వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మహాలయ అమావాస్య అంటే ఏమిటి?

By Pratap
|
Google Oneindia TeluguNews

పితృపక్షమని కూడా అంటారు. భాద్రపద పూర్ణిమతో ఆరంభమై ఆ మాసపు అమావాస్యతో ముగుస్తుంది.
ఆ అమావాస్యను మహాలయ అమావాస్య అంటారు.

పితృదేవతల పూజకు ఉద్దిష్టమైనది. సాధారణ శ్రాద్ధదినము వ్యక్తులకు సంబంధించింది. మహాలయ పక్షము సాముదాయకంగా పితుళ్ళను పూజించడానికి ఏర్పడింది. రోమను జాతీయుల్లో ఫిబ్రవరి 19వ తేదీ పితృదేవతల పూజకు నిర్దిష్టమై వుండేది. ఆనాడు వారు రోమునగరం దగ్గర గల కొండలలో ఒక కొండమీద పెద్ద గొయ్య తవ్వేవారు. పితాళ్ళు భూమి క్రింద వుంటారని వారి నమ్మిక.

కావుననే గోతుల్లో బలి అన్నం వుంచే ఆచారం వారు అవలంబించారు. వివాహాలు కాని, వ్యాపారం కాని చేయడానికి అది అశుభదినమని వారి నమ్మిక.

The importance of Mahalaya Amavasya

మనలో కూడా ఈ దినాల్లో శుభ శోభనాలు జరపరు. మన శాస్త్రాల్లో ఒక్క ఏడాదిలో చేయవలసినవి తొంభై ఆరు శ్రాద్ధాలని చెప్పబడింది. ఆ తొంభైఆరు శ్రాద్ధాల్తోను ఈ పితృపక్షం ముఖ్యం. శ్రాద్ధదినం నాడు కర్మ చేసేవాడు శ్రాద్ధం పూర్తి అయ్యే వరకు ఉపవసిస్తాడు.

తండ్రి బ్రతికి వుండగా తల్లిని కోలుపోయిన వాడు భాద్రపద కృష్ణ పక్ష నవమినాడు తల్లి శ్రాద్ధ కర్మ చేస్తాడు. ఇది చేయడానికి సుమారు ఒక గంట కాలం పుచ్చుకుంటుంది. ఆ సందర్భంలో మూడు పిండాలు దానం చేయబడతాయి. ఒకటి చనిపోయిన తల్లికి, రెండోది కర్మ చేసేవాని పితామహికి, ఒకవేళ ఆమె సజీవురాలై వుంటే రెండోది ప్రపితామహికి, మూడోది ప్రపితామహి తల్లికి.

English summary
Astrologer explained about the importance of Mahalaya Amavasya and told what to dont and what not to be.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X