వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హేవలంబి నామ సంవత్సరం: తుల రాశి ఫలాలు

హేవలంబి ఉగాది నామ సంవత్సరంలో ఏ రాశి ఫలితాలు ఎలా ఉంటాయనే వివరాలను ప్రముఖ జ్యోతిష్కుడు వన్ ఇండియా పాఠకుల కోసం ప్రత్యేకంగా అందించారు.

By Pratap
|
Google Oneindia TeluguNews

తుల రాశివారు (చిత్త 3,4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 1,2,3 పాదాలు)

ఆదాయం - 2 వ్యయం - 8 రాజ్యపూజ్యం - 1 అవమానం - 5

గురుడు సెప్టెంబర్‌ వరకు కన్యలో వక్రమనం వలన కింది ఫలితాల తీవ్రంగా ఉంటాయి. ఈ దశలో ఖర్చులు చేయుదురు. ధన వ్యయము ఎక్కువగా చేస్తారు. వ్యాపారాలు చేయుట కష్టతరము, ముఖ్యముగా పశువులు పాలించే వారి వ్యాపారములో కష్టాలు ఎక్కువ. అయితే కొందరు పుణ్య కార్యములు, శుభకార్యములకు ధనము ఖర్చు చేస్తారు. దూర ప్రయాణాలు చేస్తారు. ఈ సమయములో స్వగ్రామమునకు, సంతానానికి దూరముగా ఉండి గడపవలసి వస్తుంది. ఉద్యోగములో ఉన్న వారు పని యందు జాగ్రత్తగా ఉండుట అవసరము, లేదా ఉద్యోమునకు నష్టము వాటిల్లే ప్రమాదము ఉంది. ఈ సమయములో మీరు వింతగా ప్రవర్తిస్తారు. మానసికముగా, శారీరకముగా అనారోగ్యము, తెలియని బాధ, భయముతో గడుపుతారు. ప్రాణానికి ම హాని తెచ్చే ఏ పని చేయరాదు. అయిన వారితోను, అందరితోను మీరు చెడ్డగా వ్యవహరిస్తారు. మీలో కొంత సమయానికి మంచితనము నది. సంఘములోని వారు మీకు ఎదురు తిరుగుతారు. అపకీర్తి సంభవిస్తుంది. చెడు పనులకు దూరముగా ఉండగలరు. కొందరికి ధన లాభము, తద్వారా వాహన కొనుగోలు సంభవించవచ్చును.

The Raasi Phalas of Hevalambi tularasi

11 సెప్టెంబర్‌ నుండి గురుడి తులలో సంచరించుట వలన. ఈ దశ మీకు చెడు ఫలితములను ఇస్తుంది. ఈ సమయములో ఏ విధమైన అనారోగ్యము రాకుండా తగు జాగ్రత్త అవసరము. ఆరోగ్యానికి ముప్పు వచ్చే పనులు చేయరాదు. అనవసరపు ఖర్చుల వలన ధన సంభవిస్తుంది. దూర ప్రయాణాలను రదు చేసుకొనుట మంచిది, లేనిచో ఆశించిన ఫలితములు దక్కవు. పైగా ఇబ్బందులకు గురి కాగలరు. స్వగ్రామమునకు దూరముగా నివసించవలసి ఉంటుంది. నిరుద్యోగులకు నిరుత్సాహమే మిగులుతుంది. వృత్తి వ్యవహారములలో ఉన్న వారికి కూడా కష్టకాలము, పై అధికారులతో వాదోపవాదములకు దిగవద్దు. దీని వలన మానసిక శాంతి ఉండదు. కావున, తలపెట్టిన పనుల యందు మరింత శ్రద్ధ వహించినా అనుకున్న కాలములో అనుకున్న పనులు నెరవేరును.

చేస్తున్న ఉద్యోగము పోవుటకు అవకాశము ఉన్నది. ప్రభుత్వము నుండి ఒత్తిడి, కావున చేయు పనులందు జాగ్రత్త అవసరము. గృహమునందు కూడా ఎవరితోను వాదోపవాదములకు దిగకుండ, శాంతిగా ఉండుటకు ప్రయత్నించాలి. ఇతరులతో జాగ్రత్తగా మెలగాలి. నిర్ణయములు తీసుకున్నపుడు జాగ్రత్తగా ఆలోచించాలి. మనో నిబ్బరముతో మెలగాలి, లేదా మానసిక వ్యధతో బాధ పడతారు. కొందరు పాత సమస్యల నుండి ముక్తులు అవుతారు. సంతానము అభివృద్ధి జరుగుతుంది, దైవకార్యములపై శ్రద్ధ పెరుగుతుంది. విద్యార్ధులకు మంచి కాలము, సంఘములో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.

శని 07 ఏప్రిల్‌ నుండి ధనులో వక్రగమనం వలన కింది ఫలితాల తీవ్రంగా ఉంటాయి. ఈ దశ మీకు మంచి కాలము, ఆర్థికముగా బాగుండును. ధనము చాలా విధాలుగా లభిస్తుంది. ఏ పని తలపెట్టినా కలసి వచ్చును. వ్యవసాయదార్లకు, కోళ్ల పెంపకము వర్తకులకు అనుకూల సమయము, ధనార్ధన కలుగవచ్చును. మీతో కొందరు స్థిరాస్టి కొనుగోలు చేయుదురు. మొత్తం మీద ఆర్థిక పరముగా మంచి కాలము. నిరుద్యోగులకు మంచి ఉద్యోగవకాశములు కలుగును. ఉద్యోగస్తులకు పై పదవులు, జీతము పెరుగుదల, ఉన్నత స్థాయి పొందుదురు. మీ పనిని, శ్రద్ధని, చురుకుతనమును గుర్తిస్తారు.

శని21 జూన్‌ వృశ్చిక సంచారం వలన, ఇది ఒక గడుకాలము, అనుకున్న పనిలో ఆటంకాలు, ఆశించిన ఫలితాలు దక్కవు. మీరు ఉద్యోగములో ఉన్నటైతే ఆచి, తూచి నిర్ణయాలు తీసుకోవాలి. ఆర్థికముగా ఈ కాలము మంచిది కాదు. ఖర్చులు తగ్గించుకోవాలి. ధనాదాయములో అనేక రకములుగా చేతికి వచ్చి, మరుక్షణము మాయమగును. పితృ ఆస్థి గురించి అనవసర వాదనలకు దిగరాదు. దీని వలన మీ గౌరవమునకు ఆనందమునకు భంగము కలుగును. ఈ దశలో అనవసర వాగ్వివాదములకు దిగి, కొత్త శత్రువులను సంపాదిస్తారు. మీలో కొందరి మనస్తత్వము చెడు వైపు మళుతుంది. మీ గృహములోనే శత్రుత్వము పెరుగును.

అనవసరముగా జీవిత భాగస్వామిని బాధించరాదు. సంతానమును చక్కగా చూసుకొనవలెను. ఈ దశలో ఆరోగ్యముపై శ్రద్ధ చూపగలరు. నీరసము, నిరుత్సాహము కలుగును. చిన్న పని చేసినను తొందరగా అలసి పోవుదురు. కొందరు వేరే దేశములు వెళ్ల వలసి వచ్చును. అది మీకు ఆశ్చర్యమును కలిగించును.

శనిఅక్టోబర్‌ 25నుండి ధనూరాశి సంచారం వలన. సంఘములో మంచి పేరు సంపాదించు కొనగలరు. మీలో కొంత మంది తమ కింద పనులు చేయుటకు సేవకులను నియమించెదరు. మీకు వాక్చాతుర్యమును పొందగలరు. ఆరోగ్య లాభము, ఉత్సాహముగా ఉందురు. ఆనందముగా ఉందురు. గృహములో సుఖశాంతులు, వైవాహిక జీవితము సుఖముగా ఉండును. సోదర వర్గము, సంతానము మీకు చేదోడుగా ఉందురు. మీపట్ల ఇతరులకిగల విరోధాలు నశించి, మంచి కాలము కలసి వచ్చును. ప్రయాణములు సంభవించును.

ఆగస్ట్‌ 18 వరకు రాహువు సింహరాశి సంచారం వలన, ఈ దశ మంచి కాలము. ఆర్ధికముగా బాగుండును. అనుకోని విధముగా ధన లాభము, అన్ని చోట్ల నుండి లభించును. విదేశీ ప్రయాణముల వలన, సముద్ర వ్యాపారముల నుండి ధన లాభము, ఈ కాలంలో స్థిరాస్తి మరియు ఆభరణాలు కొందురు. ఇంట్లో పరిస్థితి బాగుండును. కేతువు పంచమమునందు ప్రవేశము:- ఈ దశ మిమ్మల్ని జీవితములో ఒడుదుడుకులను తెస్తుంది. చేతిలోనికి సొమ్ము వచ్చినట వచ్చి మాయమగును. విపరీతమైన అనవసరపు ఖర్చులు చేయుట సంభవము. సంతానము వలన కూడా విపరీత ఖర్చులు, మీలో కొందరు అనుకోని విధముగా ధనలాభము, ఋణములు చేయరాదు. చంద్రుని ప్రభావముచే ඩීදාළු ఆరోగ్యము మిమ్మల్ని కలవరపెడుతుండది. పిల్లల ఆరోగ్యముపై అశ్రద్ధ వలదు.

ఆగస్ట్‌ 18 నుండి రాహువు కర్కాటకరాశి సంచారం వలన, ఈ దశ మిశ్రమ ఫలితములను ఇచ్చును. మొదటి భాగము మంచి కాలము, మిగతా తర్వాత భాగము చెడు ఫలితములను ఇచ్చును. మీ వృత్తి వ్యవహారములలో ధనార్థన, పై అధికారులతో మంచిగా ఉన్నందు వలన వారి సహకారము లభిస్తుంది. తద్వారా మరిన్ని బాధ్యతలుపెరుగుతాయి. కేతువు చతుర్ధమునందు ప్రవేశము:- ఈ కాలములో ఇబ్బందులు ఎదుర్కొంటారు. కార్యసిద్ధి కొరకు ఎక్కువగా శ్రమించవలసి వస్తుంది. ఆర్ధిక పరముగా అంతగా కలసి వచ్చే దశకాదు. ఎక్కువ మొత్తములో ఋణములు చేయరాదు. విరోధములకు దూరముగా ఉండుట మంచిది. అలాగే స్థిరాస్థి విషయములో జాగ్రత్త అవసరము, లేదా దానిని కోల్పోదురు. ఆరోగ్యభంగము, ఆరోగ్యముపై తగినంత శ్రద్ధ చూపవలెను. వేడిగా దూరముగా ఉండగలరు. నిరుత్సాహము, అలసటగా ఉందురు.

వృశ్చిక రాశి ఫలితాల కోసం క్లిక్ చేయండివృశ్చిక రాశి ఫలితాల కోసం క్లిక్ చేయండి

English summary
The Raasi Phalas of Hevalambi raasi Phalas have been given by the astrolger.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X