వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వివాదం: ఉగాది ఎప్పుడు, ఎందుకు?

తెలుగు సంవత్సరాది ఉగాది ఎప్పుడనే వివాదం చెలరేగుతోంది. ఒక్కొక్కరు ఒక్కో రకంగా చెబుతున్నారు. ఈ నెల 28వ తేదీన ఉగాది పర్వదినం జరుపుకోవాలా, 29వ తేదీన చేసుకోవాలా అనే విషయంపై వివాదం కొనసాగుతోంది.

By Pratap
|
Google Oneindia TeluguNews

తెలుగు సంవత్సరాది ఉగాది ఎప్పుడనే వివాదం చెలరేగుతోంది. ఒక్కొక్కరు ఒక్కో రకంగా చెబుతున్నారు. ఈ నెల 28వ తేదీన ఉగాది పర్వదినం జరుపుకోవాలా, 29వ తేదీన చేసుకోవాలా అనే విషయంపై వివాదం కొనసాగుతోంది. దీనిపై తికమక పడాల్సిన పనేమీ లేదు. ఆ విషయం స్పష్టంగానే ఉంది.

ఇది హేమలంబ నామ సంవత్సరము. వాడుకలో హేమలంబ, హేవిళంబ, హేమలంబి, హేవిలంబి, హేవిళంబి అనే రూపాలు ప్రచారంలో ఉన్నాయి. హేమాద్రి, వీరమిత్రోదయం, నిర్ణయసింధు, ధర్మసింధువులలో సంవత్సర నామములను తెలుపు శ్లోకములలో హేమలంబ అనియే ఉన్నది.

అలాగే విశ్వేశ్వర ప్రతిష్ట జరిగినది హేమలంబ నామ సంవత్సరమున అని వర్నే చ హేమలంబాఖ్యే (నిర్ణయసింధు పుట 158, ధర్మసింధు పుట 31, వ్రతనిర్ణయ కల్పవల్లి పుట 209) ఉన్నది. ఇచట కూడా హేమలంబ అని అకారాంతముగనే ఉన్నది. కాలనిర్ణయచ్యన్షికలో మాత్రము హేమలంబీ అని యున్నది. కాగా మూల భూత ప్రమాణ గ్రంథములలో బహుగ్రంథ సమ్మతమూ మరియు మా పూర్వులు అనుసరించినదీ కూడా అగుటచే హేమలంబ అనియే ఇచట స్వీకరింపబడుచున్నది.

No controversy on Ugadi festival date

సంవత్సరాది నిర్ణయము

"చైత్ర శుక్ల ప్రతిపత్ - సూర్యోదయ వ్యాపినీ గ్రాహ్యా' చాంద్ర సంవత్సరాదిని ఉదయకాలీన చైత్రశుద్ధ ప్రతిపత్తుని బట్టి నిర్ణయించాలని సామాన్య నియమము. ఒకప్పుడు ఆ ప్రతిపత్తు అమావాస్య నాడు ఏష్యమై - ఏనాడూ ఉదయ స్పర్శిని కాకపోవచ్చు. అట్లగుచో - ఆ అమావాస్య నాడే చాంద్రసంవత్సరాది యని - " ఉదయ ద్వితయే పూర్వా - నోదయ యగులేలి_పి పూర్వైవ ", "దినద్వయే తద్వ్యాప్తా - అవ్యాప్తా వా - పూర్వైవ "ఇత్యాదిగా పైన పేర్కొన్న ప్రమాణ గ్రంథములన్నిట ఏకరీతిగ నిర్ణయింపబడి ఉన్నది.

ప్రస్తుతము 28-03-2017 మంగళవారము నాడు ఫాల్లన అమావాస్య తదుపరి చైత్రశుద్ధ పాడ్యమి ఏష్యమైనది గనుక ఈనాడే నిస్సందేహముగ హేమలంబ నామ చాంద్రమాన సంవత్సరాది యగును. ఈ పరిస్థితి తెలంగాణా, ఆంధ్రప్రదేశము వంటి పరిసరములందే గాక -- దక్షిణ భారతదేశము మొత్తము ఇంతే.

అయితే ఏ రోజున అయినను, సూర్యోదయము అన్ని ప్రాంతము లందు ఒకే సమయమున జరుగదు. అది ఒక ప్రాంతమున ఎప్పుడు అగునో - అదేరోజున ఆ ప్రాంతానికి తూర్పున ఒకింత ముందుగనే జరుగును. (దీనికి ప్రత్యక్ష పరిశీలనమే ఉత్తమము. అక్షాంశ - రేఖాంశాలను బట్టి కూడ లెక్కించవచ్చును).

ఉత్తరభారతమున కూడ పూరి, భువనేశ్వర్, కటక్, పాట్నా - ఇంకా ఉత్తరాన నేపాల్లోని ఖాట్మాండు ప్రాంతాలు. వాటికి పశ్చిమ ప్రాంతాలలో కూడా పరిస్థితి ఇంతే (మార్చి 28 నాడే చాంద్ర సంవత్సరాది). వాటికి తూర్పు ప్రాంతాలలో (బెంగాలు, అస్సాం ...) మాత్రం మార్చి 29 నాడు సంవత్సరాది అగును. కానీ, ఉత్తర భారతమున చాంద్రమానము గాక బార్హస్పత్యమానమును అనుసరించవలెను గనుక అచట 29-03-2017 బుధవారము నాడు సాధారణ నామ సంవత్సరాది యగును.

గమనిక

ఇపుడు మన చేతిలోనిది ప్రత్యక్ష పరిశీలనకు నిలబడే దృక్పద్ధతిలో చేయబడిన పంచాంగము, దీనిలోని తిథ్యాదుల వ్యాప్తికి - (పూర్వపద్ధతి యుని ముద్రపడిన) పూర్వకాలీన గణకానందాదులతో చేయబడిన పంచాంగములలోని తిథ్యాదుల వ్యాప్తికి తేడా ఉంటుంది. ఈ రెండవ రకము వాటితో సంవత్సరాది (అట్లే తదితర పర్వదిన కాల) నిర్ణయము మరొక విధము కావచ్చును. రెండు పద్ధతులలో దృక్పద్దతియే శాస్త్రీయమని, న్యాయమని మన పంచాంగములలో చాలా మారులు సవివరముగ చెప్పుకొనియే ఉన్నాము.28-03-2017 రోజున ఉగాదిగా పెద్దలు నిర్ణయించారు.

English summary
Astrologer says, there is no controversy on Telugu new year day of Ugadi. It is clear the when the festival comes.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X