వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైకుంఠ (ముక్కోటి) ఏకాదశి ప్రాధాన్యం

వైకుంఠ ఏకాదశిని తెలుగువారు ఎక్కువగా ముక్కోటి ఏకాదశి అని వ్యవహరిస్తారు. ఈ పండుగ విషయంలో చెప్పతగిన ప్రత్యేకత ఒకటి ఉన్నది. కాలపరిగణనంలో తెలుగువారిది చాంద్రమానం. వైకుంఠ ఏకాదశి సౌరమానప్రకారం జరిపే పండుగ.

By Pratap
|
Google Oneindia TeluguNews

వైకుంఠ ఏకాదశిని తెలుగువారు ఎక్కువగా ముక్కోటి ఏకాదశి అని వ్యవహరిస్తారు. ఈ పండుగ విషయంలో చెప్పతగిన ప్రత్యేకత ఒకటి ఉన్నది. కాలపరిగణనంలో తెలుగువారిది చాంద్రమానం. వైకుంఠ ఏకాదశి సౌరమానప్రకారం జరిపే పండుగ. కర్కాటక సంక్రమణం,

ఇది కూడ సౌరమానాన్ననుసరించి తెలుగువారు జరిపే పండుగలలో ఒకటి.

ధనస్సు నెల పట్టిన తరువాత శుద్ధంలో వచ్చే ఏకాదశి వైకుంఠ ఏకాదశి. ఇది మార్గశిరంలో కాని, పుష్యంలో గాని వస్తుంది. వైష్ణవులకు, మాధ్వమతస్తులకు చాలా ముఖ్యమైనది. అయినప్పటికి దీనిని హిందువులలో అన్ని కులాలవారు విరివిగా పాటిస్తారు. ఈ సందర్భమున జిజ్ఞాసువు అనువారు అక్షయమాఘమాస భారతిలోరాస్తున్నారు. "ఈ ముక్కోటి ప్రాయికముగ మద్రాసు ప్రెసిడెన్సీలో మాత్రమే ప్రచుర్యముగ నున్నది. ఉత్తర రాజ్యములలో దీని ప్రచారమే లేదు. పంచాగకర్తలు ఈనాటి వివరణలో వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి, శ్రీరంగద్వారస్థ భగవదాలోకన మహోత్సవము" అని వ్రాస్తారు.
ఈ ఏకాదశినామ విషయం కొంత వివరణ అవసరమై ఉంది.

ఒకటిస్వర్గ ద్వారం : రెండు ముక్కోటి: మూడు వైకుంఠ. ఇందులో మొదటిది అయిన స్వర్గ ద్వార నామవిషయం.
ఈనాడు వైకుంఠ ద్వారాలు తెరుస్తారనీ, దక్షిణాయనంలో చనిపోయిన పుణ్యాత్ములు అందరూ అప్పడు స్వర్గంలో ప్రవేశిస్తారని నానుడి. ఈ కారణం చేత ఈ పండుగకు దక్షిణాదిని కొన్ని ప్రాంతాలలో స్వర్గద్వారం అనే నామం కూడా కానవస్తూ ఉంది.

ముక్కోటి యనగా మూడుకోట్ల మూడుకోట్ల దేవతలా దినమున శ్రీరంగమో లేక లేదా దివ్యక్షేత్రమున జేరుదురను ప్రతీతి ఉంది.

విష్ణువు వైకుంఠానుండి మూడు కోట్ల దేవతలతో ఈనాడు భూలోకానికి దిగి వచ్చాడు కాబట్టి దీనికి ముక్కోటి ఏకాదశి అనేపేరు వచ్చిందని సాధారణంగా చెబుతారు. శ్రీ జగదీశ్వర అయ్యరు మాత్రం ఈ ఒక్క ఏకాదశి మూడుకోట్ల ఏకాదశులతో సమమైన పవిత్రత కలది కావడం చేత దీనికీ పేరు వచ్చిందని చెబుతున్నారు.

The importance of Vaikuntha Ekadasi

ఈ పేరు రావడానికి కారణాన్ని శ్రీ జగదీశ్వర అయ్యరు ఇలా చెబుతున్నారు.

"కృత యుగంలో చంద్రావతి అనే నగరం రాజధానిగా చేసుకొని "ముర" అనే అసురుడు రాజ్యపాలనం చేస్తూ ఉండేవాడు. వాడు దేవతల్ని గారిస్తూ వచ్చాడు. అప్పడు దేవతలు వెళ్లి వైకుంఠంలో విష్ణుమూర్తితో మొరపెట్టుకున్నారు. దేవతల దీనాలాపాలు విని అప్పడు విష్ణువు వైకుంఠాన్నుంచి భూమి మీదకు దిగి వచ్చి మురాసురుణ్ణి సంహరిస్తాడు. ఆ సంహారం ఈ ఏకాదశినాడు జరిగింది. విష్ణువు వైకుంఠాన్నుంచి దిగి భూమి మిూదకు వచ్చి శత్రుసంహారం చేసిన రోజు కాబట్టి దీనికి వైకుంఠ ఏకాదశి అనే పేరు వచ్చింది."

స్వర్గద్వారం, ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి మున్నగు నామాలతో వ్యవహరించబడే ఈ పర్వదినాన దేవాలయముల ఉత్తరద్వారమునందు శ్రీ మహావిష్ణువును దర్శించిన వారికి పునర్జన్మము లేదని శాస్త్రప్రమాణము. ఈ దినమె శ్రీరంగ క్షేత్రమున శ్రీరంగ దేవాలయ ద్వారస్థ భగవదాలోకన మహోత్సవం.

మహత్తుగల ఏకాదశులలో వైకుంఠ ఏకాదశి మహోత్తమమైంది. విష్ణ్వాలయాల్లో వైకుంఠ ఏకాదశి ఉత్సవాన్ని బాగా జరుపుతారు.

English summary
Astrologer has describedthe importance of Mukkoti (Vaikuntha) Ekadasi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X