వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఈ రాశులవాళ్లకు శని ముప్పు: తస్మాత్ జాగ్రత్త!

ఏలినాటి శనిదోషం పూర్తయిన రెండున్నరేళ్ల కాలం తర్వాత. అర్గాష్ట్రమ శని కాలం ప్రారంభమవుతుంది. జన్మరాశిలో శని నాలుగో ఇంట ఉన్న కాలాన్ని అర్గాష్టమ శని అంటారు.

By Pratap
|
Google Oneindia TeluguNews

ఏలినాటి శనిదోషం పూర్తయిన రెండున్నరేళ్ల కాలం తర్వాత. అర్గాష్ట్రమ శని కాలం ప్రారంభమవుతుంది. జన్మరాశిలో శని నాలుగో ఇంట ఉన్న కాలాన్ని అర్గాష్టమ శని అంటారు. ఈ సమయంలో ఇబ్బందులు ఎక్కువగా ఉండకపోవచ్చు కానీ చేపట్టిన పనుల్లో విఘ్నాలు ఎదురువతాయి. పనులు ఆలస్యమైనా పూర్తి చేస్తారు.

ప్రస్తుతం అరాష్టమ శని నడుస్తున్న రాశులవారు: దుర్ముఖనామ సంవత్సరంలో. జనవరి 27, 2017న శనైశ్చరుడు ఐదోస్థానంలో ప్రవేశించడంతో అర్గాష్ట్రమ శని నుంచి తాత్కాలిక విరామం లభిస్తుంది.

సింహరాశి: నవంబరు 2, 2014న అర్దాష్టమ శని దోషం ప్రారంభమయ్యింది. హేవిళంబినామ సంవత్సరంలో. జూన్ 20, 2017న శనైశ్చరుడు నాలుగో స్థానంలోకి ప్రవేశించాక అర్దాష్ట్రమ శని దోషం పునఃప్రారంభమవుతుంది. అక్టోబరు 26, 20173 అర్దాష్టమ శని దోషకాలం పూర్తవుతుంది.

కన్యరాశి; దుర్ముఖనామ సంవత్సరంలో జనవరి 27, 2017న శనైశ్చరుడు నాలుగోస్థానంలోకి ప్రవేశించడంతో అర్దాష్ట్రమ శని దోషం ప్రారంభమవుతుంది. అర్గాష్ట్రమ శనిదోషం పూర్తయిన ఏడున్నరేళ్ల కాలం తర్వాత అష్టమశని దోషం ప్రారంభమవుతుంది. ఇది అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన దోష కాలం. అపమృత్యుభయం, అనారోగ్యం, అవమానాలు వంటివన్నీ ఈ దోషకాలంలో జరుగుతాయి. అష్టమ శని రెండున్నరేళ్లకాలం పాటు ఉంటుంది.

ప్రస్తుతం అష్టమ శని నేడున్న రాశులవారు:

మేషరాశి; నవంబరు 2, 2014న అష్టమశని దోషం ప్రారంభమయ్యింది. దుర్ముఖనామ సంవత్సరంలో జనవరి 26, 2017వరకు అష్టమశని దోషం కొనసాగుతుంది. జనవరి 27, 2017 నుంచి జూన్ 20, 2017వరకు శనైశ్చరుడు తొమ్మిదోస్థానంలో ఉన్న కారణంగా అష్టమశని దోషం నుంచి తాత్కాలిక విరామం లభిస్తుంది. తదుపరి. హేవిళంబి నామ
సంవత్సరంలో జూన్ 21, 2017న శనైశ్చరుడు మళ్లీ ఎనిమిదో స్థానంలో ప్రవేశించి అక్టోబరు 26, 2017 వరకు ఉంటాడు. ఆరోజున అష్టమ శని దోషకాలం సమాప్తమవుతుంది.

వృషభరాశి; దుర్ముఖనామ సంవత్సరంలో జనవరి 27, 2017న శనైశ్చరుడు ఎనిమిదో స్థానంలోకి ప్రవేశించడంతో అష్టమ శని దోషం ప్రారంభమవుతుంది. తదుపరి. హేవిళంబి నామ సంవత్సరంలో జూన్ 21, 2017న శనైశ్చరుడు ఏడో స్థానంలోకి ప్రవేశించడంతో అష్టమశని నుంచి విరామం లభిస్తుంది. తిరిగి అక్టోబరు 26, 2017న ప్రారంభమవుతుంది.

These people should take care regarding Shani

ఏలినాటి శనిదోషమైనా అర్దాష్టమ శనైనా అష్టమ శనైనా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలంటే అందుకు శనైశ్చరుని అనుగ్రహమే ఏకైక సాధనం. ఇందుకోసం జ్యోతిషశాస్త్రంలో చెప్పిన చిన్నపాటి తరుడోపాయాలు పాటిస్తే గండాలు గట్టెక్కొచ్చు.

అ ప్రతి శనివారం నవగ్రహ మండపానికి వెళ్లి శనైశ్చర దర్శనం చేసుకుని తొమ్మిది ప్రదక్షిణలు చేయాలి.

అ శనివారంతో పాటు త్రయోదశి, అమావాస్య కలిసివచ్చినప్పుడు శనైశ్చర ఆరాధన తప్పనిసరి.

అ శనిత్రయోదశి, శనిఅమావాస్య రోజుల్లో శనైశ్చరునికి స్వచ్ఛమైన

నువ్వులనూనెతో తైలాభిషేకం చేయాలి. నువ్వులు బెల్లం నివేదించాలి.

నల్లటి వస్తాన్ని సమర్పించాలి. ఈ ఆరాధనా విధానం. ప్రతి శనివారం పాటించినా విశేష ఫలితం ఉంటుంది.
ప్రతి శనివారం శనిస్తోత్రం తప్పనిసరిగా పలించాలి. శనిస్తోత్రంతో పాటు మృత్యుంజయ మహామంత్రం, ఆంజనేయ దండకం లేదా హనుమాన్ చాలీసా తప్పనిసరిగా అనునిత్యం పలించాలి.

మీ జన్మస్థానం (తిధి అనుసారం) రోజున లేదా మీకు అనుకూలమైన రోజున ఏడాదికోమారు పరమేశ్వరునికి రుద్రాభిషేకం చేయించండి. వీలున్నవారు ప్రతి సోమవారం శివాలయాన్ని సందర్శించండి. క్షీరాభిషేకం చేయండి.
అ చికాకులు ఇబ్బందులు అధికంగా ఉంటే కాలిమట్టి, పాతమేకు నల్లగుడ్డలో కట్టి దాన్ని పారే కాలువలో వదలాలి.
బ్రాహ్మణులకు నువ్వులు, నూనె, బెల్లం, నవధాన్యాలు వంటివి దానం చేసినా శనిదోష పులిహారO కలుగుతుంది.
అ వీలున్నప్పుడు పావ్గడ (కర్ణాటక), మందపల్లి (ఆంధ్రప్రదేశ్) వంటి ప్రసిద్ధ శనైశ్చర క్షేత్రాలను. లేదా మీ సమీపంలోని శని ఆలయాలను దర్శించండి.

English summary
Few Zodaic peersons will face trouble with Shani. Astrologer described about the troubles and remedies.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X