వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మహాలయ పక్షము శ్రాద్ధ విధానం

By Pratap
|
Google Oneindia TeluguNews

పితృపక్షమని కూడా అంటారు. భాద్రపద పూర్ణిమతో ఆరంభమై ఆ మాసపు అమావాస్యతో ముగుస్తుంది.ఆ అమావాస్యను మహాలయ అమావాస్య అంటారు.ఇక తండ్రికి చేసే శ్రాద్ధ కర్మను గురించిన వివరాలు తెలుసుకుందాము.

భూమి మీద ధావళీ పరుచుకుంటాడు. దాని మీద దాక్షిణ ముఖంగా కూర్చుంటాడు. పట్టుగుడ్డ పోచ ఉత్తరీయంగా వేసుకుంటాడు. అది ఒక అంగుళం వెడల్పూ, యజ్ఞోపవీతమంత పొడుగూ ఉంటుంది. యజమానికి దగ్గరగా పురోహితుడు కూర్చుంటాడు. పురోహితుడు యజమానికి దర్భ ఇస్తాడు. దానిని యజమాని తన వెంట్రుకకు మడివేసుకుంటాడు.

కూర్చుండే ధావళీ మీద ఒక దర్భను ఉంచుకుంటాడు. దర్భతో చేసిన ఉంగరం తన అనామికకు పెట్టుకుంటాడు. దర్భలో చేసిన అట్టి వుంగరమే యజ్ఞోపవీతానికి ఒకటి కట్టు కుంటాడు. తరువాత పురోహితుడు శ్రాద్ధకర్మ ప్రారంభిస్తాడు. యజమానికి ఎదురుగా అయిదు అరిటి ఆకులు పరుస్తాడు. రాగి డబ్బు, దర్భ పుల్ల, ఇతర వస్తువులు వుంచుతాడు.

Mahalaya Paksham Sradha Vidhanam

ఐదు విస్తళ్ళనూ ఆఘ్రాణించడానికి ఐదు గురు పితృదేవుళ్ళు వస్తారు. మొదట వచ్చేవాడు యజమాని తండ్రి, అతని తాత, ముత్తాతలు, తల్లి పూర్వీకులకు ఒక ఆకు ఇట్లే ఇతర ఆకులు.

మరి మూడు విస్తళ్లు కూడా వేస్తారు. అందులో ఒకటి విష్ణుపాదమనేది విష్ణువు కొరకు. మిగతా రెండూ విశ్వదేవుల కొరకు. ఆనాటి వంటకాల్లో 'ఖిర్‌పూరీ' అనేది ముఖ్యమైనది.

English summary
Astrologer explains about the the Mahalaya Paksham Sradha Vidhanam
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X