వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శ్రావణకృష్ణ అమావాస్య ప్రత్యేకతలు: పురాణాలు ఏం చెబుతున్నాయి?

గ్రంథాంతరాల్లో దీనికి ఆలోకామావాస్య అనే పేరు వాడబడి ఉంది. ఉత్కలదేశంలో దీనిని సప్తపూరికామావాస్య అంటారు.

|
Google Oneindia TeluguNews

శ్రావణకృష్ణ అమావాస్యను తెలుగుదేశంలో పోలామావాస్య అని వ్యవహరిస్తారు. గోదావరి ప్రజల నోట ఇది పోలాల మావాస్య, పోలాలమావాస్యకు గోదావరి పొర్లి పొర్లి వస్తుందని నానుడి.

భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో దీనికి వివిధనామాలు వ్యవహారంలో ఉన్నాయి. మహారాష్ట్రంలో దీనిని పిరోరి అమావాస్య అంటారు. ఆమాదేర్ జ్యోతిషి అనే గ్రంథం దీనిని కౌశ్యమావాస్యా అని పేర్కొంటూ ఉంది. గ్రంథాంతరాల్లో దీనికి ఆలోకామావాస్య అనే పేరు వాడబడి ఉంది. ఉత్కలదేశంలో దీనిని సప్తపూరికామావాస్య అంటారు.

పోలామావాస్య నాటి వివరణలో మన పంచాంగ కర్తలు పోలాంబాప్రతమని వ్రాస్తారు. పోలాంబ ప్రజల వాడుకలో పోలెమ్మ లేక పోలేరమ్మగా ఐంది. పోలి పేరుతో మరి ఒక అమావాస్య పర్వం కూడా తెనుగు నాట అమల్లో ఉంది. అది కార్తిక బహుళ అమావాస్య అది పోలిస్వర్గానికి వెళ్లిన అమావాస్య దానికిని దీనికిని ఏమి సంబంధం లేదు.

Importance of Shravana krishna Amavasya

పోలామావాస్యకు తెలుగుదేశంలో పోలాంబ అనే దేవత పూజలు అందుతుంది. కాని పోలామావాస్య అనేదాని అర్థం వేరు విధమైనదిగా కనిపిస్తూ ఉంది. పోలమావాస్యను సంగ్రహించి 'పోలామా? అని కూడా అంటారు. పోల అనగా కడుపునిండా మేతమేసి నీరుతాగి పనిపాటు లేకుండిన ఎద్దు అని అర్థము. 'అమా' అనగా (అమావాస్య) అని అర్థం. 'పోలామా' అనగా ఎద్దులను బాగా మేపే అమావాస్య అని ళ్లు దీనిని పట్టి ఇది గోపూజకు ఉద్దిష్టమైనదినంగా స్పష్టపడుతుంది.

ఈ సందర్భంలో చెప్పబడే పౌరాణికగాధ వినతగి ఉంటుంది.

అంధకాసురుడు బ్రహ్మను గురించి తపస్సు చేసి అనేక వరాలు పొందాడు. వరగర్వం చేత అతడు ఒకసారి పార్వతినే కామించాడు. శివుడు భూలోకానికి వెళ్లినవేళ కనిపెట్టి అంధకాసురుడు పార్వతి వద్దకు వెళ్లి తన దుష్టచింతను తెలిపాడు. అది చూచి వాకిట కావలికాచు నంది ఆ అసురుడితో యుద్దానికి తలపడ్డాడు. ఇంతలో శివుడు వచ్చి అంధకాసురిని హతమార్చాడు.

ఈ సందర్భంలో నంది తనకు చేసిన సాయానికి మెచ్చి శివుడు అతనిని ఏదైనా వరం కోరుకోమన్నాడు.
అప్పడు నంది ఇట్లా కోరాడు. 'శిలాదుడు పొలము కెక్కిరిస్తూ ఉండగా ఆదివృషభరూపమున అతనికి నేను దొరికిన రోజు శ్రావణ బహుళ అమావాస్య కాగా ఆనాడు వృషభపూజ చేస్తే ఫలప్రదమయ్యేట్ల అనుగ్రహింపవలసింది. శివుడు అట్లే అగుకాక అన్నాడు.

అప్పటి నుంచి శ్రావణ బహుళ అమావాస్యనాడు గో, వృషభపూజ వాడుక అయ్యెను కాని ఈ పూజ ఆంధ్రదేశాన ఈనాడు అమలులో లేదు. మాళవదేశంలో మాత్రం ఇప్పటికీ నామమాత్రంగానే అగుగాక ఆచరణలో ఉంది.

తెలుగునాట

ఆంధ్రప్రదేశ్లో పోలాంబవ్రతాచరణ విధానం మహారాష్ట్రం లోని వ్రతాచరణ విధానానికి సజాతీయమైందిగా ఉంది. ఇక్కడ పోలాంబ వ్రతంలో పూజ లందే పోలేరమ్మ సంతానం లేని వారికి సంతానం ఇచ్చే సంతానం కలవారికి కడుపు చలవ ఇచ్చే దేవతగా ఉంది.

అయితే ఆనాటి పూజలో ఆంధ్రులు పోలాంబ విగ్రహాన్ని దేనిని కాని పెట్టరు. పోలాంబ స్థానంలో పిలకలతో నిండారి వున్న కందగొడుగును ఉంచుతారు. దీనిని పోలకమ్మ అంటారు. పోలకమ్మకు పసుపు కుంకుమలు పెడతారు. పసుపు కొమ్ము కట్టిన తోరమును ఒకదానిని పోలకమ్మకు కడతారు.

అట్టి తోరమును పిల్లల మెడలలో కూడ కడతారు. ఆ పోలకమ్మ తోరాన్ని ఈ విధంగా కట్టడం వల్ల పిల్లలకు అకాల మృత్యుభయం ఉండదని శాస్త్రవచనం. పోలకము తోరానికి పోలేరమ్మ పుస్తి అనే నామం ఏర్పడి ఉంది.

పోలాల అమావాస్యకు ఇక్కడ పూజలందే కందగొడుగు వరణీయత తెలుసుకోవలసి ఉంటుంది. పెళ్లి కూతుళ్ల వడికట్టులో కందదుంప ఉంచుతారు. సమర్త బంతికి కందబచ్చలి తప్పనిసరిగా వండుతారు. నీ కడుపు కంద పెరడు కాను' అనే నానుడి ఉంది. 'కందగౌరినోము' మున్నగునవి కూడా కందవరణీయత తెలియజెప్పడానికి పుట్టినవే.

English summary
Amavasya Tithi during holy month Sawan or Sharvana is observed as Hariyali Amavasya and considered highly auspicious.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X