వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హేవలంబి నామ సంవత్సరం: వృషభ రాశిఫలితాలు

హేవలంబి ఉగాది నామ సంవత్సరంలో ఏ రాశి ఫలితాలు ఎలా ఉంటాయనే వివరాలను ప్రముఖ జ్యోతిష్కుడు వన్ ఇండియా పాఠకుల కోసం ప్రత్యేకంగా అందించారు.

By Pratap
|
Google Oneindia TeluguNews

వృషభ రాశివారు (కృత్తిక 2,3,4 పాదాలూ, రోహిణి 4 పాదాలు, మృగశిర 1,2 పాదాలు)

ఆదాయం - 2 వ్యయం - 8 రాజ్యపూజ్యం -7 అవమానం - 3

గురుడు సెప్టెంబర్‌ వరకు కన్యలో వక్రమనం వలన కింది ఫలితాల తీవ్రంగా ఉంటాయి. ఈ సమయము మీకు ఆనందమును, జయమును కలిగిస్తుంది. కార్యసిద్ధి లభించి, పనిలో మరింత నిమగ్నలు అవుతారు. చేయు వృత్తి వ్యవహారములలో మంచి ఫలితములు లభించి, గౌరవములు పొంది మరిన్ని మంచి అవకాశములు, లాభమును గడిస్తారు. విధ్యారులకు మంచి కాలము, మంచి శిక్షణ లభించి, అనుకున్నవి సాధిస్తారు. ఆర్థికముగా ఇంటా, బయటా బాగుగా ఉంటుంది. పశువులను, ఇంటిని, వస్తువులను, ఆభరణములను, వస్తాలను కొనుగోలు చేస్తారు. పెళ్లికాని వారికి, మంచి సంబంధము లభించి, వివాహ యోగ్యము కలదు. వివాహితులకు సంతాన ప్రాప్తి, మీ ప్రవర్తన ఇంట్లోని వారితో చక్కగా ఉండి, లాభము పొందువారు, ఇంట్లో సేవకులను పెడతారు. గృహమునందు శుభకార్యములు మీరు నిర్వహిస్తారు. సంఘములో మంచిపేరు, ఉన్నత వ్యక్తుల పరిచయము ద్వారా లబ్ది పొందుతారు, చలాకీగా వ్యవహరించి, అన్ని విషయాలలోను విజయము సాధిస్తారు. మంచి సమయమును గడుపుతారు. సంఘములో గౌరవ మర్యాదలు పెరుగుతాయి, మనశ్శాంతితో ఉంటారు.

11 సెప్టెంబర్‌ నుండి గురుడి తులలో సంచరించుట వలన. ఈ సమయములో మీ జీవితములో చాలా చిక్కులు వచ్చును. ఇంటా, బయటా చెడ్డగా వ్యవహరించుట వలన శత్రువులు ఎక్కువ అవుతారు. మీరు అందరికి శత్రువుగా మారతారు. మీ శత్రువులు మిమ్మల్ని మరిన్ని కష్టాలకు గురి చేయగలరు. కావున, జాగ్రత్త అవసరము. ఆరోగ్యముపై శ్రద్ధ అవసరము, సంతోషముగా లేక అలసిపోతారు. సరైన ఔషధ సేవ అవసరము. పనియందు జాగ్రత్త అవసరము. లేనిచో ధనము, ಸ್ಥಿರ್ದ್ದಿ కోల్పోవుదురు. దొంగతనము, అగ్ని ప్రమాదము, ప్రభుత్వముచే ఏ తిరుగబాటు, మొదలగునవి చేయు వృత్తి వ్యవహారములలో జరుగును. ఉద్యోగులు, పైఅధికారులతోను, సహ ఉద్యోగులతోను కలసి మెలసి మెలగాలి. కొత్త సనులను వాయిదా వేయాలి. జీవిత భాగస్వామితో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎవరితోను తగువులు తెచ్చుకోకుండా అనవసరపు విషయాలలో తలదూర్చకుండా మసలుకోవాలి.

The Raasi Phalas of Hevalambi vrushaba

శని 07 ఏప్రిల్‌ నుండి ధనులో వక్రమనం వలన కింది ఫలితాల తీవ్రంగా ఉంటాయి. ఈ దశ మంచిది కాదు. కష్ట కాలము, వృత్తి వ్యవహారములు కలసి రావు. పని నష్టము సంభవించును. దురలవాటు, వ్యసనములు, చెడ్డవారితో సహవాసము, కొంతమంది జైలు పాలగుదురు. సంఘములో అపకీర్తి సంభవించవచ్చును. ప్రయాణాలు సంభవించును. మితముగా ఖర్చు పెట్టవలసి వచ్చును.

శని21 జూన్‌ వృశ్చిక సంచారం వలన, ఈ దశలో మీ జీవితము మందకొడిగా సాగుతుంది. ప్రతీ విషయములోను జాగ్రత్త పాటించాలి. ధన నష్టము, ఋణములు చేయరాదు. పని ఒత్తిడి పెరుగును. కష్టించి పని చేయాలి. భాగస్వామ్య వ్యాపారములో మిమ్మల్ని మోసము చేయుదురు. వృత్తి వ్యవహారములందు జాగ్రత్తగా పని చేయగలరు. విధ్యారులు చదువుపై నిగ్రహము పెటుట కష్టము. విదేశి ప్రయాణములు సంభవము. అయితే, కష్టాలు ఎదుర్కొందురు. స్థాన చలనము సంభవించును. ఆరోగ్యముపై శ్రద్ధ అవసరము, అనేక కరములైన వ్యాధులు కలుగును. భార్య, పిల్లల ఆరోగ్యముపై శ్రద్ధ అవసరము. గృహములో శాంతిగా ఉండాలి. జీవిత భాగస్వామి మరణము వలన మరో వివాహము సంభవించును. స్నేహితులతో మంచిగా మసలు కొనవలెను. లేనిచో స్నేహితులు దూరమగుదురు. ఈ దశలో మనశ్శాంతి కరువగును. అసహనము పెరుగును. అనవసర విషయాలలో తల దూర్చరాదు. ఎన్నికలలో నిలోనుటకు, కోరు విషయాలలోను మంచిది.

శనిఅక్టోబర్‌ 25నుండి ధనూరాశి సంచారం వలన. ఆరోగ్యముపై శ్రద్ధ చూపవలెను. ఆరోగ్య భంగము, ఇంటి పనులలో మీపై ఒత్తిడి పెరుగును. నక్షత్ర బలముచే కష్టకాలము ఎదుర్కొందురు. అయిన వారిని పోగొట్టు కొందురు. అనవసర విరోధములు తెచ్చుకొని గృహములోనే కొత్త శత్రుత్వము పెంచుకొందురు.

ఆగస్ట్‌ 18 వరకు రాహువు సింహరాశి సంచారం వలన, రాహువు చతుర్ధమునందు ప్రవేశము:- ఈ దశ అంత మంచిది కాదు. స్థిరాస్థిని కొనుగోలు విషయములో అతి జాగ్రత్త వహించవలెను. స్థల మార్పులు చేయుట అవసరము. స్థిరాస్థి కొనే ఆలోచన పక్కన పెట్టండి. రోగములు రాకుండా జాగ్రత్త పడగలరు. భార్య, పిల్లల ఆరోగ్యముపై శ్రద్ధ చూపగలరు. అన్ని విషయాలపైన ఆసక్తి తగ్గి గాబరా పొందుదురు. కేతువు దశమమునందు ప్రవేశము:-

చంద్రుని ప్రవాసముచే మిశ్రమ ఫలితములు కలుగును. ఈ కాలములో అనుకోని వ్యక్తుల వలన మీకు ధనార్ధన కలుగవచ్చును. వృత్తి వ్యవహారములలో ఎదుగుదల కలిగి, ధనాదాయము కలుగవచ్చును. అయితే, చెడు స్నేహితుల వలన కొందరికి ధన నష్టము కలిగి వస్తు నష్టము కూడా కలుగును. వృత్తి వ్యవహారములందు, వ్యాపారములందు అభివృద్ధి తగ్గవచ్చును. మనశ్శాంతి కోల్పోవుదురు.

ఆగస్ట్‌ 18 నుండి రాహువు కర్కాటకరాశి సంచారం వలన, ఈ దశ చెప్పుకోదగ్గ మార్పులు తెచ్చును. ఆర్ధికముగా మంచికాలము. ధనాదాయములు, అనేక రకములుగా చేతికి వచ్చును. ఆఖరికి శత్రువుల నుంచి కూడా ధనమును ఆశించగలరు. ఉద్యోగములో ఉన్నట్టయిన, జీతము పెరుగును, పేర్ల మార్కెట్లలో ఉన్న వారికి మంచి ఆదాయము సంభవించవచ్చును. కేతువు నవమమునందు ప్రవేశము:- ఈ దశలో ఆరోగ్యభంగము, మనశ్శాంతి లేకుండుట జరుగును. సంపాదించిన ధనమును లాటరీలకు ఖర్చు చేయుట వలన ధన నష్టము కలుగును. ధన నష్టము చేసి కష్టాలకు గురి కాగలరు. జాతి విరుద్ధమైన పనులు చేయుదురు. సోదర వర్గముతో విరోధములు పనికి రావు. స్నేహితులతోను, అయిన వారితోను మంచిగా ప్రవర్తించవలెను. లేనిచో వారు మీకు దూరము కాగలరు. ఈ సమయములో మీరు విదేశీ ప్రయాణములు లేదా ఎత్తైన ప్రదేశాలకు వెళ్లారు. మీరు వృత్తి వ్యవహారములలో శత్రువులచే మరియు విరోధులచే నష్టాన్ని చవి చూస్తారు.

మిథున రాశి ఫలితాల కోసం క్లిక్ చేయండిమిథున రాశి ఫలితాల కోసం క్లిక్ చేయండి

English summary
The Raasi Phalas of Hevalambi raasi Phalas have been given by the astrolger.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X