వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కుజదోషం ఉన్నవారేం చేయాలి?

కుజ దోషం ఉన్నవారు ఏం చేయాలనే విషయాన్ని జ్యోతిష్కుడు వివరించారు. అది చదివి నివారణ చర్యలు తీసుకోవచ్చు.

By Pratap
|
Google Oneindia TeluguNews

రెండవ కుమారుడైన సుబ్రహ్మణ్యస్వామిని కొలవడానికి ఉద్దిష్టమైనది సుబ్రహ్మణ్యస్వామి పూజా పండుగ. సుబ్రహ్మణ్యస్వామికే కుమారస్వామి, కార్తికేయుడు, స్కందుడు, షణ్ముఖుడు, గుహుడు మున్నగు పలు పర్యాయనామాలు ఉన్నాయి. ఈ పర్యాయనామాలను పట్టి ఈ పర్వానికి కూడా కుమారషష్టి కార్తికేయషష్టి గుహ ప్రియావ్రతమ్ మున్నగు నామాలు ఏర్పడ్డాయి.

సుబ్రహ్మణ్యస్వామి పూజే కాక ఈనాడు చంపాషష్టి ఫలషష్టి ప్రావారణషష్టివ్రతాలు చేయవలసినట్లుగా వ్రత గ్రంథాలు చెబుతున్నాయి, విశాఖనక్షత్రం, ఆదివారం, వైధృతి యోగం ఈ మూడున్నూ భాద్రపద శుద్ధ షష్ఠినాడు సంఘటితమైతే అది చంపాషష్టి అనబడుతుందనీ, ఆ యోగకాలమందు చేసిన స్నాన దానాదికాలు అక్షయఫలాన్ని ఇస్తాయనీ హిందువుల పండుగలలో కలదు.

What shoul we do, if there is Kuja dosha?

కాని స్మృతికౌస్తుభవము మార్గశిరశుద్ధ షష్టిని చంపాషష్టి అని పేర్కొంటూ ఉంది. ఫలషష్టివృతం మార్గశిర శుద్ధ షష్ఠినాడు ప్రారంభించి ఏడాది పొడుగునా ప్రతిషష్టి తిథికి చేయాలని చతుర్వర్గ చింతామణి చెబుతూ ఉంది. ప్రావరణమంటే ఉత్తరీయము, ముసుగు అనిన్నీ - ప్రావారమంటే ఉత్తరీయము, కంబళీ అనిన్నీ అర్థము.

మార్గశీర్షం చలిబాగా వేసే మాసం. మార్గశిర మాసంలో చలి మంటలో పడ్డా పోదని నానుడి. కాగా ఆ మాస ప్రారంభంలోని ఈ షష్టినాడు శీతాపహార్డం దుప్పట్ల, కంబళ్ళు మొదలయినవి దానం చేయడం ఈ వ్రతోద్దేశమై ఉంటుందని ఊహింపవచ్చును.

English summary
Astrologer explains about the puja to be done, who are facing Kuja dosa.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X