వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శాస్త్రీయత: బ్రాహ్మీ ముహూర్తం అంటే ఏమిటి?

పుణ్యకార్యాలకి జపాలకి పవిత్రంగా భావించే కాలం, చదువుకి గోప్పకాలంగా చెప్పబడే బ్రాహ్మిముహుర్తమంటే ఏమిటి వాటివెనక ఉన్నశాస్త్రీయత ఏమిటో గమనిద్దాం.

By Pratap
|
Google Oneindia TeluguNews

పుణ్యకార్యాలకి జపాలకి పవిత్రంగా భావించే కాలం, చదువుకి గోప్పకాలంగా చెప్పబడే బ్రాహ్మిముహుర్తమంటే ఏమిటి వాటివెనక ఉన్నశాస్త్రీయత ఏమిటో గమనిద్దాం.

బ్రహ్మ సంకల్ప మాత్రం చేత సృష్టి చేశాడు. సూర్యోదయం నుండి ఉన్న స్థితిని సృష్టిగా భావిస్తే సూర్యోదయానికి ముందున్నసమయాన్ని సృష్టికి పూర్వకాలంగా గుర్తించవచ్చు. (బ్రాహ్మీ ముహూర్తకాలం తెల్లవారు జామున 3గంటల నుండి 5 గంటల వరకు). మన సూర్యుడు కర్మ ప్రేరకుడు. సూర్యాస్తమయంతో కర్మలను ముగించి కృత్రిమ కాంతి (విద్యుత్తు) లేకుండా ఉంటే రెండు మూడు గంటలు లేక ఒక జాములో పీనియల్ గ్లాండ్ నుండి మెలటోనిన్ అనే రసాయనం ఉత్పత్తి అవుతుంది. ఇది చక్కని గాఢనిద్రను అందిస్తుంది. శారీరక మానసిక విశ్రాంతి లభిస్తుంది. శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగు అవుతుంది.

సహజంగా ఐదారు గంటలు నిద్రపోయే సరికి మెలకువ వస్తుంది. మెలటోనిన్ యొక్క స్వభావమేమంటే శరీరంలో ఏ భాగంలో కాంతి ప్రసరించినా, దాని ఉత్పత్తి తగ్గిపోతుంటుంది. క్రమంగా ఉత్పత్తే ఆగిపోతే వార్థకంలో నిద్ర పట్టక బాధపడేవారు చాలామంది కనిపిస్తారు. ఈ నిద్ర వ్యక్తిలో రోగ నిరోధక శక్తిని, సమస్యా పరిష్కార శక్తిని కూడా వృద్ధి చెందిస్తుంది. ఇది సహజమైనచర్య తెల్లవారు జాము మూడు గంటలు అయ్యేటప్పటికి నిద్ర అవసరం తీరిపోయింది. కాని, చుటూ కాంతి లేని మీదట నిద్ర, జాగ్రదవస్థల మధ్యస్థితి కొనసాగుతుంది.

What is Brahmi Muhurtam?

దానిని చాలా విలువైన సమయంగా గుర్తించవచ్చు. ఆ సమయంలో లీలగా భాసించే భావాలు తరువాతి కాలంలో కార్యరూపం దాల్చే అవకాశం ఉంది. ఆ స్థితిలో వచ్చే ఆలోచనలు కూడా గతంలోని అనుభవాన్ని వర్తమానం లోని అవసరాన్ని భవిష్యతులోని పరిణామాన్ని సమన్వయం చేసూ మనకు ఆనందకారులుగా, మన వారికి హితకారులుగా ఉండగల ఆలోచనలను ప్రేరేపిస్తుంది. అవి త్వరలో కార్యరూపం దాల్చే స్థితి గోచరిస్తుంది. విద్యుత్ కాంతి ఈ మెలటోనిన్ అనే రసాయనం యొక్క ఉత్పత్తిని అరికడుతూన్నందువల్ల వ్యక్తి తెల్లవారుజామున ఈ అద్భుతమైన స్థితిని కోల్పోతున్నాడు.

మన సైంటిస్తులందరూ రాత్రి 9 నుండి 3 వరకు గాఢనిద్రను పొందితే తరువాతి సమయంలో వారికి వచ్చే ఆలోచనలు లోకహితానికి అవుతాయి అని గుర్తించవచ్చు బ్రాహ్మీ ముహూర్తంలో కలిగే సంకల్పాలు అతి త్వరలో హితకరులుగా సమాజ శ్రేయస్కరులుగా రూపొందుతా యనడంలో సందేహం లేదు. ఋషులు హ్మీ ముహూర్త సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం వల్ల ప్రపంచానికి హితకారులు కాగలిగారు. బ్రహ్మ సంకల్పంతో సృష్టించినట్లుగా బ్రాహ్మీ ముహూర్తంలోని సంకల్పాలు హితకరములైన సృష్టిని కలిగిస్తాయి. అందుకే అది బ్రాహ్మీ ముహూర్తం.

అందుకే జపాదులు చేయడానికి బ్రాహ్మీముహూర్తమే సరియైనదనీ, ఈ సమయంలో చేసే జపాదులకే స్పష్టమైన ఫలితాలుంటాయని పెద్దలు చెపుతుంటారు. విద్యార్థులు కూడా చదువుపై ఏకాగ్రత పెంచుకోవడానికి, త్వరగా చదివిన దానిపై దృష్టి ఏర్పడడానికి కూడా ఈ ప్రత్యేక సమయంలో చేసే కృషి వినియోగపడుతుంది. యోగులు కూడా సాధనా క్రమంలో ఈ సమయాన్ని వినియోగించు కుంటారు. అదేవిధంగా ఈ నాటి కాలంలోని లోకహిత, ప్రజాహిత, ప్రాణి హిత, ప్రకృతి హితకరులుగా ప్రయత్నాలు చేసేవారు కూడా బ్రాహ్మీముహూర్తంలో ధ్యానం చేసి దీక్ష తీసుకోవడం ద్వారా కృతకృత్యులవుతారు.

ధ్యానంతో, ఆనందంతో, హితకరమైన ఆలోచనలతో బ్రాహ్మీ ముహూర్తాన్ని గడిపి దైవత్వాన్ని ఆహ్వానిద్దాం. అర్థరాత్రి మెలకువగా ఉండే రాక్షసత్వాన్ని పారద్రోలుదాం. కృత్రిమ శాంతిని బహిష్కరిద్దాం. గ్లోబల్వార్మింగ్ను నివారిద్దాం. సహజకాంతిలో సహజానందంతో సహజ జ్ఞానంతో సమాజ హితకరులుగా వెలుగొందుదాం.

English summary
Astrologer described what is Brahmi Muhurtama and its scientific reason.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X