వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఈ నక్షత్రాల్లో మీరు జన్మిస్తే: ఎలా ఉంటుందో...

By Pratap
|
Google Oneindia TeluguNews

మీరు ఈ కింది నక్షత్రాల్లో జన్మిస్తే మీ లక్షణాలు ఎలా ఉంటాయి. మీ భవిష్యత్తు ఎలా ఉంటుంది. తదితర విషయాలపై జ్యోతిష్కుడు అందించారు.

ఆరుద్ర నక్షత్రంలో జన్మిస్తే:

ఆరుద్రా నక్షత్రానికి ఆరుద్ర నక్షత్ర జాతకులకు క్రయ విక్రయ వ్యాపారాలలో నైపుణ్యం ఎక్కువ. కాల నియమాలు పాటిస్తారు. చలనచిత్ర రంగంలో కళలలో రాణిస్తారు. ఫోటోగ్రఫీ, ప్రింటింగ్‌, ప్రచురణ, రంగుల అద్దకం, ఎక్స్‌రే, భూతవైద్యం, మంత్రశాస్త్ర సాహిత్యాలు అనుకూలిస్తాయి. నమూనాలు, ప్లానులు డిజైనులు, కాపీలు, రికార్డింగ్‌ మొదలైనవి అనుకూలం. వీరికి ఆయుర్దాయం ఎక్కువ. కొంచెం గర్వం,

మొదటి పాదంలో పుట్టినవారు: ప్రసన్నమై, ముఖం, మంచి గుణాలు, సత్యశీలం, ఇంద్రియ నిగ్రహం, గొప్ప మేధాశక్తి, ధర్మవర్తన, పనులలో నైపుణ్యం ఉంటాయి.

రెండవ పాదంలో పుట్టినవారు: ఏదో ఒక అనారోగ్యం పీడిస్తుంది. అక్రమ మార్గాలలో సంపాదనకు వెనుకాడరు. నిష్ఠూరంగా మాట్లాడతారు. దంభం, అహంకారం, లోభం, కలహశీలం, పట్టుదల, కఠినవర్తన కనిపిస్తాయి. శ్రమపడుతారు.

మూడవ పాదంలో పుట్టినవారు: మాలిన్యం, క్రూరవ్యాధి, నిష్టూరంగా విమర్శఇంచే స్వభావం, కళాభిరుచి, దుష్కార్యాల ద్వారా సంపాదించే ఆసక్తి, చెడు ఆలోచనలు ఉంటాయి. స్వల్ప ధనికులౌతారు. సజ్జనులను, ఆస్తికులను పరిహరిస్తారు.

If you are born in in these nakshatras

నాల్గవ పాదంలో పుట్టినవారు: మంచి ప్రవర్తన, సద్గుణాలు, దైవభక్తి,నీతి, నియమాలు, ధర్మచింతన, మేధాశక్తి, శాస్త్రవిజ్ఞానం, కళానైపుణ్యం ఉంటాయి.

పునర్వసు నక్షత్రంలో జన్మిస్తే:

మంచి తారలతో కృష్ణవర్ణంలో కనిపించే పునర్వసు దేవగుణాకి, మార్జాలయోనికి, పురుషలింగానికి చెందినది. పక్షి హింస, వేణువృక్షం, పార్శ్వముఖం, ఓంకార స్వరం, చరనక్షత్రం, ఆదినాది, ఉదరరజ్జు, కామధేనువు ఈ నక్షత్రంలో జన్మించినది. ఈ విషయంలో జాతక పరిశీలన అవసరం. అనేక శుభకార్యాలకు ఈ నక్షత్రదినం శుభప్రదం. పునర్వసు నక్షత్రంలో ఏ పాదంలో పుట్టినవారైనా మంచి తెలివితేటలు, ధర్మబుద్ధి, ఔదార్యం, దైవభక్తి, శాస్త్ర విజ్ఞానం, న్యాయదృష్టి, సుగుణ సంపద, పరోపకారగుణం కలిగి అభివృద్ధికి వస్తారు. భోజన ప్రియులు, హాస్య సంభాషణా చతురులు అవుతారు. యుక్తిగా వర్తిస్తారు. వీరు మంచితనంతో జనాన్ని ఆకర్షించగలరు. ఒక్కొక్క పాదానికి ఒక్కో విశేషం ఉంది.

మొదటి పాదంలో పుట్టినవారు: దేవ బ్రాహ్మణ భక్తి అధికం. కనులలో ఎరుపు రేఖలుంటాయి. రోషం, అభిమానం, దర్పం కన్పిస్తాయి. ధర్యంగా వ్యవహరించగలరు. వితండవాదం చేస్తారు.

రెండవ పాదంలో పుట్టినవారు: వస్త్రాలంకారాలపై ఆకాంక్ష, కళాభిరుచి, క్షీరభోజన లాలస, పనులలో నైపుణ్యం, డాంబికం, మంచి ఊహాశక్తి ఉంటాయి ధనికులవుతారు.

మూడవ పాదంలో పుట్టినవారు: విద్య, వేవేకం, శాస్త్ర విజ్ఞానం, కవిత్వం, కళా నైపుణ్యం, వాక్‌ చాతుర్యం అలవడుతాయి. దీర్ఘకాలం జీవిస్తారు. సత్యవాక్కు సాధు ప్రవర్తన, విషయ లోలత, కార్యనిర్వహణ సమర్థత ఉంటాయి.

నాలుగవ పాదంలో పుట్టినవారు: ఇతరుల పనులు సమర్థతతో చేయించగలరు. మంచి రూపం, వర్చస్సు, శాంత స్వభావం, కరుణ, అభిమానం, ఉపకారం, జనాకర్షణ వుంటాయి. స్త్రీలకు వీరిపై అభిమానం ఎక్కువ. రాజకీయాలలో, వ్యాపారంలో, జన సంబంధాలలో రాణించగలరు. పేరు, ధనం గడించగలరు.

పుష్యమి నక్షత్రంలో జన్మిస్తే:

మొదటి పాదంలో పుట్టినవారు: రవి భూపాంశ, ఒంటరితనం, తొందరగా పనులు నిర్వహించే సమర్థత, శూలవ్యాధి, మొరటుతనం, అందం, దీర్ఘబాహువులు ఉంటాయి.

రెండవ పుట్టినవారు: బుధ సౌమ్యాంశ, స్నేహశీలి, స్త్రీ వ్యసనం, ధనాపేక్ష ఉంటాయి. ఇతరులకు మార్గదర్శకులు, ప్రమాణికులుగా గౌరవ మన్ననలు పొందుతారు.

మూడవ పాదంలో పుట్టినవారు: శుక్ర క్రూరాంశ, ప్రసన్న హృదయం, దయ, సూక్ష్మబుద్ధి, జ్ఞానం ఇంద్రియ నిగ్రహం, శాంతం, ఉత్తమ గుణాలు, మంత్రశాస్త్ర పరిజ్ఞానం ఉంటాయి.

నాలుగవ పాదంలో పుట్టినవారు: కుజ నీచాంశ, క్షణికోద్రేకం, కలహశీలం, దురాలోచన, అన్య సంపర్కం, పరద్రవ్యాపహరణ బుద్ధి వుంటాయి.

ఏ పాదంలోనైనా సరే పుష్యమి నక్షత్రంలో పుట్టినవారికి కాముకత్వం, శరీరపుష్టి, శాస్త్ర విజ్ఞానం, ధైర్యం, శుభ్రత, వివేకం, ఆత్మాభిమానం, సూక్ష్మగ్రహణ శక్తి, జ్యోతిషాసక్తి, శ్రీఘ్రకోపం, ఉపకార గుణం, దిర్ఘాయువు వుంటాయి. ఏకాంతంగా ఉండాలనుకుంటారు. మధుర పదార్థాలు ఇష్టం.

English summary
If you are born in these Nakshatras, your feaures and future will be like above said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X