వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వినాయక చవితి: ఎంత సమయంలోపు పూజ చేయాలి?

ఈసారి వినాయక చవితి రోజు(ఆగస్టు 25)న చవితి రాత్రి 9.20 వరకు ఉన్నది. కాబట్టి ఇంటిలో పూజ చేసుకునేవారికి మధ్యాహ్నం 12లోపు పూజించాలి.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఈసారి వినాయక చవితి రోజు(ఆగస్టు 25)న చవితి రాత్రి 9.20 వరకు ఉన్నది. కాబట్టి ఇంటిలో పూజ చేసుకునేవారికి మధ్యాహ్నం 12లోపు పూజించాలి.
విధుల్లో మంటపాన్ని పెట్టి ఆవాహన చేసేవాళ్ళు సాయంత్రం లోపు చేయాలి.

శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్న వదనం ధ్యాయేత్సర్వ విఘ్నోప శాంతయే |
మన పండుగలు మన భారతీయ సంస్కృతికి అద్దంపడుతూ! అవి ఆణిముత్యాలతో గూడిన ముత్యాలహారంలా ప్రకాశిస్తూ, మన సంస్కృతిని ప్రతిబింబింప చేస్తుఉంటాయి. అటువంటి పండుగలలో విశిష్టమైనది "వినాయకచవితి'.

astrologer tells about ganesh puja

తొలుత ఏ పని ప్రారంభించాలన్నా గణపతి పూజతో ప్రారంభిస్తాం. పిన్నలనుండి పెద్దలవరకూ ఎంతో భక్తి శ్రద్ధలతో ఎంతో వేడుకగా చేసుకునేది ఈ చవితి పండుగ. భాద్రపద శుద్ధ చవితి రోజున విశేషంగా గణపతి పుట్టిన రోజు అయిన ఈ రోజు జరుపుకుంటూ ఉంటాము.

మహేశ్వరాది దేవతా గణాలందరికీ గణపతి ప్రభువు. అంటే! హిందువుల యొక్క సకలదేవతా గణాలకు ఆయనే ప్రభువన్నమాట. బ్రహ్మ తొలుత ఈ సృష్టి కార్యాన్ని ప్రారంభించేముందు గణపతిని పూజించినట్లు ఋగ్వేదం చెబుతోంది మనకు. బ్రహ్మవైవర్తన పురాణమందు 'గణ' శబ్దానికి విజ్ఞానమని 'ణ' అంటే తేజస్సు అని చెప్పబడియున్నది. ఈ ప్రపంచం అంతా గణాలతో కూడుకుని యున్నది. అటువంటి గణాలు అన్నీకలిస్తేనే ఈ ప్రపంచం! అట్టి ప్రపంచాన్ని అహంకారానికి గుర్తు అయిన "మూషికాన్ని అధిరోహించి పాలించే ప్రభువు ఈ మహాగణపతి.
ఇట్టి గణపతిని ఆరు రూపాలుగా పూజలు జరుపుతూంటారు.
1. మహా గణపతి,
2. హరిద్రాగణపతి
8. స్వర్ణగణపతి
4. ఉచ్చిష్ట గణపతి
5. సంతాన గణపతి
6. నవనీత గణపతి అని;
అలాగే ప్రపంచం అంతటా వారివారి ప్రాంతీయతను బట్టి భిన్న రూపాలతో ఆరాధిసూ ఉంటారు. ఈ జ్యేష్ఠరాజునకు సిద్ధి, బుద్ధి అను ఇద్దరు కుమార్తెలను విశ్వరూప ప్రజాపతి గణపతికిచ్చి వివాహం చెయ్యగా! వారికి క్షేముడు, లాభుడు అనే కుమారులు కలిగినారు. అందువల్ల ఈయన ఆరాధనవల్ల క్షేమం, లాభం కలుగుతుందని ప్రతీతి.
21 రకాల ఆకులతో పూజలు చేస్తారు. వీటినే 'ఏకవింశతి' పత్రాలు అంటారు
అయితే ఆ 21 పత్రాలు ఏమిటో కొందరికి తెలియకపోవచ్చు. అలాగని ఏ ఆకుపడితే ఆ ఆకును పూజలో వినాయకునికి సమర్పించకూడదు.

వినాయకుని పూజలో వాడే 21 పత్రాలు :
1. మాచీ పత్రం/మాచ పత్రి ,
2. దూర్వా పత్రం/గరిక ,
3. అపామార్గ పత్రం/ఉత్తరేణి ,
4. బృహతీ పత్రం/ములక,
5. దత్తూర పత్రం/ఉమ్మెత్త,
6. తులసీ పత్రం/తులసి,
7. బిల్వ పత్రం/మారేడు,
8. బదరీ పత్రం/రేగు,
9. చూత పత్రం/మామిడి,
10. కరవీర పత్రం/గన్నేరు,
11. మరువక పత్రం/ ధవనం,
12. శమీ పత్రం/జమ్మి,
13. విష్ణుక్రాంత పత్రం,
14. సింధువార పత్రం/వావిలి,
15. అశ్వత్థ పత్రం/రావి,
16. దాడిమీ పత్రం/దానిమ్మ,
17. జాజి పత్రం/జాజిమల్లి,
18. అర్జున పత్రం/మద్ది ,
19.దేవదారు పత్రం ,
20. గండలీ పత్రం/లతాదూర్వా,
21. అర్క పత్రం/జిల్లేడు.
ఎన్నో ఔషధ గుణాలున్న ఈ ఆకుల్ని పట్టణాల్లో అయితే కొనుగోలు చేస్తారు. అదే పల్లెల్లో అయితే ఎక్కడైనా లభ్యమవుతాయి.

English summary
Astrologer described about Ganesh puja.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X