హేవలంబి నామ సంవత్సరం: కర్కాటక రాశి ఫలాలు

Posted By:
Subscribe to Oneindia Telugu

కర్కాటక రాశివారు (పునర్వసు 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు)

ఆదాయం - 14 వ్యయం - 2 రాజ్యపూజ్యం - 6 అవమానం - 6

గురుడు సెప్టెంబర్‌ వరకు కన్యలో వక్రమనం వలన కింది ఫలితాల తీవ్రంగా ఉంటాయి. ఈ దశ మంచిది కాదు. ఒడుదుడుకులు, ఇబ్బందులు, చేయు వృత్తుల యందు ధన నష్టము మరియు వృత్తి నష్టము. వృత్తి వ్యవహారములలో జాగ్రత్త అవసరము. పై అధికారుల నుండి ఇతర ఉద్యోగుల నుండి వ్యతిరేకము. సోదరులతోను, స్నేహితులతోను వాదోపవాదములకు దూరముగా ఉండగలరు. కొందరికి స్నేహితుడుగాని, బంధువుగాని దూరమగుదురు. మీ యొక్క, మీ జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యము మందగించి రోగములు సంభవించును, శరీర శ్రమ, ఆతృత మిమ్మల్ని కుంగదీయును. ప్రయాణములను వాయిదా వేయవలెను. గృహములో శుభ కార్యములు చేయుదురు లేదా వివాహము జరుగవచ్చును.

11 సెప్టెంబర్‌ నుండి గురుడి తులలో సంచరించుట వలన. ఇది మీకు ఆందోళనను కలిగిస్తుంది. వృత్తిలో కష్టించి పనిచేయవలసి వస్తుంది. ప్రమోషన్లు అనుకున్న సమయములో రావు. అనవసరపు విషయాలలో/స్థిరాస్టి కొనుగోలు విషయాలలో తల దూర్చరాదు. శత్రువులకు దూరముగా ఉండవలెను. అయిన వారితోను, స్నేహితులతోను మంచిగా మసలుకొనవలెను. బాధలో ఉన్న వారిని పరామర్శిస్తారు. ఆర్థికముగా కలసి రాని కాలము. అనవసరపు ఖర్చులు, ప్రయాణాలు చేయరాదు. మీ ఆరోగ్యము, తల్లి ఆరోగ్యము పై శ్రద్ధ చూపగలరు. ఈ సమయాలలో నిరుత్సాహముగాను, నీరసముగాను ఉందురు. ఈ సమయములలో జంతువులకు, ప్రయాణములకు దూరముగా ఉండవలెను. లేనిచో ప్రమాదములకు గురి కావలసి వస్తుంది. సంఘములో అందరితోను ఉన్నతంగా ప్రవర్తించాలి. లేనిచో మీకు అందరి వలన ఎదురు తనము లభిస్తుంది. అందరి వలన మాటలు పడతారు, మనస్తాపము పొందుతారు.

The Raasi Phalas of Hevalambi karkataka

శని 07 ఏప్రిల్‌ నుండి ధనులో వక్రమనం వలన ఈ దశ ఆర్థిక లాభమునకు దారితీయును. పాత బాకీలు తీర్చెదరు. ధనము అన్ని చోట్లయందు లభించును. మీరు స్థలమును గాని, ఇళ్లుగాని కొనగలరు. శత్రు జయము, ఆరోగ్యదాయకముగా ఉండవచ్చును.

శని21 జూన్‌ వృశ్చిక సంచారం వలన, ఈ దశ బాధను కలిగించును, కారణము లేకనే కలహములు, బంధు, మిత్రులు, సజ్జనులతో విరోధములు, అన్యప్తి పరిచయము, దుడుకుగా వ్యవహరించుట వలన అపకీర్తి సంభవించును. పనియందు శ్రద్ధ అవసరము. పనిలో కొత్త నిర్ణయాలు తీసుకొన్నపుడు జాగ్రత్త అవసరము, షేరు మార్కెటు లాభించదు. కొత్త పనులు చేపట్టిన అనుకున్న ఫలితములు సాధించలేరు. సొంత ఆరోగ్యము, భార్యా, పుత్రుల ఆరోగ్యముపై శ్రద్ధ అవసరము. పిల్లల ఆరోగ్య విషయములో అశ్రద్ధ తగదు. మనశ్శాంతి ఉండదు. జీవిత భాగస్వామిపై అసహనము పెరుగును. గృహములో సుఖశాంతుల కోసము పాటు పడాలి. విధ్యారులు చదువులో వెనుకబడతారు.

శనిఅక్టోబర్‌ 25నుండి ధనూరాశి సంచారం వలన. ఇంటా, బయటా బాగుండును. పై అధికారుల మనన్నలు పొందుదురు. స్నేహితులు మేలు చేయగలరు. వైవాహిక జీవితము మెరుగుపడును. సంతానము కలుగును. ఈ కాలములో బంధు వర్గము వారు మీతో సంతోషముగా ఉందురు.

ఆగస్ట్‌ 18 వరకు రాహువు సింహరాశి సంచారం వలన, ఈ దశలో ఆర్థికముగా, శారీరకముగా, సంఘపరముగా ఇబ్బందులు కలుగవచ్చును. మితముగా ఖర్చు చేయుట మంచిది. అనుకోని ఖర్చులు, దొంగతనము జరగవచ్చును. శరీరముపై జాగ్రత్త అవసరము, అకాల భోజనము, బయట భోజనము చేయుట పనికి రాదు. నేత్రములకు హాని, భాగస్వామి ఆరోగ్య భంగము కలుగవచ్చును. కేతువు అష్టమమునందు ప్రవేశము:-
ఈ దశ ప్రభావముచే మీరు అనారోగ్యముతో బాధ పడుదురు. కావున, ఆరోగ్యముపై ప్రత్యేక శ్రద్ధ వహించి జాగ్రత్తగా మెలగాలి. ఈ దశలో చాలా రోగములు రావడానికి అవకాశములున్నవి. జ్వరము, ఒంటి నొప్పులు, శరీరములో వివిధ భాగాలకు తీవ్రమైన నొప్పి కలుగవచ్చును. మనశ్శాంతి పూర్తిగా కోల్పోతారు. గృహమునందు జరిగిన ఒక చెడ్డపని మిమ్మల్ని బాధకు గురి చేస్తుంది. మితముగా ఖర్చు పెట్టవలెను.

ఆగస్ట్‌ 18 నుండి రాహువు కర్కాటకరాశి సంచారం వలన,

ఈ దశలో విపరీతమైన చెడు మార్పులు వచ్చును. ధన నష్టము, దుబారా/అనవసరపు ఖర్చులు కలుగవచ్చును. శత్రువులతో జాగ్రత్తగా మెలగవలెను. అనుకోని ఇబ్బందులు వృత్తి వ్యవహారములలో సంభవించును. చెడు సహవాసములకు దూరముగా ఉండవలెను. శరీరముపై శ్రద్ధ అవసరము. కేతువు సప్తమమునందు ప్రవేశము:- ఈ దశ మిమ్మల్ని ఇబ్బందికి గురి చేయును. ఉదర సంబంధ వ్యాధులతో బాధపడతారు. నిరుత్సాహము, చిరాకు కలుగవచ్చును. మనశ్శాంతి లేక చింతకు గురి కాగలరు. అనవసరపు ఖర్చులు మంచిది కాదు. ఋణములు ఎట్టి పరిస్థితులలోను చేయరాదు. వ్యవసాయదారు వారి పంటను జాగ్రత్తగా కాపాడుకోవాలి, లేనిచో దొంగతనము జరుగుటకు అవకాశము ఉండవచ్చును. మీలో కొందరికి అనుకోని విధముగా వృత్తి వ్యవహారములలో అభివృద్ధి కలిగి, ఆర్థిక లాభము పొందుదురు.

సింహ రాశి ఫలితాల కోసం క్లిక్ చేయండి

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The Raasi Phalas of Hevalambi raasi Phalas have been given by the astrolger.
Please Wait while comments are loading...