ఈ వారం రాశిఫలాలు: మార్చి 17 నుంచి 23వ తేదీ వరకు

By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: వన్ ఇండియా తెలుగు పాఠకుల కోసం ప్రముఖ జ్యోతిష్కుడు వారం వారం రాశిఫలాలను అందిస్తున్నారు. జ్యోతిశ్సాస్త్రంలో విశ్వవిద్యాలయం పట్టా పొందిన మారుతి శర్మ ఈ ఫలితాలను అందిస్తున్నారు.

Weekly Horoscope Raasi Phalalu

మేషం రాశివారు (అశ్విని4 పాదాలూ, భరణి 4పాదాలూ, కృత్తిక 1వ పాదము)

రవి మీనరాశి సంచారం వలన, వ్యతిరేఖ ఫలితాలనిస్తాడు. కొత్తచోట్లకువెళతారు, అనారోగ్యము కలుగుతుంది, నానావిధ నష్టము, కష్టాలు కలుగుతాయి, మిత్రులతో వైరం పొందుతారు, తాపము, అపాయము, వ్యాధి కలుగుతాయి, ఉద్యోగంలో వ్యాపారంలో నష్టాలు కలుగుతాయి, వ్యాకులత కలుగుతాయి, అధికార భంగము కలుగుతాయి, జ్వరవ్యాధి కలుగుతుంది. గోధులు, గోధుమపిండి పదార్థాలు రొట్టెల వంటివి, రాగి వస్తువులు- దానంచేయాలి. విష్ణుమూర్తికి పూజ, సూర్యోపాసన. లేదా ఈ దేవాలయాలు దర్శించడం మంచిది.

Weekly Horoscope Raasi Phalalu

వృషభ రాశివారు (కృత్తిక 2,3,4 పాదాలూ, రోహిణి 4 పాదాలు, మృగశిర 1,2 పాదాలు)

రవి మీనరాశి సంచారం వలన, అత్యంత అనుకూలమైన ఫలితాలను కల్పిస్తుంది. అనేక విధములైన లాభాలు కలుగుతాయి, వివాహాది శుభకార్యాలలో పాల్గొంటారు, ఆనందం, ఉత్సాహం పొందుతారు, ఆచార పాలన చేస్తారు, రుచికరమైన ఆహారం భుజిస్తారు, ఇతరులతో గౌరవం పొందుతారు, సంపద, ఉన్నత పదవి, జయము పొందుతారు, వ్యాధులు తగ్గుతారు, సంసారంలో సౌఖ్యం పొందుతారు, సంతానం ద్వారా సుఖం పొందుతారు.

Weekly Horoscope Raasi Phalalu

మిథున రాశివారు (మృగశిర 3,4 పాదాలు, ఆర్ద్ర 4 పాదాలు, పునర్వసు 1,2,3 పాదాలు)

రవి మీనరాశి సంచారం వలన, ఈ స్థానంలో రవి చలనము మిక్కిలి అనుకూల ఫలములు ఇవ్వగలదు. కర్మ సిద్ధి కలుగుతుంది, ధన లాభము, ఆరోగ్యము, అధికారుల ప్రసన్నత, బంధుసఖ్యత, రాజ దరశనము, మిత్రులతో సత్కాలక్షేపము, మనోలాస్సమైన సంభాషణ, కర్యదక్షత, ఉద్యోగప్రాప్తి, వ్యాపార వృద్ధి, సంపదలు, జయము, వాంఛిత ఫలసిద్ధి, గౌరము, అధికారుల ఆదరణ, క్రమమైన అభివృద్ధి, అర్థలాభము, ఉద్యోగమందు ఉన్నత స్థితి, వ్యాధిరాహిత్యత.

Weekly Horoscope Raasi Phalalu

కర్కాటక రాశివారు (పునర్వసు 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు)

రవి మీనరాశి సంచారం వలన, అవమానము పొందుతారు, ప్రమాదములు కలుగుతాయి, పుణ్య బలం తగ్గుతుంది, ధన నష్టము, మనస్తాపము, అకారణ విరోధము, విచారం, పెద్దలతో అభిప్రాయబేధములు, బంధువులతో వైరము, ఆప్త మిత్రుల నుండి ఎడబాటు కలుగుతుంది, నిరాశ కలుగుతుంది, ధన సంబంధమైన ఇక్కట్లు కలుగుతుంది, అశాంతి, దీన స్థితి పొందుతారు. గోధులు, గోధుమపిండి పదార్థాలు రొట్టెల వంటివి, రాగి వస్తువులు- దానంచేయాలి. విష్ణుమూర్తికి పూజ, సూర్యోపాసన. లేదా ఈ దేవాలయాలు దర్శించడం మంచిది.

Weekly Horoscope Raasi Phalalu

సింహం రాశివారు (మఖ 4పాదాలూ, పుబ్బ 4 పాదాలూ, ఉత్తర 1 వపాదం)

రవి మీనరాశి సంచారం వలన, తీవ్ర దోష ఫలములు కలుగును, వ్యాధికలుగుతుంది, వాగ్వాదములు ఏర్పడుతుంది, శత్రువుల వల్లబాధలు కలుగుతాయి, అలసట పొందుతారు, దుర్వార్తలు వింటారు , భయము పొందుతారు, దుర్దోషములు కలుగుతాయి, శరీర తాపము ఏర్పడుతుంది, ప్రయాణములకు అవరోధములు ఏర్పడతాయి, మిత్రులతో విరోధము ఏర్పడుతుంది, అధిక వ్యయము ఏర్పడుతుంది, అధికారులతో ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి, భార్యతో విరోధము కలుగుతుంది, సంతానానికి అనారోగ్యము కలుగుతుంది, కోపము ఏర్పడుతంది, ఉద్రేకత కలుగుతుంది, రాజు లేదా పై అధికారుల వలన భయం కలుగుతుంది.

Weekly Horoscope Raasi Phalalu

కన్య రాశివారు (ఉత్తర 2,3,4 పాదాలు, హస్త 4 పాదాలూ, చిత్త 1,2 పాదాలు)

రవి మీనరాశి సంచారం వలన,శ్రమకరమైన ప్రయత్నాలు చేస్తారు, భార్యకు ఇబ్బందులు కలుగుతాయి, సంతానానికి అనారోగ్యం కలుగుతుంది, ఉత్సాహం భంగమవుతుంది, బంధు ద్వేషము కలుగుతుంది, గూఢ మర్మావయవ వ్యాధులు కలుగుతాయి, మిత్రవిరోధము ఏర్పడుతుంది, అనమానం, త్రిప్పట కలుగుతుంది, జీవిత భాగస్వామితో విరోధం ఏర్పడుతుంది, పొట్ట సంబంధ వ్యాధులు కలుగుతాయి, దైన్యము పొందుతారు, మానసిక ఆందోళన, అశాంతి, ఆతురత కలుగుతాయి.

Weekly Horoscope Raasi Phalalu

తుల రాశివారు (చిత్త 3,4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 1,2,3 పాదాలు)

రవి మీనరాశి సంచారం వలన, మిక్కిలి అనుకూల స్థానం షష్ఠం, శత్రువులు నశిస్తారు, మానసిక ప్రశాంతత కలుగుతుంది, కార్యసాధన కలుగతారు, దుఃఖములు తగ్గుతాయి, ధన ధాన్యములు వృద్ధిఅవుతాయి, అరోగ్యము కలుగుతారు, కొత్తవస్త్రాలు ధరిస్తారు, ప్రయత్న కార్యమందు విజయము కలుగుతుంది.

Weekly Horoscope Raasi Phalalu

వృశ్చిక రాశివారు (విశాఖ 4వ పాదం, అనూరాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు)

రవి మీనరాశి సంచారం వలన, మిక్కిలి దోషప్రదమైన స్థితి ఇది మనస్తాపము కలుగుతుంది, విరక్తి చెందుతారు, చేతగానివిధమగా వుంటుంది, మిత్రుల ద్వారా కష్టము పొందుతారు, బుద్ధిమాంద్యత పొందుతారు, అశాంతి కలుగుతుంది, సంతతికి అనారోగ్యం ఏర్పడుతుంది, శత్రుత్వము, వృత్తిలోభంగము కలుగుతుంది, మనోదు:ఖము, బంధువులకు దూరమౌతారు, చిక్కులు కలుగుతాయి, మనఃక్షోభ, తత్తరపాటు చెందుతారు.

Weekly Horoscope Raasi Phalalu

ధను రాశివారు (మూల 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1 వపాదం)

రవి మీనరాశి సంచారం వలన, చతుర్థ భావంలో రవి ప్రతికూల ఫలితాలిస్తాడు. గృహ సంబంధమైన చికాకులు ఏర్పడతాయి, అశాంతి ఏర్పడుతుంది, సౌఖ్యలోపిస్తుంది, హృదయ సంకటం కలుగుతుంది, వ్యాధి కలుగుతుంది, మార్గాయాసం, ప్రయాణాలవల్ల ఆయాసం పొందుతారు, దుఃఖము కలుగుతుంది, తృప్తికరమైన ఆహారం లభించక పోవుట, హీనతలు కలుగుతాయి, సుఖ సౌఖ్యములు భంగమౌతాయి, ఋణ బాధలు కలుగుతాయి. గోధులు, గోధుమపిండి పదార్థాలు రొట్టెల వంటివి, రాగి వస్తువులు- దానంచేయాలి. విష్ణుమూర్తికి పూజ, సూర్యోపాసన. లేదా ఈ దేవాలయాలు దర్శించడం మంచిది.

Weekly Horoscope Raasi Phalalu

మకర రాశివారు (ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణం 4 పాదాలు, ధనిష్ఠ 1,2 పాదాలు)

రవి మీనరాశి సంచారం వలన, అనుకూల స్థానం, శుభ ఫలితాలు లభిస్తాయి. అరోగ్యం పొందుతారు. ఇష్టమైన వస్తువులు సిద్ధిస్తాయి, మనోల్లాసం కలుగుతుంది, స్వంత చోట్లకువెళతారు, బంధువులతో ఇష్టాగోష్టి కలుస్తారు, కీర్తి కలుగుతుంది సుఖం ప్రాప్తిస్తుంది, ధైర్యము, సంసార సౌఖ్యం పొందుతారు.

Weekly Horoscope Raasi Phalalu

కుంభ రాశివారు (ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు)

రవి మీనరాశి సంచారం వలన, పరుషమైన వాక్యాలు మాట్లడతారు, ధన నష్టము కలుగుతుంది, మూర్ఖపు పట్టుదల ఏర్పడుతుంది, మనో సంకటము, మిత్రులతో శత్రుత్వము కలుగుతుంది, ఆతురత, భయము కలుగుతుంది, సుఖంకోల్పోతారు, వృధాప్రయాస చేస్తారు, చేసిన శ్రమకు ఫలితం దక్కదు, వంచన పాలవుతారు.

Weekly Horoscope Raasi Phalalu

మీన రాశివారు (పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు)

రవి మీనరాశి సంచారం వలన, అశుభ ఫలస్థానంలో ఉండుట వలన అనారోగ్యము కలుగుతుంది, అలసట, త్రిప్పుట, ఆందోళన, శరీర తాపము ఏర్పడుతుంది, మనస్సంకటము కలుగుతుంది, సంపద నష్టమవుతుంది, అకాలంలో భోజనము చేస్తారు, మిత్రులతో విరోధము ఏర్పడుతుంది, బంధువులతో విరోధము కలుగుతుంది, భయం, క్రోధం ఏర్పడుతుంది, వ్యాధి, ధననష్టం కలుగుతుంది, అందోళన పొందుతారు, కోపం వంటి ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి.

English summary
Horoscope and Jyothisham : An eminent scholar, Phd degree holder Maruthi Sharma is giving Raasi Phalalu.
Please Wait while comments are loading...