేను ఎవరికి నమస్కరించాలి! అన్నాడు. గురువు ఈ ధర్మసంకటాన్ని తీర్చలేకపోయాడు. చైత్రుని రావించు కోవలసిందిగా విక్రాంతికి చెప్పి ఆనందుడు బ్రహ్మను గురించి తపము చేయడానికి వెళ్లిపోయాడు.

కొంతకాలము తపము చేయగా బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు. ఆనందుడు అతనిని ముక్తిని అర్థించాడు. అప్పడు బ్రహ్మ ఇట్లా చెప్పాడు నీవు మనువు కావలసి ఉంది." జన్మాంతర కృతమైన తపమువలన నీవు ఆరవ మనువు కావలసి ఉంది. మన్వాధికారాన్నీ నిర్వర్తించిన తరువాత నీకు ముక్తికలుగుతుంది. కాబట్టి నీవు ఇప్పడు తపంమానివేయి. పూర్వజన్మలో నీవు నాచక్షుస్సు వలన పుట్టావు. కాబట్టి ఇప్పడు నీవు చాక్షుషమనువు అనే నామంతో వెలయగలవు' అన్నాడు.

English summary
Astrologer described about Ashada Shuddha Dashami.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X