వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నాగశాపాన్నితొలగించే నవనాగమండల పరిహార వివరములు

కర్నాటక రాష్ట్రంలోని తుళునాడు అని పిలువబడే దక్షిణ కెనరా ప్రాంతంలో వ్యవసాయం ప్రధాన వృత్తిగా ఉన్నది. ముఖ్యంగా వరిని పండించే ఈ ప్రాంతంలోని రైతులకు సర్పాలు ఎంతోమేలు చేస్తున్నాయి. వరి పంటను అన్ని దశలలోను ఆ

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: కర్నాటక రాష్ట్రంలోని తుళునాడు అని పిలువబడే దక్షిణ కెనరా ప్రాంతంలో వ్యవసాయం ప్రధాన వృత్తిగా ఉన్నది. ముఖ్యంగా వరిని పండించే ఈ ప్రాంతంలోని రైతులకు సర్పాలు ఎంతోమేలు చేస్తున్నాయి. వరి పంటను అన్ని దశలలోను ఆహారంగా తీసుకునే ఎలుకలు, చుంచులులాంటి జీవుల్ని చంపి ఆహారంగా తీసుకోవటంద్వారా సర్పాలు ఆ ప్రాంత రైతులకు మిత్రులుగా ఉంటున్నాయి.

అందువలన ఆ ప్రాంత ప్రజలు తాము పూజించే ఆవు మరియు అరటిచెట్టుతోపాటు సర్పాన్నికూడా దైవంగా ఆరాధిస్తున్నారు. సర్పాలను భక్తితో ఆరాధిస్తూ తుళునాడు ప్రాంతంలో రెండు రకాల నాగపూజా విధానాలను పాటిస్తున్నారు.

the story about Naga curse

అవి 1. ఆశ్లేషాబలి 2. నాగమండలం ఈ రెండు ఉత్సవాలలో నాగమండలం దీర్ఘకాలంపాటు ఆకర్షణీయంగా జరుగుతుంది. నాగమండలం అంటే మగ మరియు ఆడపాము సంగమించటం అనిఅర్ధం. - సాధారణంగా ఈ ప్రక్రియ ఇద్దరు పూజారులద్వారా జరుగుతుంది. (ఈ పూజారులు బ్రాహ్మణేతర కులాల వారు అయి ఉంటారు.

మొదటి పూజారి పోకచెట్టు పువ్వులను వాసనచూసి మగపాములాగా మారినట్టుగా నటిస్తాడు. రెండవ పూజారి నాగకన్యక లేదా ఆడసర్పంలాగా నటిస్తూ నేలమీద రంగు రంగుల ముగ్గులతో చిత్రించిన సర్పం బొమ్మచుటూ నాట్యం చేస్తాడు. ఈ ఉత్సవ సమయంలో గ్లాసు ఆకారంలో ఉండే ఢక్కా డప్పను వాయించటం జరుగుతుంది. నేలమీద 5 విభిన్నమైన రంగులతో సర్పాకారంలో వేస్తారు.

తెలుపు, ఎరుపు, ఆకుపచ్చ, పసుపుపచ్చ మరియు నలుపు రంగుల పొడులు కలిపి ఈ ముగ్గులు వేస్తారు. ఈ ముగ్గుల తయారీలో పసుపు ఆకులపొడి, ఊకమసి ఉపయోగించటం జరుగుతుంది. ఇక ఆశ్లేషాబలి విషయానికి వస్తే ఒక హిందూ మతస్తుడు చనిపోతే అతనికి శాస్త్రీయంగా దహన ప్రక్రియలు ఎలా జరుపుతారో అలా ఒక చనిపోయిన సర్పానికి జరుపుతారు. అంటే ఒకరకంగా చెప్పాలంటే ఆశ్లేషా బలి ఒక అంత్యక్రియల కార్యక్రమం అనుకోవాలి. ఇదే రకమైన కార్యక్రమం కేరళలో సర్పంతుల్లాల్ మరియు సర్పంకాళి అన్నపేరుతో జరుపబడుతున్నాయి.

నాగమండలం జరిపే విధానం కి నాగమండలం ప్రధానంగా దక్షిణ కన్నడ మరియు ఉడిపి జిల్లాలలో విస్తారంగా జరుపబడుతున్నది. సర్పదేవుడిని రాత్రి అంతా ఆరాధించటం జరుగుతున్నది. ఈ నాగమండలం డిసెంబరు నెల నుండి ఏప్రియల్ నెలదాకా జరుపబడుతున్నది. నాగమండల ఉత్సవంలో నేలపై గీసే ముగ్గులను కర్నాటకకు చెందిన వైద్య కులస్తులు వెయ్యటం జరుగుతుంది.
13వ శతాబ్దంనాటి సాహిత్య గ్రంధాలలో కూడా త్రాచుపామును ఆరాధించే నాగమండల విధానం గురించి వ్రాయబడి ఉన్నట్లుగా తెలుస్తున్నది. కొంతకాలంగా బ్రాహ్మణ పూజారులుకూడా ఈ నాగమండల ఆరాధన విధానంలో పాల్గొంటున్నట్టుగా తెలుస్తున్నది.

English summary
Astrologer explained about the Naga curse.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X