వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాపగ్రహంలో గృహకారుకుడు కలిసున్నాడా?

By Pratap
|
Google Oneindia TeluguNews

01. యస్‌.బి. బాలు, మచిలీ పట్నం, స్వంత ఇల్లు పొందుతానా?

స్వంత ఇంటికి ఆటంకాలు ఎక్కువగా ఉన్నాయి. 2లో బుధ, సూర్య గ్రహాలు, ఉన్నారు,కేతువు చూస్తున్నాడు, గృహ కారకుడు పాపగ్రహాలతో కలిసున్నాడు. శనిలో కేతువు దశ నడుస్తుంది. గోచారంలో ఏలినాటి శని దశ నడుస్తుంది అనుకూలత తక్కువగా ఉంది. కాబట్టి కొంత కష్టతరం అనే చెప్పాలి. వీటికి పరిహారాలు చేసుకుంటూ.''చింతామణి గృహాంతస్థా శ్రీమన్నగర నాయికా '' అనే మంత్రం జపిస్తూ ఉండండి.

02. కరుణారమేష్‌, సంతానం

మీ ఇద్దరి జాతకాలూ చూసాము, రమేష్‌గారికి 5లో రాహువున్నాడు, పాపగ్రహాలు చూస్తున్నారు. కొంత శాంతి పూజలు అవసరం, అంటే ఏంచేయాలో కింద నవగ్రహ పరిహారాలు అనే ఆర్టికల్‌లో విడిగా అందించాం. అవి చదవండి.

03. కిషోర్‌ కుమార్‌, పాపిరెడ్డి గూడ. ఉద్యోగ సమస్య

మీకు ఉద్యొగ పరిస్థితులు జాతకరీత్యా అంతా బాగానే ఉంది. గోచారరీత్యా కొంత గ్రహానుకూలత లేదు. 2017 జన వరికి మెరుగవడానికి అవకాశాలున్నాయి. ఐతే కేతు, గురులకి దానాలు పరిహారాలు చేసుకోండి. శ్రీ రాజమాతంగ్యై నమ:'' అని జపిస్తూ ఉండండి. అంటే ఏంచేయాలో కింద నవగ్రహ పరిహారాలు అనే ఆర్టికల్‌లో విడిగా అందించాం. అవి చదవండి.

04. కోరట మడ్డి నరసింహ కిషోర్‌, కలికిరి, ఉద్యోగమా వ్యాపారమా?

మీకు వ్యాపారము ఉద్యోగం రెండూ సరైనవే ఉద్యోగం సూచిస్తూ ఉంది. ఏఉద్యోగమైనా మంచిదే. కానీ వ్యాపారమైనా ఉద్యోగమైనా మార్కెటింగ్‌, సేల్స్‌ కిరాణం వంటివి మీకు మంచివి.

05. రంగు వివేక్, వరంగల్‌, గవర్నమెంట్‌ జాబ్‌ ?

మీకు గవర్నమెంట్‌ జాబ్‌ వస్తుంది. ఎలాంటి ఆటంకాలు లేవు.

06. శ్రీకాంత్‌ తుపిలి, పుబ్బ నక్షత్రం, గవర్నమెంట్‌ జాబ్‌ వస్తుందా?

మీరు పుట్టిన తేదీ సమయం ఏవీ ఇవ్వలేదు. అలా ఇవ్వకుండా చెప్పడం కుదరదు.

07. రమణారెడ్డి, ఫారిన్‌ ఛాన్స్‌ ఉందా?

పుట్టిన చోటుని హైదరాబాద్‌ గా తీసుకున్నాం. మీకు విదేశాలకి వెళ్లే అవకాశం తక్కువగా ఉంది.

 Ask Your astrolger: readers' doubts clarified on future

08. సర్వేశం, కర్ణాటక, సాఫ్టవేర్‌ జాబ్‌ వస్తుందా?

మీకు సాఫ్ట్‌వేర్‌ జాబ్‌ వస్తుంది.

09. జ్యోతి. ఆర్‌, హైదరాబాద్‌, మాంగల్య దోషం ఉందా?

మీకు మాంగల్య దోషం లేదు. ఎవరెవరివో చెప్పుడు మాటలు వినకండి. మీకు మంచి వైవాహిక జీవితం ఉంది. శుభం

10.అంబటి దినేష్‌ రెడ్డి, గవర్నమెంఖీ జాబ్‌ వస్తుందా?

మీకు అన్ని విధాలా గవర్న మెంట్‌ జాబ్‌కి అవకాశాలున్నాయి. కానీ రాహు కేతువుల దుష్ప్రభావం వలన కొద్దిలో తప్పి పోవచ్చు. రాహు కేతువులకి దానాలు పరిహారాలు చేసుకుంటూ ఉండండి. అంటే ఏంచేయాలో కింద నవగ్రహ పరిహారాలు అనే ఆర్టికల్‌లో విడిగా అందించాం. అవి చదవండి.

11. అశోక్‌, కామారెడ్డి, నాది ఏనక్షత్రం?

మీది భరణి నక్షత్రం మీకు ఎవరో చెప్పినట్టు ఏశని దోషమూ లేదు.

12. ఉన్మేష, కాకినాడ, వివాహం?

మీకు 2017 లో వివాహ బలం అనుకూలతలు యోగిస్తాయి. మీకు వివాహ పరంగా ఏదోషాలు లేవు.

13.హెడ్డింగ్‌ పెట్టి వదిలినవారు

శ్రీనివాసులు తలారి, కడప

జోస్యుల సత్యనారాయణ శాస్త్రి

సత్య నారాయణ లక్క రాజు

కిరణ్‌ మూర్తి, తాడేపల్లి గూడెం, వివాహం

ఆది సాయి శ్వేత, జంగారెడ్డిగూడెం

మాలిరెడ్డి వేమారెడ్డి, నర్సరావు పేట, (జాబ్‌)

హెడ్డింగ్‌ పెట్టి వదిలిలి వేసారు కొందరు వారి పేర్లు ఇవి.

వివాహం గురించి తెలుసు కోవాలన్నారు ( ఏం తెలుసు కోవాలి - కాలేదా, వివాహంలో దోషాలేమైనా ఉన్నాయా అని అడగదల్చుకున్నారా? ప్రయత్నాలు విఫలమయ్యాయా ? ప్రస్తుతం పెళ్లి బలముందాలేదా అని అడగదల్చుకున్నారా / స్పష్టంగా రాయండి.ఉద్యోగం గురించి తెలుసు కోవాలన్నారు (ఏం తెలుసు కోవాలి - రాలేదా ప్రయత్నాలు విఫలమయ్యాయా? ప్రస్తుతం మంచి బలముందా లేదా అని అడగదల్చుకున్నారా / స్పష్టంగా రాయండి. విద్యగురించి అడిగారు (అసలు మీరు అడగదలుచు కున్న ప్రశ్న ఏమిటి -ఏచదువుమంచిది అని అడగదల్చుకున్నారా ? లేదా ఇప్పుడున్నసమస్యలగురించి అడగదల్చుకున్నారా,ఏదైన ఉన్నత విద్య చదువుతుందా అని అని అడగదల్చుకున్నారా?లేదాఇంకేదైనా వుం? ప్రశ్నస్పష్టంగా రాయండి)

14. కెరియర్‌, భవిష్యత్‌

దేవండ్ల కిరణ్‌ కుమార్‌, 19.08.1985

వెంకటేష్‌ వెంపటపు, రాజమండ్రి, 15-02-1990

దామర్కల నాగరాజు.

ఒకే జాతకాన్ని సమగ్రంగా చూడటమూ కుదరదు.సూచనప్రాయాముగా ఉండేవాటిని అడగండి .భవిష్యత్తు అంటే అది చర్చనీయాంశం,అందులో చాల విషయాలుంటాయి (అంటే ఆరోగ్యం, ఇల్లు, ఆస్తి,విద్య, ఉద్యోగం, దాంపత్యంలాంటివి). పూర్తికెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు. ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే. ఏదైనా ఒక ప్రశ్న అడగండి. ముందు ప్రశ్నలడగానికి మేంఇచ్చిన షరతులు, నియమావళిని చదవండి. చదివి మీప్రశ్న పంపండి.

15. కొంత మంది సరైన వివరాలు ఇవ్వలేదు వారి వివరాలు ఇవి. దయచేసి జవాబుల కింద '' సూచనలు ''చదివి సరైన వివరాలతో పంపించండి.

యన్‌. శివ 8696919298 (పుట్టిన సమయం ఇవ్వలేదు)

వీర పవన్‌ కుమార్‌ (ప్రభుత్వ ఉద్యోగం) పుట్టిన సమయం రాయలేదు

మౌనిక గణేష్‌ (పుట్టిన సమయం రాయలేదు)

అనకాపల్లి సంతోష్‌ కుమార్‌( శ్రీకాకుళం)

యస్‌. జి. రాధేష్‌ (గోనె గండ్ల)

సందేహాలకు సమాధానాలు: పాఠకులకు విన్నపం

నవగ్రహాలకి జపాలు పరిహారాలు

మీ ప్రశ్నలను, సందేహాలను పంపించాల్సిన ఈ మెయిల్ అడ్రస్ [email protected]

English summary
Astrologer Maruthi Sharma answered the questions of Oneindia Telugu readers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X