వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భరణి నక్షత్రంలో పుట్టినవారు ఎలా ఉంటారు?

By Pratap
|
Google Oneindia TeluguNews

నక్షత్రాల వరుసలో ఇది రెండవది. భరణి నక్షత్రం మేషరాశిలో ఉంటుంది. ఏ పాదంలోనైనా సరే భరణి నక్షత్రంలో పుట్టినవారు సత్యవాదులు, ధర్మ ప్రవర్తనులు, అలంకార ప్రియులు, కళాభిరుచి, వస్త్రాభఱణాలపై ప్రీతిగల వారవుతారు.

భోగభాగ్యాలకు, సౌకర్యాలకు లోపం ఉండదు. దీర్ఘకాలం జీవిస్తారు. పొడవైన నుదురు, ఒంపు తిరిగిన జుట్టు, ఎరుపు రేఖలు గల కన్నులు, బొడ్డు వద్ద మత్స్య రేఖలు ఉంటాయి. మంచి ఆహారం, గాఢమైన నిద్ర అనుభవించగలుగుతారు.

భరణి మొదటి పాదంలో పుట్టినవారు: సర్వలక్షణ సంపన్నులై, కీర్తిని, గౌరవాన్ని గడించగలరు. ఉన్నతస్థితికి రాగలరు. కళారంగంలో రాణిస్తారు. కుజ, రవులు కీలక గ్రహాలు.

If you are born in Bharani Nakshatra...

రెండవ పాదంలో పుట్టినవారు: పొదువు, లౌకిక జ్ఞానం, విమర్శనా దృష్టి, విచక్షణ, దురాలోచన అధికం. కుట బుధులు కీలక గ్రహాలు.

మూడవ పాదంలో పుట్టినవారు: కళానిపుణులు, అలంకార ప్రియులు, యుక్తిపరులు, శూరులు, ఉత్సాహవంతులు అవుతారు మిత్రులు ఎక్కువ. కుజ, శుక్రులు కీలక గ్రహాలు.

నాల్గవ పాదంలో పుట్టినవారు: సంతతి అధికం. కోపం, ఉద్రేకం, ద్వేషం, కాఠిన్యం అధికం. కొన్ని కష్టనష్టాలు అనుభవించక తప్పదు. శత్రువులు అధికం. కుజుడు కీలక గ్రహం.

English summary
If you are born in Bharani Nakshatra, you can fonf wht will be your feature.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X