వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

2,50,000 సంవత్సరాల క్రితమే భూమిపైకి వచ్చిన ఏలియన్స్!

|
Google Oneindia TeluguNews

బెర్న్: భూమి పైన చాలా ఏళ్ల క్రితమే ఏలియన్స్ (గ్రహాంతరవాసులు) సంచరించారా? అంటే అవుననే అంటున్నారు శాస్త్రవేత్తలు. ఏలియన్స్ ఇక్కడ సంచరించారనేందుకు మరో ఆధారం లభించిందని చెబుతున్నారు సైంటిస్ట్‌లు.

1970లో రోమేనియాలో దొరికిన పెద్ద లోహం శాస్త్రవేత్తలకు ఆధారంగా మారింది. ఇటీవల స్విజర్లాండ్‌లోని లాసనే లాబరేటరీలో దీనిని శాస్త్రవేత్తలు పరిశీలించారు. ఇందులో షాకింగ్ వాస్తవం తెలిసింది. ఈ లోహం 2.50,000 నాటిదిగా గుర్తించారు.

aliens

లోహం 90 శాతం అల్యూమినియంతో తయారు చేసి ఉండడం ప్రతీ ఒక్కరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అల్యూమినియాన్ని కేవలం 200 సంవత్సరాల నుంచి మాత్రమే తయారు చేస్తున్నామని, 2,50,000 క్రితం అల్యూమినియం లభించే అవకాశమే లేదంటున్నారు.

మేనియన్ యుఎఫ్‌ఓ లాజిస్టిక్స్ అసోషియేషన్ డిఫ్యూటీ డైరెక్టర్ ఘోర్జీ కోహెల్ దీనిపై మాట్లాడారు. ప్రస్తుత టెక్నాలజీ ప్రకారం ఇలాంటి లోహాలు తయారీ అసాధ్యమన్నారు. రెండు ఎముకల గూడుల మధ్యలో ఈ లోహం లభించిందని, ఇది గ్రహాంతర వాసులకు సంబంధించిన లోహంగా భావిస్తున్నామన్నారు. గ్రహాంతర వాసులు భూమిపై సంచరిస్తున్నారనడానికి ఇదే ఉదాహరణ అని తెలిపారు.

English summary
Investigator claims 'UFO wreckage' shows aliens visited the Earth 250000 years ago.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X