వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పెళ్లి సమస్యలపై పాఠకుల ప్రశ్నలు: జవాబులు ఇలా..

By Pratap
|
Google Oneindia TeluguNews

1. వెంకట ప్రభు, కనిగిరి, రాహుకేతువులు వివాహ సమస్య.

మీకు కాల సర్పదోషం ఉంది, నిజమే కానీ అది వివాహానికి ఏ రకంగానూ సంబంధం లేదు, మీ వివాహ కారకుడు సూర్యుడు, అష్టమాధి పతితో కలిసి 2లో ఉన్నాడు. కానీ వ్యయ స్థానాధిపతి శని చూడటం. ఇవి రెండూ వివాహ ఆటంకాలు. ఈ సంవత్సరం సెప్టెంబర్‌ దాటితే దశ బాగవుతుంది. గురుబలం చాలా తక్కువగా ఉంది మరొక ఏడాది దాటలి. ముందుగా ఈ గ్రహాలకి దానాలు శాంతి పరిహారాలు చేసుకోండి. వివాహానికి ఒక శ్లోకం అందించాం చదువుతూండండి. అంటే ఏంచేయాలో కింద నవగ్రహ పరిహారాలు అనే ఆర్టికల్‌లో విడిగా అందించాం. అవి చదవండి.

2. కొత్తకోట కుసుమ, తిరుపతి, వివాహం ఆలస్యం

రవి, చంద్ర, శుక్ర, కేతు, వీళ్లందరూ రాహు నక్షత్రంపైన లగ్నంలో ఉన్నారు వివాహ భావం 7ని చూస్తున్నారు., ఆరాహువు 7లో ఉన్నాడు. వివాహభావంపై గురు దృష్టి ఉంది, కాబట్టు భయపడక్కర్లేదు ఏలాంటు పరిస్థితుల్లోను వివాహం ఆలస్యం అవవడం తప్ప ఎలాంటి ఇబ్బందులూ ఉండవు. పై గ్రహాలకి దానాలు పరిహార ములు చేసుకోండి.వివాహానికి ఒక శ్లోకం అందించాం చదువుతూండండి. అంటే ఏంచేయాలో కింద నవగ్రహ పరిహారాలు అనే ఆర్టికల్‌లో విడిగా అందించాం. అవి చదవండి.

3. లక్ష్మీనారాయణ గుర్రం, బెల్లరి, వివహం

వివాహం గురించి తెలుసుకోవాలన్నారు ( ఏం తెలుసుకోవాలి -కాలేదా ,వివాఆహంలో దోషాలేమైనా ఉన్నాయా అని అడగదల్చు కున్నారా? ప్రయత్నాలు విఫలమయ్యాయా ?ప్రస్తుతం పెళ్లి బలముందాలేదా అని అడగదల్చుకున్నారా / స్పష్టంగా రాయండి.

4. రాధాకృష్ణ ఎట్టె, పుట్టిన చోటు రాయలేదు హైదరాబాద్‌గా తీసుకున్నాం, వివాహం సమస్య

మీకు 7వ అధిపతి గురుడు 6లో ఉన్నాడు 8వ అధిపతి కుజుడు 7వభావాన్ని చూస్తున్నాడు. మీరు శనిలో గురుడి దశ నడుస్తుంది, గోచారంలో గురు శను అనుకూలత లేదు. ముందుగా ఈ గ్రహాలకి దానాలు శాంతి పరిహారాలు చేసుకోండి. వివాహానికి ఒక శ్లోకం అందించాం చదువుతూండండి. అంటే ఏంచేయాలో కింద నవగ్రహ పరిహారాలు అనే ఆర్టికల్‌లో విడిగా అందించాం. అవి చదవండి.

5. ఏ.మనోహర్‌, గుంటూరు, ప్రేమవివాహం

మీకు ప్రేమ వివాహానికి అవకాశం ఉంది, కానీ వివాహ జీవితంలో ఆటంకాలెక్కువగా ఉన్నాయి.

6. తిరుపతి గురిజాల, కరీంనగర్‌, జాబ్‌, మ్యారేజ్‌

వివాహం గురించి తెలుసుకోవాలన్నారు ( ఏం తెలుసుకోవాలి -కాలేదా ,వివాఆహంలో దోషాలేమైనా ఉన్నాయా అని అడగదల్చుకున్నారా? ప్రయత్నాలు విఫలమయ్యాయా? ప్రస్తుతం పెళ్లి బలముందా లేదా అని అడగదల్చుకున్నారా / స్పష్టంగా రాయండి.

7. రాజేష్‌ దాసరి, పుట్టిన చోటు రాయలేదు హైదరాబాద్‌గా తీసుకున్నాం, వివాహం

మీకు వివాహ కారకుడు కుజుడు, 8వ కారకుడు శుక్రుడు, రాహు, అలా 5గ్రహాలు అన్నీ కలిసి 4లో ఉన్నారు. గురుడిలో వ్యయాధిపతి బుధుడి దశ నడుస్తుంది. గురు బలం బాగాలేదు. వీటికి పరిహారం తప్పక చేసుకోవాలి. లేకపోతే చాలా సమస్యలుంటాయి. పై గ్రహాలకి దానాలు పరిహార ములు చేసుకోండి. వివాహానికి ఒక శ్లోకం అందించాం చదువుతూండండి. అంటే ఏంచేయాలో కింద నవగ్రహ పరిహారాలు అనే ఆర్టికల్‌లో విడిగా అందించాం. అవి చదవండి.

Ask Your astrologer: Marraige issues dealt

8. హనుమాన్‌ ప్రసాద్‌ రేపల్లె, విజయవాడ,

మీకు ప్రేమ వివాహానికి అవకాశం లేదు.

9. బి.భరత్‌ కుమార్‌, ప్రేమవివాహం,

పుట్టిన చోటు, సమయం రాయకుండా చెప్పడం కుదరదు.

10. సుర్తాని గిరిబాబు, నెల్లూరు, వివాహం,భవిష్యత్తు.

భవిష్యత్తు అంటే అదిచర్చనీయాంశం,అందులో చాల విషయాలుంటాయి(అంటే ఆరోగ్యం,ఇల్లు,ఆస్తి,విద్య,ఉద్యోగం, దాంపత్యం లాంటివి). పూర్తికెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు. ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే. ఏదైనా ఒక ప్రశ్న అడగండి. ముందు ప్రశ్నలడగానికి మేంఇచ్చిన షరతులు,నియమావళిని చదవండి.వివాహం గురించి తెలుసుకోవాలన్నారు( ఏం తెలుసుకోవాలి -కాలేదా, వివాహంలో దోషాలేమైనా ఉన్నాయా అని అడగదల్చుకున్నారా? ప్రయత్నాలు విఫలమయ్యాయా? ప్రస్తుతం పెళ్లి బలముందాలేదా అని అడగదల్చుకున్నారా / స్పష్టంగా రాయండి.

11. గూడూరు నరేష్‌, నంద్యాల, వివాహ ఆలస్యం

7రాహువు, 8వఅధిపతి బుధుడు లగ్నంలో ఉండి 7ని చూడటం, శని చూడటం, శుక్రుడిలో కేతువు దశ నడుస్తుంది, మీకు వివాహం కావట్లేదు అనికాదు సమస్య, కొన్నింటిని మీరు వివాహ బలం ఉన్నప్పుడు వదులుకున్నారు. మరొక సంవత్సరం దాకా గురుబలం లేదు ముందుగా ఈ గ్రహాలకి దానాలు శాంతి పరిహారాలు చేసుకోండి. వివాహానికి ఒక శ్లోకం అందించాం చదువుతూండండి. అంటే ఏంచేయాలో కింద నవగ్రహ పరిహారాలు అనే ఆర్టికల్‌లో విడిగా అందించాం. అవి చదవండి.

12. యం.సింధుజ, మాచర్ల, ప్రేమవివాహం

మీకు ప్రేమ వివాహానికి అవకాశం తక్కువగా ఉంది. 7లో కేతు, చంద్రులు ఉండటం వలన వివాహం ఆలస్యం కావడం జరిగే అవకాశం ఉంది. రాహువు దశ నడుస్తుంది, గురుబలం కూడా లేదు పైగ్రహాలకి దానాలు శాంతి పరిహారాలు చేసుకోండి.

13. విజ్జుడోలి (మెఇల్‌ ప్రకారం), పుట్టిన చోటు రాయలేదు హైదరాబాద్‌గా తీసుకున్నాం, వివాహం

అష్టమాధిపతి 7లో ఉంది, శుక్రుడులో బుధుడు నడుస్తున్నాడు, ఏప్రిల్‌ దాటితే తప్ప దశ మారదు, మరొక సంవత్సరం తర్వాతే గురుబలం వస్తుంది.అప్పటి వరకూ వీటికి దానాలు పరిహారాలు చేసుకోండి. పౖ గ్రహాలకి దానాలు పరిహార ములు చేసుకోండి. వివాహానికి ఒక శ్లోకం అందించాం చదువుతూండండి. అంటే ఏంచేయాలో కింద నవగ్రహ పరిహారాలు అనే ఆర్టికల్‌లో విడిగా అందించాం. అవిచదవండి.

14.ఆనంద్‌ కుమార్‌,తిరుపతి, కుజదోషం

మీకు కుజదోషం లేదు

15.శ్రీనివాసులు, జ్యేష్ఠ పుత్రికని వివాహం చేసుకోవచ్చా?

జ్యేష్ఠ పుత్రుడు, జ్యేష్ఠ పుత్రిక, జ్యేష్ఠమాసం, జ్యేష్ఠ నక్షత్రంగల అమ్మాయి. జ్యేష్ఠ నక్షత్రంగల అబ్బాయి. వీటిలో రెండుకి మించరాదు.

సందేహాలకు సమాధానాలు: పాఠకులకు విన్నపంసందేహాలకు సమాధానాలు: పాఠకులకు విన్నపం

నవగ్రహాలకి జపాలు పరిహారాలు నవగ్రహాలకి జపాలు పరిహారాలు

మీ ప్రశ్నలను, సందేహాలను పంపించాల్సిన ఈ మెయిల్ అడ్రస్ [email protected]

English summary
Astrologer Maruthi Sharma answered the questions of Oneindia Telugu readers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X