వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శని వివిధ రాశులలో ఉన్నప్పుడు ఇచ్చు ఫలితములు

ద్వాదశ స్థానంలో శని ఉండుట వలన : శని ద్వాదశ సంచారంతో ఏలినాటి శని ప్రారంభమవుతుంది. ఇది దీర్ఘకాల వ్యతిరేక ఫలితాలకు ఆరంభము, గౌరవ భంగము, కృషి నాశనము.

|
Google Oneindia TeluguNews

ద్వాదశ స్థానంలో శని ఉండుట వలన : శని ద్వాదశ సంచారంతో ఏలినాటి శని ప్రారంభమవుతుంది. ఇది దీర్ఘకాల వ్యతిరేక ఫలితాలకు ఆరంభము, గౌరవ భంగము, కృషి నాశనము, మనఃక్లేశము, గృహచ్ఛిద్రములు, నష్టము, దుఃఖము, దారిద్య్రము, భోజన సౌఖ్య భంగము, హేయమైన జీవనము, బంధుపీడ, శత్రు వృద్ధి, సంతాన అనారోగ్యం, కళత్ర విరోధము, వివాదములు వంటి దోష ఫలితాలు కలుగును. వాడుకున్న వస్త్రాల్లో చినిగిపోని వస్త్రాలు, నల్లని వస్త్రాలు, నూనె, నువ్వులుండలు. రోగులకు మందులు, ఆహారం ఇవ్వడం, సిమెంట్‌, నేరేడుపండ్లు, దానంచేయడం మంచిది. రుద్రాభిశేకం వేంకటేశ్వరారాధన శనివారంవ్రతం పూజలు ఆలయ దర్శనాలు శుభకరం.

ఏకాదశ స్థానంలో శని ఉండుట వలన : మిక్కిలి అనుకూల స్థానము, పుత్ర ప్రాప్తి, కళత్ర సౌఖ్యము, ధన లాభము, ఇష్టార్థ సిద్ధి, దేహారోగ్యము, గౌరవము, అధికార వృద్ధి, కుటుంబ సౌఖ్యము, నిర్మలమైన మనస్సు, అనేక విధాలైన లాభములు కాలుగును.

దశమ స్థానంలో శని ఉండుట వలన : దశమ స్థాన శని సంచారము దోష ఫలదము, పాప కార్యాచరణ, వృత్తి నష్టము, కర్మ భ్రష్టత, పరితాపము, దుఃఖము, మానభంగము, విఘ్నములు, వ్యాకులత, ఆదాయ నష్టం, కీర్తి భంగము, ఉద్యోగమందు బాధలు వంటి కష్టనష్టములు కలుగును.

నవమ స్థితి: భాగ్య స్థానమందు శని సంచారము వ్యతిరేక ఫలితములు కల్పించును. దుఃఖము, శత్రుబాధ, భార్యాబిడ్డలకు కష్టములు, వృధా ప్రయాణములు, వ్యాధి, దారిద్య్రత, పితృ వర్గమునకు అరిష్టము, కొన్ని సందర్భాలలో అల్ప సుఖము, ధర్మ విజ్ఞత వంటి స్వల్ప అనుకూల ఫలదము కలుగును. వాడుకున్న వస్త్రాల్లో చినిగిపోని వస్త్రాలు, నల్లని వస్త్రాలు, నూనె, నువ్వులుండలు. రోగులకు మందులు, ఆహారం ఇవ్వడం, సిమెంట్‌, నేరేడుపండ్లు, దానంచేయడం మంచిది. రుద్రాభిశేకం వేంకటేశ్వరారాధన శనివారంవ్రతం పూజలు ఆలయ దర్శనాలు శుభకరం.


అష్టమ స్థానంలో శని ఉండుట వలన : అష్టమ శని తీవ్ర దోషఫలదాత, అపమృత్యు భయము, రోగబాధ, ధనవ్యయము, అతురత, బంధుక్లేశము, వ్యవహార చిక్కులు, కార్యనాశనము పశునాశనము, కుటుంబమునకు దూరమగుట, మిత్ర విరోధము, సంతాన సౌఖ్యలోపము మరెన్నొ కష్టనష్టములు కలుగును. వాడుకున్న వస్త్రాల్లో చిరిగిపోని వస్త్రాలు, నల్లని వస్త్రాలు, నూనె, నువ్వులుండలు. రోగులకు మందులు, ఆహారం ఇవ్వడం, సిమెంట్‌, నేరేడుపండ్లు, దానంచేయడం మంచిది. రుద్రాభిశేకం వేంకటేశ్వరారాధన శనివారంవ్రతం పూజలు ఆలయ దర్శనాలు శుభకరం.

సప్తమ స్థానంలో శని ఉండుట వలన : ఏడవ రాశియందు శని సంచరించు స్థానమున రోగమును, దేశాంతర ప్రయాణమును, హృదయ మునకు కష్టము, గొప్పభీతిని, ద్రవ్యనాశనమును, హృదయ తాపమును, అలసట, భార్యాబిడ్డలకు అనారోగ్యము, వేదన కల్పించును.

షష్ఠ స్థితి: శని ఆరవరాశి యందు సంచరించు కాలమున ధనధాన్య అభివృద్ధి, బంధు మూలక సంతోషము, స్త్రీ సౌఖ్యము, ఇల్లు కట్టుట, కుటుంబ సౌఖ్యము, ఆరోగ్యము, శత్రుక్షయము, సర్వతో ముఖాభివృద్ధి కలుగును.

Results of Sani Rasai.

పంచమ స్థానంలో శని ఉండుట వలన : శని పంచమ రాశి యందు చలించు సమయమున కార్యములు చెడుట జరుగుతుంది, మనస్తాపము కలుగును, దాయాదులతో వ్యాజ్యములు (న్యాయసంబంధ చర్చలు,గొడవలు జరుగుతాయి), హీన జాతి స్త్రీతో సంభోగించి దాని వలన పరితపించుట, సంతాన నష్టము కలుగుతుంది, వ్యవహారములలో భంగములు ఏర్పడతాయి, వ్యాజ్యములు (కోర్టు లావాదేవీలు), చిత్తభ్రమ కలుగుతుంది, సంసారమునకు దూరమగుట వంటి ప్రతికూల ఫలితములు కలుగును. వాడుకున్న వస్త్రాల్లో చినిగిపోని వస్త్రాలు, నల్లని వస్త్రాలు, నూనె, నువ్వులుండలు. రోగులకు మందులు, ఆహారం ఇవ్వడం, సిమెంట్‌, నేరేడుపండ్లు, దానంచేయడం మంచిది. రుద్రాభిశేకం వేంకటేశ్వరారాధన శనివారంవ్రతం పూజలు ఆలయ దర్శనాలు శుభకరం.

చతుర్థ స్థానంలో శని ఉండుట వలన : అర్ధాష్టమ శనిగా దోష ఫలదుడు. అనారోగ్యము కలుగుతుంది, మిత్రులను కోల్పోతారు, ధన నష్టము, భీతి కలుగుతుంది, మనఃక్లేశము ఏర్పడుతుంది, ఉన్నచోటు నుండి బ్రంశము ఏర్పడుతుంది, కళత్ర బంధు నష్టము, వాత వ్యాధులు కలుగుతాయి, బాధలు కలుగుతాయి, వృధా ప్రయాణములు చేస్తారు, శారీరక పుష్టితగ్గుతంది, మరెన్నో వ్యతిరేక ఫలితాలు కలుగును.

తృతీయ స్థానంలో శని ఉండుట వలన : శనికి ఇది అనుకూల సంథానము. స్త్రీ సంభోగము పొందుతారు, మనసులో సుఖభావన పొందుతారు, స్వంతబుద్ధిచే ప్రయత్నించిన కార్యములు సిద్ధించును, స్వంతచోట్ల గమనము, ఆరోగ్యము పొందుతారు, బుద్ధి బలము పెరుగుతుంది, ధన లాభము కలుగుతుంది, విజయమువంటి అనేక శుభ ఫలములు కలుగును.

ద్వితీయ స్థానంలో శని ఉండుట వలన : ఏలినాటి శని సంచారమందు ఇది మూడవ రాశి చలన కాలం. శని రెండవ రాశి యందు చలించునపుడు కార్యములు నశించుట జరుగుతుంది, తలత్రిప్పుట, తన మనుష్యులతో విరోధము ఏర్పడుతుంది, పాపచింతనము చేస్తారు, కలుగుతాయి కష్టములు, ఆర్థిక నష్టములు కలుగుతాయి, కుటుంబ సభ్యులకు అపకారము జరుగుతుంది, ఇతరులతో ద్వేషము కలుగును. వాడుకున్న వస్త్రాల్లో చిరిగి0నిగిపోని వస్త్రాలు, నల్లని వస్త్రాలు, నూనె, నువ్వులుండలు. రోగులకు మందులు, ఆహారం ఇవ్వడం, సిమెంట్‌, నేరేడుపండ్లు, దానంచేయడం మంచిది. రుద్రాభిశేకం వేంకటేశ్వరారాధన శనివారంవ్రతం పూజలు ఆలయ దర్శనాలు శుభకరం.

చంద్ర స్థితి రాశి: ఏలినాటి శనిలో ఇది రెండవ రాశి చలన కాలము. జన్మరాశిలో శనిగ్రహ చలనం తీవ్రదోష ఫలితాలనిస్తుంది. శరీరంలో తేజస్సు తగ్గటం, భయం, రోగంకలుగుతాయి, దుఃఖము పొందుతారు, బంధువులకు దూరమౌతారు, బంధువులతో శత్రుత్వము ఏర్పడతాయి, శ్రమకరమైన ప్రయాణాలు చేస్తారు, చేసేపనులలో అవరోధాలు ఏర్పడతాయి, తప్పుడు పనులుచేస్తారు, బుద్ధి చపలంగా మారుతుంది, రోగము వలన బాధ కలుగుతుంది, హృదయము నందు వ్యాధి వంటి వ్యతిరేక ఫలములు కలుగును. వాడుకున్న వస్త్రాల్లో చినిగిపోని వస్త్రాలు, నల్లని వస్త్రాలు, నూనె, నువ్వులుండలు. రోగులకు మందులు, ఆహారం ఇవ్వడం, సిమెంట్‌, నేరేడుపండ్లు, దానంచేయడం మంచిది. రుద్రాభిశేకం వేంకటేశ్వరారాధన శనివారంవ్రతం పూజలు ఆలయ దర్శనాలు శుభకరం.

English summary
Results of Sani Rasai.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X