వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సందేహాలకు సమాధానాలు: పాఠకులకు విన్నపం

By Pratap
|
Google Oneindia TeluguNews

సందేహాలకు సమాధానాలు అనే శీర్శికకు స్పందించినందుకు పాఠకుల ధన్యవాదాలు.ధార్మిక ,ఆధ్యాత్మిక, జ్యోతిష ప్రశ్నలను మీరు పంపడంలో స్పష్టత అవసరం. అర్థంకానివి తిరస్కరించడం మాఉద్దేశం కాదు.
మీవివరాలు సరిగ్గాలేకపోతే పరిశీలించటం కష్టం.దానికితగిన శీర్షిక(హెటింగ్‌ లేదా సబ్జెక్ట్‌) ఒకేవాక్యంలో ఉంరాయడం,ప్రశ్న అడిగే వారి పేరు ఊరురాస్తే జవాబుల్లో మీదిగా గుర్తించడానికి మీకు వీలౌతుంది.
కింది విధంగా సమాచారాన్ని మీరు మాకు ఇవ్వాల్సిన విధాన్ని దయచేసి అనుసరించగలరు.

Jythisham: appeal fo readers

1.మీకుకావాల్సిన సమాచారం

పుట్టిన వివరాలు,నక్షత్రం/రత్నం, ఘాతవారం/ ఏ పేరుపెట్టాలిజననదోషం/ రజస్వలాదోషం /మరణదోషం/ సూతకం (మైలదినాలు మరణదోషం/ సూతకం(మైలదినాలు) ఇవి ఐతే

మీరు రాయాల్సినశీర్షిక /సబ్జెక్ట్‌ లేదా హెడిరగ్‌ ‘‘ ప్రాథమిక సమాచారం ''

మీరు ఇవ్వాల్సిన సమాచారం - తేదీ,సమయం,చోటు (రజస్వలాదోషానికి చోటు,వస్త్రాల రంగు తెలపాలి)

2.మీకుకావాల్సిన సమాచారం ప్రస్తుతం (చదువు, పైచదువులకై /విదేశగమనం చదువులో ఆటంకం)
మీరు రాయాల్సినశీర్షిక /సబ్జెక్ట్‌ లేదా హెడింగ్ ‘‘విద్య ''

మీరు ఇవ్వాల్సిన సమాచారం - ‘జన్మనక్షత్రం లేదా పేరు.

3.మీకుకావాల్సిన సమాచారం ఆరోగ్యం ప్రస్తుతం /ప్రమాదాలు/దోషపరిహారంగా /ఆలోచనల్లోని మార్పులు ఐతే
మీరు రాయాల్సినశీర్షిక /సబ్జెక్ట్‌ లేదా హెడిరగ్‌ ఆరోగ్యం

మీరు ఇవ్వాల్సిన సమాచారం -‘జన్మనక్షత్రం లేదా పేరు.
4. మీకుకావాల్సిన సమాచారం ఇల్లు నిర్మాణం / స్వంతింటి ప్రయత్నంలో ఆటంకాలు/ఇంటికి ఏపేరు పెట్టాలి,ఇంటికి సింహద్వారం ఎటు పెట్టాలి. ఐతే

మీరు రాయాల్సినశీర్షిక /సబ్జెక్ట్‌ లేదా హెడిరగ్‌ - ఇల్లు
మీరు ఇవ్వాల్సిన సమాచారం - జన్మనక్షత్రం లేదా పేరు.

5.మీకుకావాల్సిన సమాచారం ప్రస్తుతం ఉద్యోగంలో స్థిరత్వం లేకపోవటం/షాప్‌కి ఏపెరు పెట్టాలి.ఉద్యోగంలో సంతృప్తి లేకపోవటం/ ఉద్యోగపరంగా విదేశాలకు వెళ్లేదీ లేనిదీ / వ్యాపారంలో నష్టాలుఐతే మీరు రాయాల్సినశీర్షిక /సబ్జెక్ట్‌ లేదా హెడింగ్ ఉద్యోగం
మీరు ఇవ్వాల్సిన సమాచారం జన్మనక్షత్రం లేదా పేరు.
6. మీకు కావాల్సిన సమాచారం పెళ్లి విషయంలో పెళ్లిలో దోషాలసందేహాలు / ప్రస్తుతం పెళ్లితర్వాత సమస్యలు విడాకులు ఐతే.
మీరు రాయాల్సినశీర్షిక /సబ్జెక్ట్‌ లేదా హెడింగ్ పెళ్లి

మీరు ఇవ్వాల్సిన సమాచారం జన్మనక్షత్రం లేదా పేరు.

7. మీకు కావాల్సిన సమాచారం వివాహ పొంతన /రెండుజాతకాలు కలిసేదీ లేనిదీ ఐతే
మీరు రాయాల్సినశీర్షిక /సబ్జెక్ట్‌ లేదా హెడిరగ్‌ పొంతన
మీరు ఇవ్వాల్సిన సమాచారం అమ్మాయి అబ్బాయిల ఇద్దరి (జనన తేదీ,సమయం,చోట్లు )

8. మీకు కావాల్సిన సమాచారం గృహప్రవేశానికి ముహూర్తం/శంకుస్థాపనకి ముహూర్తం/షాప్‌ లేదా ఆఫీస్‌ ఓపెనింగ్‌లకు ముహూర్తం/పెళ్లిల్లకు ముహూర్తం ఐతే
మీరు రాయాల్సినశీర్షిక /సబ్జెక్ట్‌ లేదా హెడిరగ్‌ ముహూర్తం
మీరు ఇవ్వాల్సిన సమాచారం జన్మ నక్షత్రాలు మాత్రమే / పేరు ,(ఎప్పట్నుంచి ఎప్పట్లొకావాలిరాయాలి)
9. మీకు కావాల్సిన సమాచారం సంతానం ,లేకపోవటం,నిలబడకపోవడం (అబార్షన్లు) ఐతే
మీరు రాయాల్సిన శీర్షిక /సబ్జెక్ట్‌ లేదా హెడిరగ్‌ సంతానం

మీరు ఇవ్వాల్సిన సమాచారం భార్య భర్తల ఇద్దరి (జననతేదీ, సమయం, చోట్లు)
ముహూర్తం ( ప్రతినెలాఇచ్చిన ముహూర్తాలల్లో మీకు నచ్చిన 2 లేదా 3 తేదీ లను చెపితే మీపేరున కలిసేదీ లేనిదీ చెపుతాము. ఉపనయనాలకు ముహూర్తం చెప్పటం కుదరదు)

గమనిక

పైన ఇచ్చిన ఉద్యోగ,వివాహాది ప్రశ్నలు ప్రస్తుత పరిస్థితి గురించి మాత్రమే. (కొన్ని విషయాలు ఉదాహరణకు) పైచదువులకై విదేశగమనం ఉద్యోగం కొరకు విదేశగమనం, చదువు రాకపోవటం. ప్రభుత్వ ఉద్యోగం ఉందా? దీర్ఘ వ్యాధులు, ఏ ఉద్యోగం ?,ఎప్పుడు వస్తుంది, ప్రేమవ్యవహారాలు ద్వితీయవివాహం, పెళ్లికాక పోవటం ఇల్లు కొనుట, కట్టుట, ఆస్తి, కెరియర్‌ - ఇలాంటివి చర్చించడానికి సరిపడిన వేదిక కాదు. దానికి సిద్దాంతిని ప్రత్యక్షంగా కలవాల్సిఉంటుంది. ఆ ఏర్పాటు తొందరలొ ఉంది.

కొందరు ఇప్పుడెలా ఉంది భవిష్యత్తులో ఎలా ఉంటుంది అని అడిగారు.నక్షత్రాల వారీగా ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది అనేది మేము ప్రతీ సోమవారంనుండి ఆదివారం వరకు రాశిఫలాల పేరున సమాచారం అందిస్తూ ఉన్నాము. భవిష్యత్తుగురించి స్థూలంగా చెప్పడం జరుగుతుంది. ప్రశ్న స్పష్టంగా లేకపోయినా / ప్రశ్న సరిగ్గా అర్థంగా లేకపోయినా /సమాచారం సరిగ్గా ఇవ్వకున్నా సమాధానం అందించబడదని గమనించాలి. (అలాంటివి కొన్ని ప్రశ్నలు విడిచాము). ఈ రొజు నుండి పై విధంగా కొనసాగుతుంది.ఇప్పటి వరకు పంపిన ప్రశ్నలను స్పష్టంగా పరిశీలించి. మొదటి విడతగా ప్రచురిస్తాము.

మరో విషయం కూడా పాఠకులు గమనంలోకి తీసుకోవాలి. కుటుంబ సభ్యులందరి వివరాలు అడగడం కూడా సరి కాదు. పాఠకులు విపరీతంగా ప్రశ్నలు పంపుతున్నందుకు క్లుప్తంగా, ఒకే ప్రశ్న వేస్తే బాగుంటుంది. మరికొంత సమయం తీసుకుని మళ్లీ అడిగే అవకాశాన్ని వినియోగించుకోవాలని మనవి.

మీ ప్రశ్నలను, సందేహాలను పంపించాల్సిన ఈ మెయిల్ అడ్రస్ [email protected]

English summary
It is appealed to the readers that they shpuld follow few steps to in sending queries to astrologer Maruthi Sharama
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X