ఖమ్మం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తల వంచిన వైయస్ జగన్

By Staff
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్: పార్టీ అధిష్టానానికి దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి తనయుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి తల వంచినట్లే కనిపిస్తున్నారు. ఖమ్మం, రాజమండ్రి సంఘటనలతో ఆయన ఆత్మరక్షణలో పడ్డారు. తన వర్గానికి చెందిన నాయకులు, కార్యకర్తల అత్యుత్సాహం మొదటికే మోసం తెచ్చి పెట్టింది. ఈ అవకాశాన్ని వినియోగించుకుని రాష్ట్రంలోని సీనియర్ కాంగ్రెసు నాయకులు అధిష్ఠాన అంతరంగాన్ని గట్టిగా వినిపించారు. జగన్ పై మూకుమ్మడి దాడికి పాల్పడినట్లుగా ప్రకటనల వర్షం కురిపించారు. వి. హనుమంతరావు, కె.కేశవరావు, హర్ష కుమార్ వంటి నాయకులు జగన్ కు వ్యతిరేకంగా వ్యాఖ్య వర్షం కురిపించారు. మరో వైపు పిసిసి అధ్యక్షుడు డి. శ్రీనివాస్ వీడియో కాన్ఫరెన్స్ లను జగన్ వర్గీయులు అడ్డుకోవడంపై కూడా తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. ఈ విషయాన్ని అధిష్ఠానం తీవ్రంగా పరిగణించింది. ఇదంతా జగన్ కు వ్యతిరేకంగా పని చేశాయని చెప్పవచ్చు. అధిష్ఠానం భావించిన దాని కన్నా ముందుగానే జగన్ దారికి రావడానికి ఆ సంఘటనలు ఉపయోగపడ్డాయి.

బెంగుళూర్ లో ఉన్న జగన్ అధిష్ఠానానికి తన విధేయతను ప్రకటిస్తూ ప్రకటన విడుదల చేశారు. తాము సోనియాకు విధేయులమని ఆయన చెప్పారు. ఖమ్మం సంఘటనను ఖండించారు. నల్లకాలువలో జరిగిన వైయస్ సంస్మరణ సభలో కాంగ్రెసు ప్రస్తావన గానీ, సోనియా ప్రస్తావన గానీ చేయకుండా ధిక్కార స్వరం వినిపించడానికి సిద్ధమైన జగన్ ఆ తర్వాత మనసు మార్చుకున్నట్లు చెబుతున్నారు. మంత్రులు, శాసనసభ్యులు, పార్టీ నాయకులు ఒక్కరొక్కరే రోశయ్య నాయకత్వాన్ని అంగీకరించడానికి సిద్ధపడుతుండడం కూడా జగన్ ను పునరాలోచనలో పడేసినట్లు చెబుతున్నారు. బెంగుళూర్ లో జగన్ ను కాంగ్రెసు రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి వీరప్ప మొయిలీ సోమవారం కలిశారు. రాష్ట్ర మంత్రి ఎన్ రఘువీరా రెడ్డి కూడా కలిశారు. కెవిపి రామచందర్ రావు కూడా ఆయన వద్దకు వెళ్లారు. కాంగ్రెసు లెజిస్లేచర్ పార్టీ (సిఎల్పీ ) సమావేశంలో జగన్ వర్గీయులు ఏ విధమైన వ్యూహాన్ని అనుసరిస్తారనేది మాత్రం ఇంకా గోప్యంగానే ఉందని చెప్పవచ్చు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X